బ్రిటిషు భారతదేశంలో ఏజెన్సీలు

వికీపీడియా నుండి
(బ్రిటిష్ భారతదేశంలో ఏజెన్సీలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బ్రిటిషు ఇండియాలో ఏజెన్సీ అనేది బ్రిటిషు ఇండియాలో అంతర్గత స్వయంప్రతిపత్తి కలిగిన లేదా అర్ధ స్వయం ప్రతిపత్తి కలిగిన పాలనా ప్రాంతం. దీని విదేశీ వ్యవహారాలను వైస్రాయ్ నియమించిన ఏజెంటు నిర్వహిస్తాడు.[1]

వివరణ

[మార్చు]

ఏజన్సీలలో కొన్ని పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన స్వయం-పరిపాలన కలిగిన సామంతరాజ్యాలు (సంస్థానాల లాగా) ఉంటాయి. వీటిలో ఏజెంటు, వైస్రాయ్ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. కొన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగాలుగా ఉన్న గిరిజన ప్రాంతాలుంటాయి. వీటి పరిపాలన పూర్తిగా ఏజెంటు నిర్వహిస్తాడు. రక్షిత ప్రాంతం లేదా రాచరిక సంస్థానాల ఏజెంటు సాధారణంగా తన పరిధిలో ఉండే భూభాగం వెలుపల నివసించేవాడు. అదే ప్రాంతంలో నివసించే ఏజెంటును రెసిడెంటు అంటారు. ఇతను సాధారణంగా ప్రక్కనే ఉన్న బ్రిటిషు జిల్లాకు కలెక్టరుగా ఉండేవాడు

ఏజెన్సీలలో సివిల్, క్రిమినల్ న్యాయం సాధారణంగా స్థానికంగా రూపొందించబడిన చట్టాల ద్వారా నిర్వహిస్తారు. ఈ ఏజెన్సీలలో ఇండియన్ పీనల్ కోడ్ వర్తించదు.

ఏజెన్సీల జాబితా

[మార్చు]

బ్రిటిష్ రాజ్ చరిత్రలో వివిధ సమయాల్లో వివిధ రాజకీయ సంస్థలను ఏర్పాటు చేసారు, విలీనం చేసారు, రద్దు చేసారు. ఈ జాబితాలో చారిత్రక కాలంతో సంబంధం లేకుండా అన్ని ఏజెన్సీలు ఉన్నాయి.

  • అడెన్ ఏజెన్సీ (1839-1859)
  • అల్వార్ ఏజెన్సీ (రాజ్‌పుటానా ఏజెన్సీకి చెందినది)
  • బాగెల్ఖండ్ ఏజెన్సీ మార్చి 1871/1933
  • బలూచిస్తాన్ ఏజెన్సీ
  • బనాస్ కాంత ఏజెన్సీ
  • బరోడా ఏజెన్సీ
  • బరోడా అండ్ గుజరాత్ ఏజెన్సీ
  • బరోడా, వెస్ట్రన్ స్టేట్స్ అండ్ గుజరాత్ ఏజెన్సీ
  • బెంగాల్ స్టేట్స్ ఏజెన్సీ
  • భోపాల్ ఏజెన్సీ 1818/1947-08-15
  • భోపావర్ ఏజెన్సీ 1882/1925 (మాల్వాతో విలీనం చేసి, మాల్వా, భోపావర్ ఏజన్సీని ఏర్పాటు చేసారు)
  • బికనీర్ ఏజెన్సీ (రాజ్‌పుటానా ఏజెన్సీకి చెందినది)
  • బుందేల్ఖండ్ ఏజెన్సీ 1811
  • సెంట్రల్ ఇండియా ఏజెన్సీ 1854
  • ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ
  • కచ్ ఏజెన్సీ
  • దక్కన్ స్టేట్స్ ఏజెన్సీ 1930లు
  • ఢిల్లీ ఏజెన్సీ
  • తూర్పు రాజ్‌పుటానా స్టేట్స్ ఏజెన్సీ (రాజ్‌పుటానా ఏజెన్సీకి చెందినది)
  • ఈస్టర్న్ స్టేట్స్ ఏజెన్సీ 1930లు
  • గంజాం కొండ ప్రాంతాల ఏజెన్సీ (మద్రాసు ప్రెసిడెన్సీ)
  • గిల్గిట్ ఏజెన్సీ 1889
  • కోటాహ్-ఝాలావర్ ఏజెన్సీ (రాజ్‌పుటానా ఏజెన్సీకి చెందినది)
  • హరౌతీ ఏజెన్సీ
  • హరౌతీ-టోంక్ ఏజెన్సీ (రాజ్‌పుటానా ఏజెన్సీకి చెందినది)
  • కైరా ఏజెన్సీ
  • కతియవార్ ఏజెన్సీ (బాంబే ప్రెసిడెన్సీ)
  • కోలాబా ఏజెన్సీ
  • కొల్హాపూర్ ఏజెన్సీ
  • మద్రాస్ స్టేట్స్ ఏజెన్సీ 1930లు
  • మహి కాంత ఏజెన్సీ (బాంబే ప్రెసిడెన్సీ)
  • మాల్వా ఏజెన్సీ
    • 1895-1925 (భోపావర్ ఏజెన్సీతో విలీనం చేసి మాల్వా, భోపావర్ ఏజెన్సీని ఏర్పాటు చేసారు.)
    • 1934 / 1947
  • మాల్వా, భోపావర్ ఏజెన్సీ 1925/1927 మాల్వా అండ్ సదరన్ స్టేట్స్ ఏజెన్సీగా పేరు మార్పు
  • మాల్వా అండ్ సదరన్ స్టేట్స్ ఏజెన్సీ 1927 పేరు మాల్వా అండ్ భోపావర్ ఏజెన్సీ/1934 మళ్ళీ మాల్వా ఏజెన్సీగా పేరు మార్పు
  • నాసిక్ ఏజెన్సీ
  • నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (ఎన్ఈఎఫ్ఏ)
  • నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ స్టేట్స్ ఏజెన్సీ
  • ఒరిస్సా ఏజెన్సీ 1905
  • పాలన్పూర్ ఏజెన్సీ 1819 (బొంబాయి ప్రెసిడెన్సీకి చెందినది, 1924 అక్టోబరు 10న విసాలో విలీనం చేసారు)
  • దక్కన్ స్టేట్స్ ఏజెన్సీ
  • పంజాబ్ స్టేట్స్ ఏజెన్సీ 1930లు
  • రాజ్‌పుటానా ఏజెన్సీ (మూడు రెసిడెన్సీలు, ఆరు ఏజెన్సీలతో కూడి ఉంటుంది)
  • రేవా కాంత ఏజెన్సీ (బాంబే ప్రెసిడెన్సీ)
  • సబర్కాంత ఏజెన్సీ
  • సూరత్ ఏజెన్సీ
  • థానా ఏజెన్సీ
  • విజాగపటం కొండ ప్రాంతాల ఏజెన్సీ (మద్రాసు ప్రెసిడెన్సీ)
  • వెస్ట్రన్ ఇండియా స్టేట్స్ ఏజెన్సీ (WISA)
  • పశ్చిమ రాజ్‌పూటానా స్టేట్స్ ఏజెన్సీ (రాజ్‌పుటానా ఏజెన్సీకి చెందినది, ఇది 1906 వరకు మేవార్ రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ఆ తరువాత ఇది వేరు చేసారు)

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఇండియన్ పొలిటికల్ సర్వీస్ (IPS)
  • బ్రిటిష్ ఇండియా ఉపవిభాగాలు

మూలాలు

[మార్చు]
  1. Great Britain India Office. The Imperial Gazetteer of India. Oxford: Clarendon Press, 1908.