బ్రతుకే ఒక పండుగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రతుకే ఒక పండగ
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం శ్రీధర్,
సత్యప్రియ
నిర్మాణ సంస్థ కిరణ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

చిత్రకథ

[మార్చు]

రాధ అంధురాలు. అమె అందమంతా ఆమె సహనంలోనే వుంది.

మేనత్త ఆదిలక్ష్మి రాధ చేత ఇంటి చాకిరీ అంతా చేయిస్తూ; నానాకష్టాలు పెడుతూ వున్న భరించి ఆ నరకంలోనే పడివుంది. ఆదిలక్ష్మి అద్దెకిచ్చే ఒక గదిలో వుంటున్న బాబ్జి ఆమె కూతురు సుబ్బలక్ష్మితో ప్రేమాయణం సాగిస్తూ, ప్రియురాలి సహకారంతో తన మిత్రుడైన లా విద్యార్థి గోపాల్‌కు కూడా ఒక గది అద్దెకు ఇప్పిస్తాడు. ఆ ఇంటి ఆవరణలోనే అద్దెకుంటున్న మామ్మ అక్కడున్న వారి కందరికీ పెద్దదిక్కు; చేదోడు వాదోడుగా మానవత్వానికి మారుపేరుగా మెలుగుతూ ఉంది. రాధ అగచాట్లకు మామ్మ కన్నీరే సానుభూతి పలుకులు.

ఆ గుడ్డిదాన్ని గొడ్డును బాదినట్లు బాది ఆదిలక్ష్మి పెట్టే ఆ హింసాకాండనంతా చూచి సహించలేక గోపాల్ రాధను ఆ నరకం నుండి తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకుని వేరే కాపురం పెట్టాడు. బాబ్జి సుబ్బలక్ష్మిని ప్రేమించిన పాపానికి ఆ ఇంట కుక్కలతో బాటు బ్రతుకుతూనే ఉన్నాడు. క్రొత్త పనిమనిషి నిర్లక్ష్యానికి తట్టుకోలేక ఆదిలక్ష్మి రాధ ఇంటికి వెళ్ళి మరల రమ్మని బలవంతం చేసింది. మా ఇంటి వైపు కన్నెత్తి చూడవద్దని భార్యాభర్తలిద్దరూ ఆమెను బయటకు నడవమన్నారు. పగబూనిన ఆదిలక్ష్మి గోపాల్ మేనమామ వరహాలయ్య చెవిలో వూదింది.

రాధకు కంటి ఆపరేషన్ చేయబడి కళ్ళు వచ్చాయి. తన భర్త రాకకై రాధ వేయి కళ్ళతో నిరీక్షిస్తుంది. కానీ వరహాలయ్య ప్రత్యక్షమై తాను గోపాల్ మేనమామ అని తన కూతురు సీతకు గోపాల్‌కు అదివరకే వివాహమయ్యిందనీ, వారికొక బిడ్డ కూడా ఉన్నాడని, రాధ ఆ ఊరిలో ఉన్నంతవరకూ సీత బ్రతుకు ఎడారి పాలేనని ఒక కట్టుకథ చెప్పి రాధను నమ్మించాడు. పచ్చి అబద్ధాన్ని నమ్మిన అమాయకురాలు గోపాల్ జీవితమైనా సుఖపడుతుందని ఆశపడి, ఇక తన బ్రతుకు నిరర్థకమని ఆత్మహత్యకు తలపడింది. ఒక క్రిస్టియన్ ఫాదర్ రాధను రక్షించి తన కూతురువలె చూచుకుంటున్నాడు. రాధ గర్భవతి. గతాన్ని మరిపింప చేసేందుకు ఎలాగో ఒకలా గోపాల్‌కు సీతనిచ్చి పెళ్ళి చేశాడు వరహాలయ్య. వకీలు వృత్తిలో మనసు మార్చుకోసాగాడు గోపాల్.

రాధ మగశిశువును కన్నది. అబ్బాయి పేరు రవి. సీత ఒక ఆడపిల్లను కని మరణించింది. అమ్మాయి పేరు లత. సుబ్బలక్ష్మికి ఒక అబ్బాయి శేఖర్; ఒక అమ్మాయి జ్యోతి.

గోపాల్ జడ్జి కూడా అయ్యాడు. రవి ఎం.ఎస్.సి. పాస్ అయ్యాడు. తన స్వతంత్ర భావాలతో సంఘంలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనగల ధైర్యశాలి రవి.

విద్యార్థులను ఎరలుగా ఉపయోగించుకునే కోదండరమయ్య, వరహాలయ్య లాంటి రాజకీయవేత్తలనబడే స్వార్థపరుల ఆటలు సాగనివ్వకుండా విద్యార్థులను పెడత్రోవన పడనీకుండా కాపాడాడు రవి. లతలాంటి అమ్మాయిల జీవితాలను పాడుచేసే రాంబాబులాంటి హిప్పీలకు గుణపాఠం నేర్పించాలని ఒక కొట్లాటలో చిక్కు కోవడమేకాక రాంబాబును హత్య చేశాడనే నేరం అతనిపై మోపబడి జైలు పాలయ్యాడు. కోర్టులో రవికి వ్యతిరేకంగా సాక్షులు తీసుకు రాబడ్డారు.

జడ్జి గోపాలరావు దయామయుడని అతన్ని కలుసుకుంటే మేలు జరగవచ్చని ఫాదర్ రాధకు నచ్చజెప్పి పంపాడు. రాధ జడ్జిగారింటికి వచ్చింది. రవి తన ఒక్కగానొక్క కొడుకని, తనకు పుత్రభిక్ష పెట్టి న్యాయం చేకూర్చమని రాధ జడ్జిగారి పాదాలు పట్టుకుంది. చిరపరిచితమైన ఆ పాదాలు ఆమెకు గతాన్ని గుర్తుచేశాయి.

రవి తన కొడుకని తెలిసిన గోపాల్ తన కర్తవ్యాన్ని అర్థం చేసుకుని, జడ్జి పదవికి రాజీనామా ఇచ్చి డిఫెన్స్ లాయర్‌గా నిలబడ్డాడు.

రౌడీలకు వరహాలయ్య ఇచ్చిన ఐదు వేలు చాలకు అతనితో గొడవపడుతూ వుంటే విని కేసు వివరాలన్నీ తెలుసుకున్నాడు గోపాల్. రౌడీలను వరహాలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రవి నిర్దోషి అని వెల్లడైంది. ఆదిలక్ష్మి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. గోపాల్ రాధని, రవిని స్వీకరించాడు.

రవికి జ్యోతికి, శేఖర్‌కు లతకు వివాహం జరిగింది.[1]

మూలాలు

[మార్చు]
  1. "బ్రతుకే ఒక పండగ". విజయచిత్ర. 10 (1): 54–56. 1 July 1975.