బొడ్రాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామ బొడ్రాయి

చాల వరకు పల్లెల్లో గ్రామానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉంటుంది. దానిని ఊరి వాకిలి (జనవ్యవహారంలో-ఉరాకిలి), చావిడి, గ్రామ ప్రవేశ ద్వారం మొదలగు పేర్లతో పిలుస్తారు. ఈ చావిడిలోనే మధ్యలో, నేలలో బొడ్రాయిని ఉంచుతారు. బొడ్రాయికి సంబంధించిన సంస్కృతి- సంప్రదాయాలలో ప్రాంతీయ వైవిధ్యం కనిపిస్తుంది. కొన్ని గ్రామాలలో ఊరి బయట కట్ట కట్టి కూడ ఉంచుతారు. చావిడిలో బొడ్రాయిని ఉంచిన గ్రామాలలో, ఊరి బయట లింగమయ్య పేరుతో మరో రాయిని ప్రతిష్ఠించి కట్ట కట్టి పూజిస్తారు. వివాహాల సందర్భాలలో ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళేటప్పుడు గానీ, బయటి ఆడపిల్లలు ఆ ఊరికి కొత్త కోడళ్ళుగా అడుగుపెట్టేటప్పుడు గానీ, గ్రామ ప్రవేశద్వారంలో ఉండే బొడ్రాయిని పూజించి గ్రామం విడిచి వెళ్ళడం గానీ, గ్రామంలోకి అడుగుపెట్టటం గానీ చేస్తారు. ఈ సందర్భంలో బొడ్రాయి దగ్గర పూజారులుగా గ్రామానికి సంబంధించిన బోయలు గానీ, తలారి (తలవరి/గ్రామ సేవకులు గా) పని చేసేవారు కాని ఉంటారు. అలాగే గ్రామ దేవరలు (ఈదమ్మ, సవారమ్మ, పెద్దమ్మ మొ.) చేసే సందర్భంలో ఉరాకిలిలోని ఈ బొడ్రాయి ముందే జంతువులను (దేవరపోతులను) బలి ఇవ్వటం సంప్రదాయం. చివరికి ఎవరైనా ఊర్లో చనిపోయినా, శవాన్ని సైతం ఉరాకిలిలోని ఈ బొడ్రాయి మార్గం గుండా ఊరు దాటించాల్సిందే. ఇప్పుడు గ్రామాలు విస్తరించడం వలన, భిన్న మతాలు ప్రవేశించడం వలన కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చావిడిలో, నేల నుండి ఎద్దుల బండి పరం తాకే ఎత్తులో (సుమారు మోకాలు ఎత్తు వరకు ఉండే విధంగా) బొడ్రాయిని ఉంచేవారు. కాలక్రమంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల వలన కేవలం చిన్న రాళ్ళుగా మాత్రమే కనిపిస్తున్నాయి. బొడ్రాయి ఫూర్తిగా నేలలో కనిపించకుండా మునిగిపోయినప్పుడు తిరిగి పునఃస్థాపన చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహి®

చిత్రాలు

[మార్చు]
బొడ్రాయి అంటే దాని పేరులోనే బొడ్డు రాయి అని ఉంది. అంటే గ్రామం మధ్యలో ఉండే రాయి అని అర్ధం. అంతేకాని ప్రవేశ ద్వారం కాదు
"https://te.wikipedia.org/w/index.php?title=బొడ్రాయి&oldid=3879726" నుండి వెలికితీశారు