బోయపాలెం (యడ్లపాడు)
బోయపాలెం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం.
బోయపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°11′22″N 80°15′39″E / 16.189379°N 80.260932°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | యడ్లపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522619 |
ఎస్.టి.డి కోడ్ |
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్ కళాశాల)
[మార్చు]1996లో ఈ సంస్థకు ప్రభుత్వం ఈ గ్రామములో 11 ఎకరాల స్థలాన్ని స్వంతంగా కేటాయించింది. అప్పట్లో ముళ్ళకంపలు, రాళ్ళ గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని, విద్యాసంస్థ అధికారులు పూర్తిగా శుభ్రం చేయించి పరిపాలన, బోధనా తరగతుల గదులు, వసతి సదుపాయలు నిర్మించారు. అప్పటి నుండి ఇక్కడ మొక్కలునాటే ప్రక్రియ చేపట్టినారు. అప్పటి నుండి మొదలైన హరిత విప్లవ సాధన ఉద్యమం, నేటికి రెండున్నరవేల మొక్కలకు చేరి, మండువేసవిలో కూడా ఎటు చూసినా పచ్చదనంతో నిలుచుచూ, సంస్థలో పనిచేసే అధ్యాపకుల ఆలోచనలకు, ఉపాధ్యాయ శిక్షణ పొందుచున్న విద్యార్థుల కృషికి తార్కాణంగా ఇలుచుచున్నది.
సాంఘిక సంక్క్షేమశాఖ గురుకుల పాఠశాల
[మార్చు]బోయపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటు చేయనున్న ఈ పాఠశాల భవనాల నిర్మాణానికి, 2017,ఫిబ్రవరి-22న శంకుస్థాపన ప్రారంభించెదరు. 2017-18 విద్యా సంవత్సరం నుండి ఈ పాఠశాలలో విద్యాబోధన నిర్వహించెదరు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం తరువాత ఈ గురుకుల పాఠశాలకే ఎక్కువ నిధులు కేటాయించడం విశేషం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
[మార్చు]శ్రీ పార్వతీదేవి అమ్మవారి ఆలయం
[మార్చు]శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహం
[మార్చు]87.3 అడుగుల ఎత్తయిన, జిల్లాలోనే అతి పెద్దదయిన ఈ భారీ విగ్రహాన్ని, బోయపాలెం గ్రామం వద్ద, జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న హరిహరక్షేత్ర ప్రాంగణంలో 1.2 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని 2015,మే-31వ తేదీ ఆదివారం ఉదయం 9-09 గంటలకు నిర్వహించారు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు