బోజ్జగుంటపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బోజ్జగుంటపల్లి ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో కలకడ మండలంలో దేవలపల్లి గ్రామంలో ఒక పల్లెటూరు.[1]

బోజ్జగుంటపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం కలకడ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 517 291
ఎస్.టి.డి కోడ్

కలకడ గుర్రంకొండ మార్గమధ్యలో వున్నది ఈ బోజ్జగుంటపల్లి బోజ్జగుంటపల్లి అన్న పేరు రావడానికి కారణం ఊరికి తూర్పున గుంటి భావి దగ్గర ఒక పెద్ద గుండుకు దేవ దేవుడు జటాజుటదారి ఆయెన శ్రీ పరమశివుని ప్రతిమ, నందిస్వరుని రూపాలు సుందరంగా చెక్కబడినవి. ఆ గుండుకు ముందు 15 అడుగుల దూరంలో ప్రథమ పూజాదిపతి దేవ గనాదిపతి అయిన శ్రీ శ్రీ వినాయక స్వామి 6 అడుగుల నిజస్వరూప మైన ప్రతిమ ఉంది. అ ప్రతిమకు ముందుగ ఒక పవిత్రమైన కోనేరు వుంది . పూర్వం అందులో పవిత్ర స్నానాలు చేసేవారు అని చెప్పబడింది. మనకు వినాయకుడు అనగానే గుర్తుకువచ్చేది స్వామి బొజ్జ, ముందు గుంట (కోనేరు ) వుంది కావున బోజ్జ +గుంట = బోజ్జగుంటపల్లి అనే నామకరణం జరిగింది. ఇక ఊరు యొక్క గొప్పతనం విశిష్టతల విషయానికి వస్తే ఊరికి అన్ని దిక్కులా వివిధ రకాల దేవతల ఆలయాలు వున్నవి తూర్పున వినాయక స్వామి, పరమశివుడు. పడమరన విరుపాక్షమ్మ దేవాలయం ఉత్తరాన మా తమ్మ తల్లి ఆలయం దక్షిణాన కట్టమీద గంగమ్మ తల్లి ఆలయం . ఉరికి మధ్యలో ఆంజనేయ లక్ష్మణ సీత సమేతమైన శ్రీ సీతారామ స్వామి ఆలయం, నడివీధి గంగమ్మ ప్రతిమ, హిందువులకు నాగ శక్తికి విడదీయరాని సంబంధం వుంది ఈ ఊరిలో కూడా రచ్చబండ బండ దగ్గర రావి, వేప చెట్టుకింద పెనవేసుకున్న నాగల ప్రతిమలు వున్నవి . పెద్దలు ఎక్కడ రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్ళి చేసారు అని చెప్తారు. ఇన్నిరకాల దేవతల ఆశిస్సులతో ఈ పల్లెటూరు సుబిక్షముగ ఉంది. ఇక ఊరిలో వున్న కుటుంబాల సంక్య 50 జనాభా అంచనా 200. అందరు కమ్మ కులానికి చెందినవారు.ఈ ఊరిలో ఒక అంగన్ వాడి పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల వున్నది ఈ పాఠశాలకు చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఈ పాఠశాల నుండి వచ్చిన ప్రతి విద్యార్థిక్రమశిక్షణ ఆటల పాటలు వినయ విదేయతలతో మెలుగుతారు. ఈక్కడ చదివిన విద్యార్థులలో చాల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కొద్ది మంది విదేశాలలో వుద్యోగం చేస్తున్నారు.ఈ ఉరి ప్రజల ప్రధాన బలం ఐకమత్యత, ఈ ఉరి ప్రజలు ప్రతి పండుగను కలిసి మెలిసి జరుపుకుంటారు ముఖ్యమైన పండుగలు శ్రీ రామ నవమి పండుగ రోజు సీత రాముల విగ్రహాలను ప్రజలు ఊరేగింపుగా ఉరి మొత్తం తిప్పుతారు పండుగ రోజు రాత్రి అంత రాముల గుడిలో భక్తి శ్రద్ధలతో బజనలు చేస్తారు. మరొక ముఖ్యమైన పండుగ బోనాల పండుగ ఊరు సుభిక్షముగా పంటలు బాగా పండాలి అని కట్టమీద గంగమ్మ, విరుపాక్షమ్మ లకు కోళ్ళు పొట్టేళ్ళు బలి ఇస్తారు .ఇంకొక ముఖ్యమైన పండుగ వినాయక చవితి రోజున మట్టి వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో పూజించి 7,9 రోజులు లేదా 11 రోజులు తరువాత మంగళ వాయిద్యాల మధ్య వురేగిస్తూ నిమర్జనం చేస్తారు. అక్ష్యరాస్యత విషయంలో ఈ ఊరు చాలా ముందంజలో ఉంది. ఈ ఊరు నుండి 20 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు, 10 మంది వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంకా ఉన్నత చదువులు చదువుతున్న 30 మంది విద్యార్థులు ఉన్నారు..... ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులు వ్యవసాయం, వ్యాపారం వ్యవసాయం అనగా టామాటో, వరి, మామిడి, వివిధ రకాలైన కూరగాయలను విరివిగా ఆదునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పండిస్తారు.. వ్యాపారం రంగంలో రియల్ ఎస్టేట్, చెట్ల వ్యాపారం, ఫైనాన్స్, ఫెర్తిలిజేర్స్ ఇంకా వివిధ రకాల వ్యాపార రంగాలలో తమదైన శైలిలో రాణిస్తున్నారు.

వెలుపలి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-07-24.