Jump to content

పుష్కర్ సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 26°29′14″N 74°33′15″E / 26.48722°N 74.55417°E / 26.48722; 74.55417
వికీపీడియా నుండి
పుష్కర సరస్సు
పుష్కర సరస్సు is located in Rajasthan
పుష్కర సరస్సు
పుష్కర సరస్సు
ప్రదేశంపుష్కర్, రాజస్థాన్
అక్షాంశ,రేఖాంశాలు26°29′14″N 74°33′15″E / 26.48722°N 74.55417°E / 26.48722; 74.55417
సరస్సు రకంకృత్రిమ సరస్సు
సరస్సులోకి ప్రవాహంలూనీ నది]
వెలుపలికి ప్రవాహంలూనీ నది
పరీవాహక విస్తీర్ణం22 కి.మీ2 (8.5 చ. మై.)
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం22 కి.మీ2 (8.5 చ. మై.)
సరాసరి లోతు8 మీ. (26 అ.)
గరిష్ట లోతు10 మీ. (33 అ.)
నీటి ఘనపరిమాణం790,000 ఘనపు మీటరుs (28,000,000 ఘ.అ.)
ఉపరితల ఎత్తు530 మీ. (1,740 అ.)
ప్రాంతాలుపుష్కర్

పుష్కర్ పట్టణం చుట్టూ అభివృద్ధి చెందిన పుష్కర్ సరస్సు భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి శ్రేణి కొండల నడుమ ఉంది. నాగ్ పర్బాట్ ("పాము పర్వతం") అని పిలువబడే పర్వత శ్రేణి సరస్సును అజ్మీర్ నగరం నుండి వేరు చేస్తుంది. ఆరావళి కొండల యొక్క రెండు సమాంతర శ్రేణుల మధ్య ఈ లోయ ఏర్పడింది (ఎత్తులో 650–856 మీటర్లు (2,133–2,808 అ.) నైరుతి నుండి ఈశాన్యం వరకు విస్తరించి ఉంది.అజ్మీర్ కు వాయువ్య దిశలో 14 కిలోమీటర్లు (8.7 మైళ్ళు) దూరం లో ఉన్న ఒక ఆనకట్టను నిర్మించడం ద్వారా సృష్టించబడిన కృత్రిమ పుష్కర్ సరస్సు చుట్టూ మూడు వైపులా ఎడారులు, కొండలు ఉన్నాయి. [1] "సరస్సుల వర్గీకరణ" జాబితాలో ఈ సరస్సును "పవిత్ర సరస్సు" గా వర్గీకరించబడింది .

పరీవాహక ప్రాంతంలోని మట్టి, స్థలాకృతి ప్రధానంగా చాలా తక్కువ నీటి నిలుపుదల సామర్థ్యంతో ఇసుకతో ఉంటాయి. [1] సరస్సులోకి ప్రవహించే పుష్కర్ లోయ భూ వినియోగ నమూనాలో 30% విస్తీర్ణంలో స్థానభ్రమణం చెందిన ఇసుక దిబ్బలు, 30% కొండల క్రింద (అధోకరణం, బంజరు), ప్రవాహాలు, 40% వ్యవసాయ భూమి విస్తరించబడింది . [2]

వాతావరణం

[మార్చు]

ఈ ప్రాంతం పాక్షిక శుష్క వాతావరణం కలిగి ఉంటుంది. వేసవి యందు పొడి, వేడి, శీతాకాలంలో చల్లగా ఉంటుంది . మే, జూన్ వేసవి నెలలు ఎక్కువ వేడిగా ఉంటాయి, గరిష్టంగా 45 °C (113 °F) ఉష్ణోగ్రత ఉంటుంది. శీతాకాలంలో, గరిష్ట సగటు ఉష్ణోగ్రత 25–10 °C (77–50 °F) పరిధిలో ఉంటుంది . [1] జూలై, ఆగస్టు రెండు నెలల స్వల్ప వ్యవధిలో వర్షం ప్రధానంగా సంభవిస్తుంది. నమోదైన సగటు వర్షపాతం 400–600 మిల్లీమీటర్లు (16–24 అంగుళాలు) పరిధిలో ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి శీతాకాలాలలో కూడా కొన్ని సార్లు వర్షపాతం నమోదవుతుంది.

ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు, నైరుతిలో ఈశాన్య దిశలో వీచే బలమైన గాలులు ఇసుక దిబ్బల ఏర్పాటుకు తోడ్పడతాయి. [1]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

పుష్కర్ సరస్సు నిండినప్పుడు, చేపలు, ఇతర జల జీవాలతో సమృద్ధిగా ఉంటుంది. సరస్సు యొక్క లోతు గణనీయంగా తగ్గిపోయింది – గరిష్టంగా 9 మీటర్లు (30 అడుగులు) నుండి 1.5 మీటర్లు (4.9 అడుగులు) కన్నా తక్కువకు – ఫలితంగా 5–20 కిలోగ్రాములు (11–44 పౌండ్లు) బరువున్న పెద్ద చేపల మరణం, జిగట నీరు, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చేపలు మరణిస్తున్నాయి. సరస్సు, దాని లోయ ఉన్న ప్రాంతం శుష్కంగా ఉన్నందున, నమోదు చేయబడిన వృక్షజాలం, జంతుజాలం ఎడారి మొక్కలకు సంబంధించి ఉన్నాయి.వీటిలో బ్రహ్మజెముడు, ముళ్ళ పొదలు, అలాగే ఒంటెలు, పశువులు వంటి ఎడారి జంతువులు ఉన్నాయి. మనిషిని తినే మొసళ్ళు పుస్ఖర్ సరస్సులో ప్రమాదంగా ఉన్నాయి, దీని ఫలితంగా ప్రజలు మరణిస్తున్నారు. యాత్రికులకు ఈ వాస్తవం తెలుసి కూడా చాలామంది దీనిని అదృష్టంగా భావిస్తున్నారు . [3] మొసళ్ళను బ్రిటిష్ వారు వలలతో పట్టుకుని సమీపంలోని జలాశయానికి తరలించారు. [4]

దేవాలయాలు

[మార్చు]

పవిత్ర సరస్సు కాకుండా, పుష్కర్‌లో 500 కి పైగా దేవాలయాలు ఉన్నాయని చెబుతారు (80 పెద్దవి, మిగిలినవి చిన్నవి); ఈ అనేక పురాతన దేవాలయాలు ఔరంగజేబు యొక్క పాలనలో (1658-1707) ముసలామానుల దోపిడలతో నాశనం లేదా అపవిత్రం చేయబడ్డాయి.కాని తరువాత ఈ దేవాలయాలు పునరుద్ధరించబడినవి . వీటిలో ముఖ్యమైనది బ్రహ్మ ఆలయం. ప్రస్తుత నిర్మాణం 14 వ శతాబ్దానికి చెందినది అయినప్పటికీ, అసలు ఆలయం 2000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. [5] సావిత్రి శాపం కారణంగా పుష్కర్‌ను ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవాలయంగా వర్ణించారు.కానీ దీనిని "హిందువుల పవిత్ర స్థలాల రాజు" అని కూడా పిలుస్తారు. [6] ఇప్పుడు పుష్కర్ ఆలయం మాత్రమే బ్రహ్మ ఆలయంగా మిగిలి ఉండకపోయినా, ఇది ఇప్పటికీ భారతదేశంలో బ్రహ్మకు అంకితం చేయబడిన అతి కొద్ది ఆలయాలలో ఒకటిగా ప్రముఖమైనది. [7] పవిత్ర పురుషులు, మునుల సహా హిందూ యాత్రికులు పుష్కర్ సరస్సులో పవిత్ర స్నానం ఆచరించిన తరువాత ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. [8] సరస్సు చుట్టూ ఉన్న ఇతర ముఖ్యమైన దేవాలయాలు, వరాహ ఆలయం – వరాహ (విష్ణువు యొక్క కుర్మావతారం), సావిత్రి ఆలయం, గాయత్రి ఆలయం, బ్రహ్మ భార్యలకు అంకితం చేయబడ్డాయి.

ప్రస్తావనలు

[మార్చు]
  • "Assessment of Physico-Chemical Characteristics and Suggested Restoration Measures for Pushkar Lake, Ajmer Rajasthan (India)". Proceedings of International Conference TAAL 2007 held at Jaipur. Ministry of Environment and Forests Government of India. {{cite book}}: |work= ignored (help)
  • "Rajasthan Tourism Guide for Ajmer and Pushkar". Pushkar Lake. National Informatics Centre. July 2006. pp. 195–356. Archived from the original (pdf) on 21 September 2019. Retrieved 2010-01-24.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 City Development Plan for Ajmer and Pushkar p. 196
  2. City Development Plan for Ajmer and Pushkar p. 201
  3. Roy, Sumita; Annie Pothen; K. S. Sunita (2003). Aldous Huxley and Indian thought. Sterling Publishers Pvt. Ltd. p. 59. ISBN 8120724658. Retrieved 2010-01-26.
  4. Abram, David (2003). Rough guide to India. Rough Guides. p. 192. ISBN 1843530899. Retrieved 2010-01-26.
  5. Pippa de Bruyn; Keith Bain; Niloufer Venkatraman; Shonar Joshi. Frommer's India. Frommer's. Frommer's. pp. 437, 440. ISBN 9780470169087.
  6. Bansal, Sunita Pant (2005). Hindu Gods and Goddesses. Smriti Books. p. 23. ISBN 8187967722. Retrieved 2010-01-25. {{cite book}}: |work= ignored (help)
  7. Bradnock, Roma (2004). Footprint India. Footprint Travel Guides. pp. 354–355. ISBN 1904777007. Retrieved 2010-01-26. {{cite book}}: |work= ignored (help)
  8. Bhalla, Kartar Singh (2005). Let's Know Festivals of India. Star Publications. ISBN 8176501654. Retrieved 2010-01-25. {{cite book}}: |work= ignored (help)