బొల్లిముంత నాగేశ్వరరావు
స్వరూపం
బొల్లిముంత నాగేశ్వరరావు | |
---|---|
![]() 1985లో బొల్లిముంత నాగేశ్వరరావు | |
జననం | బొల్లిముంత నాగేశ్వరరావు 1945 జూలై 1[1] |
విద్య | బి.ఎ., బి.యిడి. |
విద్యాసంస్థ | ఆంధ్ర విశ్వవిద్యాలయం |
వృత్తి | ఉపాధ్యాయుడు |
వీటికి ప్రసిద్ధి | సినీ రచయిత |
బంధువులు | బొల్లిముంత శివరామకృష్ణ |
బొల్లిముంత నాగేశ్వరరావు నవలా రచయిత, కథా రచయిత. కొన్ని సినిమాలకు కథ, సంభాషణలు అందించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]బొల్లిముంత నాగేశ్వరరావు 1945, జూలై 1న బాపట్ల జిల్లా, కాకర్లమూడి గ్రామంలో జన్మించాడు. ఇతడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., బి.ఇడి చదివాడు. గుంటూరు జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.[2]
రచనలు
[మార్చు]ఇతడు 1969 నుండి రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇతని కథలు, గేయాలు, నాటికలు, నవలలు ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాసాహితి, ఆంధ్రజ్యోతి, విజయ, స్వాతి, అంకితం, ప్రతిభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని కొన్ని రచనలకు పోటీలలో బహుమతులు లభించాయి.
నవలలు
[మార్చు]- మరో మన్వంతరం
- మిస్ ఐ.ఏ.యస్.
- ప్రియే చారుశీలే
- పవనాలు
- సుఖీభవ
- టర్నింగ్ పాయింట్
- శోభ[3]
- వల
- ఆల్ ది బెస్ట్[4]
- లేటెస్ట్ లవ్
- కోడెనాగు
నాటకాలు/నాటికలు
[మార్చు]- జాగృతి
- తెర
- జనం తీర్పు[5]
కథలు
[మార్చు]- అగ్నిబావుటా
- అదోరకం ప్రేమకథ
- అనుకొన్నదొకటి...
- అప్పటికీ-ఇప్పటికీ...
- అమ్మ ఒడి
- అయిదో మనిషి
- అవిఘ్నమస్తు
- ఆనకట్ట
- ఆలోచన
- ఇంటా బయటా...
- ఇది ఆత్మలకథ
- ఇది చీకటిభూతం కథ
- ఇది భస్మాసురుల కథ
- ఇది సతీసహగమనం
- ఈ పెళ్లికథ చదవండి!
- ఉదయంలో కూకిన ప్రొద్దు
- ఎవరికి భయం
- ఒరులేయవి యొనరించిన
- ఓ డాక్టరు కథ
- ఓ ప్రేతాత్మ కథ
- ఓ రుణం కథ
- ఓ'రిజర్వు'పంచాయితీ కథ
- కళ్ళు
- కుక్కల్ని కరచిన కుందేళ్ల కథ
- చలించిన వలయం
- టిట్ ఫర్ టాట్
- డార్క్ స్టోరీ
- తండ్రులూ కొడుకులూ
- తప్పిపోయిన నోటు
- తాకట్టులో ఆయుధం!
- ది బిగినింగ్ ఆప్ ద్ ఎండ్
- దొంగలున్నారు జాగ్రత్త!
- నక్కలు
- నిధి
- నిరుద్యోగి లేఖ
- న్యాయపీఠం క్రింద...
- న్యాయమా...
- పతనమా! ఇది నీ పరాకాష్ఠ!
- పల్లంవీధి ప్రజలు
- పాటి దిబ్బలు
- పిచ్చుకలు
- పిన్ ప్లాగ్స్
- పెద్దమ్మ
- ప్రయోజనాలు
- బంగారు కడియం
- బదులు త్యాగాలు
- బిక్షకాదు విక్రయం
- మనీ ప్లస్ షి మైనస్ ఆత్మ
- మరో తీర్పు కథ
- మరో లింగరాజు కథ
- మల్లెలు
- ముళ్ళు...
- మొగిలిరేకు
- మోక్ష ప్రాప్తిరస్తు
- మోసపోయిన మోసం కథ
- రవి కమలం
- రెండశ్రువులు
- రొద
- లయన్స్ షేర్
- వడ్డించిన విస్తరి
- విగత స్మృతి
- విషాద భారతి
- వీణావిలాపం
- వ్యవహారమా? వక్రించకు
- శోభ
- శ్రమ నిష్ఫలమై...
- సంజాయిషీ
- సత్యం-శివాలు! సుందరపురం
- సినిమా నెగెటివ్
సినిమా రంగం
[మార్చు]విడుదల సం. | సినిమా పేరు | దర్శకుడు | కథా రచయితగా | సంభాషణల రచయితగా | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1995 | గుంటూరు గుండమ్మ కథ | జి.సి.శేఖర్ | ![]() |
||
2005 | దేవీఅభయం | కె. విజయసారథి | ![]() |
||
2007 | నవ్వులే నవ్వులు | డా.రావ్ | ![]() |
![]() |
"కోడెనాగు" నవల ఆధారంగా |
2009 | నేరము - శిక్ష | విజయ నిర్మల | ![]() |
"వల" నవల ఆధారంగా |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "రచయిత: బొల్లిముంత నాగేశ్వరరావు". కథానిలయం. కథానిలయం. Retrieved 25 January 2024.
- ↑ సంపాదకుడు (4 September 1985). "బొల్లిముంత నాగశ్వరరావు". ఆంధ్రప్రభ (వారపత్రిక): 10. Retrieved 26 January 2024.
- ↑ కలకత్తా నేషనల్ లైబ్రరీలో పుస్తక వివరాలు
- ↑ కలకత్తా నేషనల్ లైబ్రరీలో పుస్తక వివరాలు
- ↑ కలకత్తా నేషనల్ లైబ్రరీలో పుస్తక వివరాలు