Jump to content

వాకిలి

వికీపీడియా నుండి
వాకిలి
రకంప్రతి నెల
రూపం తీరువెబ్
యాజమాన్యంవాకిలి
సంపాదకులురవి వీరెల్లి
స్థాపించినది2012 డిసెంబర్ 25
కేంద్రంఉత్తర అమెరికా
జాలస్థలిhttp://www.vaakili.com

వాకిలి [1] లాభాపేక్ష లేని ఒక తెలుగు అంతర్జాల మాసపత్రిక. "ఉత్తమ స్థాయిలో వుండే సాహిత్యాన్ని ప్రచురించడం, ప్రోత్సహించడం! స్నేహపూర్వకమయిన/ఆరోగ్యకరమయిన సాహిత్య బంధాల్ని నిర్మించడం! స్వచ్చమయిన స్వేచ్చని గౌరవించే అరమరికలు లేని సాహిత్య సంభాషణకు వేదికగా నిలిచి, రచయితల్లో విమర్శనీ, ప్రశంసనీ సమహృదయంతో ఆహ్వానించే సహనాన్ని పెంచడం!" ఇవి ముఖ్య లక్ష్యాలుగా వాకిలి పత్రిక కవి అజంతా గారిని స్మరించుకుంటూ 2012 డిసెంబరు 25న అంతర్జాల పత్రికగా ఆవిష్కరించబడింది. రవి వీరెల్లి మరికొందరు ఔత్సాహిక సాహితీ మిత్రులు కలసి ఈ పత్రికను నడిపిస్తున్నారు.

రవి వీరెల్లి ప్రధాన సంపాదకులుగా, నారాయణస్వామి వెంకటయోగి, సుజాత బెడదకోట, కాసుల లింగారెడ్డి, ప్రవీణ కొల్లి సహసంపాదకులుగా 2012 నుండి 2013 డిసెంబరు వరకు వాకిలిని వార పత్రికలా నడిపించారు. "శుక్రవారం కవిత్వవారం" పేరుతొ వారం వారం కవిత్వాన్ని ప్రచురించారు. కథలు, కవితలు, సమీక్షలు, కబుర్లు, ముఖాముఖి, కవిత్వ అనువాదాలు (ఇతర భాషల నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి), నెల నెలా రచయితలు నిర్వహించే ప్రత్యేక శీర్షికలూ... ఇలా ముప్పైకి పైగా శీర్షికలున్న వాకిలిలో ప్రతీ నెలా దాదాపు నలభైకి పైగా రచనలు ప్రచురించారు.

పాఠకుల ప్రశంశలు పొందిన శీర్షికలు:

  1. ప్రఖ్యాత కవి, విమర్శకుడు అయిన అఫ్సర్ నిర్వహించిన ఆనవాలు శీర్షిక
  2. నీరెండ మెరుపు (కవిత్వ పరిచయం)
  3. సుజాత నిర్వహించిన చదువు శీర్షిక

2014 జనవరి నుండి మాస పత్రికగా మారిన వాకిలికి, రవి వీరెల్లి ప్రధాన సంపాదకులుగా, స్వాతికుమారి బండ్లమూడి సహసంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.

పాఠకుల ప్రశంశలు పొందిన శీర్షికలు:

  1. మైథిలి అబ్బరాజు నిర్వహించిన కడిమిచెట్టు
  2. కోడూరి విజయ్ కుమార్ నిర్వహిస్తున్న కిటికీలో ఆకాశం

ప్రముఖ కాలమిస్టులు

[మార్చు]
శీర్షిక కాలమిస్టు ప్రచురణ విషయాలు
ఆనవాలు[2] అఫ్సర్ కవిత్వ పరిచయం
చదువు[3] సుజాత బెడదకోట కథా, నవలా పరిచయం
కిటికీలో ఆకాశం[4] కోడూరి విజయ్ కుమార్ కవిత్వ పరిచయం
కడిమిచెట్టు [5] మైథిలి అబ్బరాజు పుస్తక పరిచయం

మూలాలు

[మార్చు]
  1. వాకిలి
  2. ఆనవాలు - అఫ్సర్
  3. చదువు - సుజాత బెడదకోట
  4. కిటికీలో ఆకాశం - కోడూరి విజయ్ కుమార్
  5. కడిమిచెట్టు - మైథిలి అబ్బరాజు
"https://te.wikipedia.org/w/index.php?title=వాకిలి&oldid=3457943" నుండి వెలికితీశారు