ఈస్టర్న్ స్టేట్స్ ఏజెన్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈస్టర్న్ స్టేట్స్ ఏజెన్సీ
Location of ఈస్టర్న్ స్టేట్స్ ఏజెన్సీ
Capitalరాంచీ
States under AGG for Eastern States * త్రిపుర రాజ్యం
Government వంశపారంపర్య రాచరికాలపై బ్రిటిషు వారి పరోక్ష పాలన

ఈస్టర్న్ స్టేట్స్ ఏజెన్సీ అనేది బ్రిటిషు భారతదేశంలో ఏర్పాటు చేసిన తూర్పు భారతదేశంలోని సంస్థానాల ఏజెన్సీ లేదా సమూహం. ఇది మాజీ ఛత్తీస్‌గఢ్ స్టేట్స్ ఏజెన్సీ అండ్ ఒరిస్సా స్టేట్స్ ఏజెన్సీలను కలిపేసి 1933 లో సృష్టించారు; ఈ సమూహంలో, పాత ఏజెన్సీలు మార్పులేమీ లేకుండా అలాగే ఉన్నాయి. 1936 లో బెంగాల్ స్టేట్స్ ఏజెన్సీని దీనికి కలిపారు.

చరిత్ర

[మార్చు]

19వ శతాబ్దం నుండి సంస్థానాలు, ఒరిస్సా ఛోటా నాగ్‌పూర్ సామంత రాజ్యాలు బెంగాల్‌లో భాగంగా ఉండేవి కావు. కానీ బ్రిటిషు ప్రభుత్వం వాటితో సంబంధాలను మాత్రం, బెంగాల్ ప్రెసిడెన్సీ ద్వారానే నిర్వహించేది.

తూర్పు సంస్థానాల ఏజెన్సీ 1933 ఏప్రిల్ 1 న ఏర్పాటైంది. ఈ ఏజెన్సీ తూర్పు భారతదేశంలోని 42 సంస్థానాలతో కూడుకుంది. ఇవన్నీ ప్రస్తుత భారత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో ఉన్నాయి. 1933 లో తూర్పు రాజ్యాల ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి ముందు, ఒరిస్సా సామంత రాజ్యాలు, ఛోటా నాగ్‌పూర్ రాజ్యాలలోని 23 సంస్థానాలు బీహార్, ఒరిస్సాలోని బ్రిటిష్ ప్రావిన్సుల ఆధీనంలోను, మరో 16 సంస్థానాలు సెంట్రల్ ప్రావిన్సుల ఆధీనంలోను ఉండేవి.

బ్రిటిష్ రాజ్ కాలంలో చోటా నాగ్‌పూర్, ఒరిస్సా ప్రాంతం. రాజకీయ విభాగాలు. 1909 ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియా మ్యాప్ విభాగం.

ఏజెంట్ భారతదేశ గవర్నర్ జనరల్‌ అధీనంలో ఉండేవాడు. అతని పర్యవేక్షణలో ఇద్దరు రాజకీయ ఏజెంట్లు సంబల్‌పూర్, రాయ్‌పూర్‌లలో ఉండేవారు.[1]

1936 నవంబరు 1 న, కూచ్ బెహార్, త్రిపుర లను బెంగాల్ ప్రావిన్స్ నుండి తూర్పు రాష్ట్రాల ఏజెన్సీకి బదిలీ చేసారు.

1944 డిసెంబరు 1 న, ఈ ఏజెన్సీ హోదాను ఫస్ట్-క్లాస్ రెసిడెన్సీ స్థాయికి పెంచారు. ఈ సంస్థానాలను కలకత్తాలోని "రెసిడెంటు" క్రింద మూడు రాజకీయ సంస్థలుగా విభజించారు. ఒరిస్సా స్టేట్స్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం సంబల్‌పూర్‌లో ఉండగా, ఛత్తీస్‌గఢ్ స్టేట్స్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం రాయ్‌పూర్‌లోను, బెంగాల్ స్టేట్స్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం కలకత్తా లోనూ ఉంది. 1947లో భారతదేశం నుండి బ్రిటిష్ వారు వైదొలిగిన తర్వాత, సంస్థానాలు కొత్తగా ఏర్పడిన యూనియన్ ఆఫ్ ఇండియాలో చేరాయి. కొన్ని రాష్ట్రాలు ఈస్టర్న్ స్టేట్స్ యూనియన్‌ను ఏర్పాటు చేశాయి గానీ, అది విఫలమైంది.[2] తరువాత అవి భారతదేశంలోని మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో విలీనమయ్యాయి.[3] 2000 నవంబరులో మధ్య ప్రదేశ్ తూర్పు భాగాన్ని చత్తీస్‌గఢ్ గాను, బీహార్ దక్షిణ భాగాన్ని జార్ఖండ్ రాష్ట్రం గానూ విడిదీసారు.

ఈస్టర్న్ స్టేట్స్ ఏజెన్సీ లోని సంస్థానాలు

[మార్చు]

 

ఒరిస్సా స్టేట్స్ ఏజెన్సీ

[మార్చు]

ప్రాధాన్యత ప్రకారం సెల్యూట్ స్టేట్స్ :

  • కలహండి, బిరుదు: HH మహారాజా, 9-తుపాకుల వంశపారంపర్య వందనం
  • మయూర్‌భంజ్, బిరుదు: HH మహారాజా, 9-తుపాకుల వంశపారంపర్య వందనం
  • పాట్నా, బిరుదు: HH మహారాజా, 9-తుపాకుల వంశపారంపర్య వందనం
  • సోనేపూర్, బిరుదు: HH మహారాజా, 9-తుపాకుల వంశపారంపర్య వందనం

నాన్-సెల్యూట్ స్టేట్స్, అక్షర క్రమంలో :

 

ఛత్తీస్‌గఢ్ స్టేట్స్ ఏజెన్సీ

[మార్చు]

నాన్-సెల్యూట్ రాష్ట్రాలు మాత్రమే :

 

బెంగాల్ స్టేట్స్ ఏజెన్సీ

[మార్చు]

సెల్యూట్ స్టేట్స్ :

  • కూచ్ బెహార్, బిరుదు: మహారాజా, 13-తుపాకుల వంశపారంపర్య వందనం
  • త్రిపుర, బిరుదు: మహారాజా, 13 తుపాకుల వంశపారంపర్య వందనం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Devi, Bandita (1992). Some Aspects of British Administration in Orissa (1912–1936). Delhi: Academic Foundation. p. 213. ISBN 81-7188-072-X.
  2. Sadhna Sharma ed.
  3. Amalgamation of Princely States

మూస:Princely states of the Eastern States Agency