బొల్లం మల్లయ్య యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొల్లం మల్లయ్య యాదవ్‌
బొల్లం మల్లయ్య యాదవ్


పదవీ కాలం
 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం కోదాడ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965, ఆగస్టు 14
కరివిరాల, నడిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు వీరయ్య, వెరమ్మ
జీవిత భాగస్వామి ఇందిర
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

బొల్లం మల్లయ్య యాదవ్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున కోదాడ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

జననం, విద్య

[మార్చు]

మల్లయ్య యాదవ్ 1965, ఆగస్టు 14న వీరయ్య, వెరమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామంలో జన్మించాడు. 1992లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పూర్తిచేశాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మల్లయ్య యాదవ్ కు ఇందిరతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మల్లయ్య యాదవ్ 2009లో కోదాడ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 13,544 ఓట్లతో నాల్గవ స్థానంలో నిలిచాడు. 2012లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. పార్టీలో చురుగ్గా పనిచేసి సీనియర్ లీడర్ గా ఎదిగి కొంతకాలం టీడీపీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. అలాగే కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్‌గా కూడా పనిచేశాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోదాడగ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమడ పద్మావతి చేతిలో 13,437 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5] ఆ తరువాత టిడిపి పార్టీని విడిచిపెట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమడ పద్మవతిపై 378 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-23.
  2. "Kodad Assembly Election: TRS' Bollam Mallaiah Yadav wins the elections". www.timesnownews.com. Retrieved 2021-08-23.
  3. admin (2019-01-09). "Kodad MLA Bollam Mallaiah Yadav". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
  4. "Bollam Mallaiah Yadav | MLA | Karivirala | Nadigudem | Kodad | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-21. Retrieved 2021-08-23.
  5. "Bollam Mallaiah Yadav(TDP):Constituency- KODAD(NALGONDA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-23.
  6. "Bollam Mallaiah Yadav(TRS):Constituency- KODAD(SURYAPET) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-23.