బ్రహ్మ దేవాలయం, పుష్కర్
బ్రహ్మ దేవాలయం, పుష్కర్ | |
---|---|
బ్రహ్మ దేవాలయం, పుష్కర్[1] | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 26°29′14″N 74°33′15″E / 26.48722°N 74.55417°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | అజ్మీర్ |
ప్రదేశం | పుష్కర్ |
సంస్కృతి | |
దైవం | బ్రహ్మ |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | రాజస్థానీ ఆర్కిటెక్చర్ |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 14వ శతాబ్దం |
బ్రహ్మ దేవాలయం దీనిని జగత్పిత బ్రహ్మ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ వద్ద ఉన్న హిందూ దేవాలయం, ఇది పుష్కర్ సరస్సు ఒడ్డున ఉంది.[2] ఈ ఆలయ దైవం నాలుగు ముఖాల బ్రహ్మ. ప్రపంచంలోని అతి కొద్ది బ్రహ్మ దేవాలయాలలో ఇది కూడ ఒకటి. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ కార్తీక పూర్ణిమ సందర్భంగా పుష్కర్ సరస్సులో స్నానం చేసి, బ్రహ్మ ఆలయాన్ని సందర్శించడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం సన్యాసి శాఖ అర్చక వర్గంచే నిర్వహించబడుతుంది.[3]
పద్మ పురాణం
[మార్చు]'పద్మ పురాణం' ప్రకారం, వజ్రనప అనే రాక్షసుడు ప్రజలను హింసించడాన్ని చూసిన బ్రహ్మ దేవుడు వెంటనే తన ఆయుధమైన తామరపువ్వుతో రాక్షసుడిని సంహరించాడు. ఈ ప్రక్రియలో, తామర రేకులు మూడు ప్రదేశాలలో పడడం వలన అక్కడ మూడు సరస్సులు ఏర్పడ్డాయి.
అవి:
- పుష్కర్ సరస్సు లేదా జ్యేష్ట పుష్కర్ (మొదటి పుష్కర్)
- మధ్య పుష్కర్ (మధ్య పుష్కర్) సరస్సు
- కనిష్ట పుష్కర్ (అత్యల్ప లేదా చిన్న పుష్కర్) సరస్సు[4] [5] [6] [7]
అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రధాన పుష్కర్ సరస్సు వద్ద యజ్ఞం (అగ్ని యాగం) చేయాలని నిర్ణయించుకున్నాడు. రాక్షసుల దాడికి గురి కాకుండా శాంతియుతంగా తన యజ్ఞాన్ని నిర్వహించడానికి, అతను పుష్కర్ చుట్టూ కొండలను సృష్టించాడు - దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూర, తూర్పున సూర్యగిరి అంతేకాకుండా యజ్ఞ నిర్వహణను రక్షించడానికి దేవతలను అక్కడ కాపలాగా నియమించాడు. అయితే, యజ్ఞం చేస్తున్నప్పుడు, అతని భార్య సావిత్రి (సరస్వతి) తన సహచర దేవతలైన లక్ష్మి, పార్వతి, ఇంద్రాణిలను పిలవడానికి వెళ్తుంది, యజ్ఞంలో ముఖ్యమైన భాగాన్ని నిర్వహించడానికి ఆమె లేకపోవడం వలన ఓపిక లేక బ్రహ్మదేవుడు అక్కడే ఉన్న 'గుజర్' వంశానికి చెందిన 'గాయత్రి'ని వివాహం చేసుకుంటాడు. గాయత్రి, బ్రహ్మ దేవుని పక్కన కూర్చొని, ఆమె తలపై అమృత (జీవన అమృతం) కుండ పట్టుకొని ఆహుతి (బలి అర్పణ) ఇచ్చి యజ్ఞం పూర్తి చేస్తుంది.[4][5] చివరకు సావిత్రి వేదిక వద్దకు వచ్చినప్పుడు, గాయత్రి బ్రహ్మ పక్కనే కూర్చోవడం వలన కలత చెంది, 'బ్రహ్మదేవుడు ఎక్కడ పూజింపబడడు' అని సావిత్రి దేవి శపిస్తుంది. సావిత్రి, ఆ తర్వాత, రత్నగిరి కొండపైకి వెళ్లి, సావిత్రి జర్న (ప్రవాహం) గా పిలువబడే ఒక నీటి బుగ్గగా ఉద్భస్తుంది. ఆమె గౌరవార్థం అక్కడ ఒక ఆలయం ఉంది.[6]
చరిత్ర
[మార్చు]పుష్కర్‌లో 500 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయని చెబుతారు (80 పెద్దవి, మిగిలినవి చిన్నవి). వీటిలో చాలా పురాతనమైనవి, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో (1658-1707) నాశనం చేయబడినవి కానీ తరువాత పునర్నిర్మించబడ్డాయి. పుష్కర్ ఆలయాలలో ముఖ్యమైనది బ్రహ్మ దేవాలయం, ఇది 14వ శతాబ్దానికి చెందినది.[8] ఈ ఆలయాన్ని బ్రహ్మ యజ్ఞం చేసిన తర్వాత విశ్వామిత్ర ఋషి నిర్మించినట్లు చెబుతారు.[3] బ్రహ్మ స్వయంగా తన ఆలయం కోసం స్థలాన్ని ఎంచుకున్నాడని కూడా నమ్ముతారు. 8వ శతాబ్దలో ఆది శంకరాచార్యలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు, రత్లాం మహారాజు అయిన జవత్ రాజ్ ఈ ఆలయానికి మరమ్మత్తులు చేసినప్పటికీ, అసలు ఆలయ రూపకల్పన అలాగే ఉంది. సావిత్రి (సరస్వతి) శాపం ఫలితంగా, "హిందువుల పవిత్ర స్థలాలకు రాజు" గా, పుష్కర్ ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవాలయంగా వర్ణించబడింది.[9] భారతదేశంలో బ్రహ్మకు అంకితం చేయబడిన అతి కొద్ది దేవాలయాలలో ఇది ఒకటి, వాటిలో ఇది అత్యంత ముఖ్యమైనది. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్‌లోని ఒక కథనంలో పుష్కర్ సరస్సు ఒడ్డున ఉన్న బ్రహ్మ దేవాలయం ప్రపంచంలోని పది అత్యంత మతపరమైన నగరాలలో ఒకటిగా గుర్తించబడింది, భారతదేశంలోని హిందువులకు ఐదు పవిత్ర యాత్రా స్థలాలలో ఒకటిగా కూడా గుర్తించబడింది.[5]
ఆర్కిటెక్చర్
[మార్చు]ఈ ఆలయాన్ని రాతి పలకలు, కరిగిన సీసంతో కలిపిన దిమ్మెలతో నిర్మించారు. ఈ ఆలయ శిఖరం ఎరుపు రంగులో ఉంటుంది. శిఖరం దాదాపు 70 అడుగుల (21 మీ) ఎత్తు ఉంటుంది. మండపంలో వెండి తాబేలు ఉంది, ఇది గర్భగుడికి ఎదురుగా నేలపై ఉంది. బ్రహ్మ విగ్రహం పాలరాతితో తయారు చేయబడింది, 718 ఎడి లో ఆది శంకరులచే గర్భగుడిలో ప్రతిష్టించబడింది. బ్రహ్మ నాలుగు చేతులలో అక్షమాల (జపమాల), పుస్తకం, కూర్క (కుశ గడ్డి), కమండలం (నీటి కుండ) ఉంటాయి. గాయత్రీ విగ్రహం బ్రహ్మకు ఎడమవైపు ఉంటుంది. సరస్వతి విగ్రహం బ్రహ్మకు కుడివైపున ఉంటుంది. [10] [11] [12]
ఆరాధన
[మార్చు]ఈ ఆలయాన్ని పుష్కర్ సరస్సులో పవిత్ర స్నానం చేసిన తర్వాతనే సందర్శిస్తారు.[13] ఈ ఆలయం శీతాకాలంలో ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు, వేసవిలో ఉదయం 6:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది, మధ్యాహ్నం 1:30 నుండి 3:00 గంటల మధ్య ఆలయాన్ని మూసివేస్తారు.[3]
ఈ ఆలయంలో మూడు హారతులను నిర్వహిస్తారు.
- ఉదయం: ఉదయ మంగళ హారతి
- సాయంత్రం: సంధ్యా హారతి
- రాత్రి: శయన హారతి
ఇక్కడ గృహస్థులు (వివాహితులు) బ్రహ్మ దేవుడిని ఆరాధించడానికి గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. కేవలం సన్యాసులను మాత్రమే అనుమతిస్తారు. అందుచేత, యాత్రికుల నైవేద్యాలన్నీ ఆలయ బయటి హాలు నుండి సన్యాసి అయిన పూజారి ద్వారా ఇవ్వబడతాయి. పుష్కర్‌లో ఆలయ పూజారులు పరాశర గోత్రానికి చెందినవారు ఉంటారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి, కార్తీక పూర్ణిమ నాడు ఉత్సవాలు జరుగుతాయి.
ఇతర ఆలయాలు
[మార్చు]- అసోత్ర బ్రహ్మ దేవాలయం, బార్మర్
- ఆది బ్రహ్మ దేవాలయం, ఖోఖాన్, కులు వ్యాలీ
- బ్రహ్మ దేవాలయం, కుంభకోణం
- బ్రహ్మ కర్మాలి మందిర్, పానాజీ
- బ్రహ్మపురీశ్వర ఆలయం, తిరుపత్తూరు
మూలాలు
[మార్చు]- ↑ Official board pictured in File:Pushkar05.jpg
- ↑ "Brahma Temple Pushkar - Entry Fee, Visit Timings, Things To Do Pushkar". www.rajasthantourplanner.com. Retrieved 2023-07-04.
- ↑ 3.0 3.1 3.2 "Temple Profile: Mandir Shri Brahma Ji". Devasthan Department, Govt of Rajasthan. 2001–2002. Archived from the original on 13 February 2011. Retrieved 31 January 2010.
- ↑ 4.0 4.1 Bradnock, Robert; Roma Bradnock (2001). Rajasthan & Gujarat Handbook: The Travel Guide. Footprint Travel Guides. p. 161. ISBN 1-900949-92-X. Retrieved 2010-01-26.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ 5.0 5.1 5.2 "Ten of the World's Most Religious Cities". Pushkar. International Business Times. Archived from the original on 30 March 2009. Retrieved 2010-01-24.
- ↑ 6.0 6.1 Pilgrim Places of India. Prabhat Prakashan. p. 30. ISBN 81-87100-41-9. Retrieved 2010-01-26.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ Brown, Lindsay; Amelia Thomas (2008). Rajasthan, Delhi and Agra. Lonely Planet. pp. 209–10. ISBN 978-1-74104-690-8. Retrieved 2010-01-24.
- ↑ "Brahma Temple". Rajasthan Tourism- The Official website of Rajasthan. Government of Rajasthan. Archived from the original on 3 January 2010. Retrieved 30 January 2010.
- ↑ "Travel and Geography:Pushkar". Encyclopædia Britannica. Retrieved 2010-01-24.
- ↑ City Development Plan for Ajmer and Pushkar p. 215
- ↑ Deshpande, Aruna (2005). India: A Divine Destination. Crest Lublishing House. pp. 152–153. ISBN 978-81-242-0556-3.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ "A visit to Pushkar". The Hindu. Chennai, India. 2009-01-17. Archived from the original on 2012-11-07. Retrieved 2010-01-27.
- ↑ Bhalla, Kartar Singh (2005). Let's Know Festivals of India. Star Publications. ISBN 81-7650-165-4. Retrieved 2010-01-25.
{{cite book}}
:|work=
ignored (help)