బొజ్జి రాజారాం
బొజ్జి రాజారాం భారతీయ సాంకేతిక నిపుణుడు. కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్. వేలాడే రైలు స్కైబస్ రూపకర్తగా ప్రసిద్ధుడు.
1945 ఫిబ్రవరి 1 న విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో జన్మించిన రాజారాం, విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివాడు. ఆ తరువాత వాల్తేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ర్యాంక్‌తో పాసయ్యాడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ చేసిన తరువాత అక్కడే డాక్టరేటు కూడా పూర్తి చేశాడు. 1970లో రైల్వేశాఖలో చేరిన రాజారాం 2005 వరకూ వివిధ హోదాల్లో పనిచేశాడు. 1990లో ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక కొంకణ్ రైల్వే ప్రాజెక్టులో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశాడు. అత్యంత దుర్గమమైన కొంకణ్ రైల్వే ప్రాజెక్టు సాకారమవడం వెనుక రాజారాం కృషి ఎంతో ఉంది. 1998లో కొంకణ్ రైల్వేస్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ విరమణ చేశాడు.[1]
రాజారాం ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన అనేక ప్రాజెక్టులను పర్యవేక్షించిన ఈయన నిధుల నిర్వహణకు సంబంధించి ఆ బ్యాంకు ప్రశంసలు అందుకున్నారు. రైలు ప్రమాదాల నివారణకు రాజారాం రూపొందించిన యాంటీ కొల్లిషన్ డివైజ్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. కొంకణ్ రైల్వేలో ఉండగా ఆయన చేసిన పరిశోధనలకు 17 పేటెంట్లు లభించగా, గురుత్వశక్తితో రవాణా, విద్యుదుత్పత్తి సాధించే విధానం గ్రావిటీ పవర్‌హౌస్ టెక్నాలజీకి అమెరికా పేటెంట్ దక్కింది.[2]
టాటా, బీఈఎంఎల్, ఎస్సార్, గ్రాసిమ్, బజాజ్ ఎలక్ట్రికల్స్ వంటి 34 పారిశ్రామిక సంస్థల సహకారంతో రూపొందిన ప్రయోగాత్మక వేలాడే రైలు స్కైబస్ పెలైట్ ప్రాజెక్టు రాజరాం కృషి ఫలితమే. ఈ లైను మొట్టమొదటగా గోవాలో నిర్మించారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ స్కైబస్ - సాక్షి 01/06/2013
- ↑ "సూర్య భగవానుడున్నంత కాలం మనకేమి కొదవ? - ఆంధ్రభూమి 21/06/2012". Archived from the original on 2014-03-26. Retrieved 2013-06-01.
- ↑ ఓ ఐడియా.. బిల్లు తగ్గిస్తుంది - సాక్షి 01/06/2013