బొగ్గుల శ్రీనివాస్
బొగ్గుల శ్రీనివాస్ ప్రముఖ రచయిత, సమగ్ర సాహిత్య పరిశోధకుడు. జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ గారి మొత్తం రచనలల్ని వెలుగులోకి తీసుకు రావడమేకాక సమగ్రంగా పరిశోధించారు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]కర్నూలు జిల్లా, నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో చెన్నమ్మ, చెన్న రాయుడు దంపతులకు 1977, మార్చి 5 వ తేది జన్మించాడు. అల్లూరు గ్రామం కర్నూలు పట్టణానికి 25 కి.మీ దూరం లో ఉంది. ఎం.యస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేశారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై "పవన్ కల్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో" అనే పుస్తకంతో రాసి చాలా పాపులర్ అయ్యారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రాజకీయ దురుద్దేశంతోనే ఈ పుస్తకం రాశారని పవన్ అభిమాన సంఘాలు ఆందోళనలు చేట్టాయి.[1] 2014లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ హటావో - పాలిటిక్స్ బచావో పుస్తకాలను విక్రయిస్తున్న నేపథ్యంలో తనకు పవన్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలుపడంతో, దాంతో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించారు.[2] ఈ పుస్తకం ఎనమిది లక్షల నలభై ఐదువేల కాపీలు అమ్ముడయై చరిత్ర సృష్టించింది.
మూలాలు
[మార్చు]- ↑ http://www.sakshi.com/news/andhra-pradesh/no-buyers-for-hate-book-on-pawan-kalyan-196989 కక్షతోనే పవన్ కళ్యాణ్‌పై పుస్తక రచన
- ↑ http://www.sakshi.com/news/telangana/boggula-srinivas-ask-security-from-pawan-kalyan-fans-195652 'పవన్ కళ్యాణ్ హటావో' రచయితకు రక్షణ