బ్రూస్ ఎడ్గార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రూస్ ఎడ్గర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్రూస్ అడ్రియన్ ఎడ్గర్
పుట్టిన తేదీ23 November 1956 (1956-11-23) (age 67)
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మారుపేరుబూట్సీ
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 143)1978 27 July - England తో
చివరి టెస్టు1986 21 August - England తో
తొలి వన్‌డే (క్యాప్ 30)1986 17 July - England తో
చివరి వన్‌డే1986 18 July - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1976/77–1989/90Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 39 64 175 119
చేసిన పరుగులు 1,958 1,814 11,304 3,893
బ్యాటింగు సగటు 30.59 30.74 40.22 37.79
100లు/50లు 3/12 1/10 24/61 4/22
అత్యుత్తమ స్కోరు 161 102* 203 147*
వేసిన బంతులు 18 12 164 18
వికెట్లు 0 0 2 0
బౌలింగు సగటు 46.99
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/0
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 12/– 94/1 31/0
మూలం: Cricinfo, 2017 16 December

బ్రూస్ అడ్రియన్ ఎడ్గర్ (జననం 1956, నవంబరు 23) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్‌ క్రికెట్ జట్టు తరపున టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ప్రాతినిధ్యం వహించాడు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజీలాండ్ ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా రాణించాడు.

1981లో, వన్డే ఇన్నింగ్స్‌లో 99 పరుగులతో నాటౌట్ అయిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు.[1][2]

ప్రారంభ జీవితం, ఆట[మార్చు]

ఎడ్గర్ 1956, నవంబరు 23న న్యూజీలాండ్‌లోని వెల్లింగ్‌టన్‌లో పుట్టి పెరిగాడు. ఇతని తండ్రి, ఆర్థర్, కొన్ని ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో వెల్లింగ్టన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎడ్గర్ రొంగోటై కళాశాలలో చదువుకున్నాడు. అక్కడ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. వెల్లింగ్టన్, తరువాత న్యూజీలాండ్ రెండింటికీ ఓపెనింగ్ చేశాడు.[3]

ఇంటర్నేషనల్స్‌ మ్యాచ్ లలో తోటి లెఫ్ట్ హ్యాండర్ జాన్ రైట్‌తో కలిసి విజయవంతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాడు.[4][5]

ఆట తర్వాత జీవితం[మార్చు]

సిడ్నీలోని గోర్డాన్ గ్రేడ్ క్రికెట్ క్లబ్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. 2010-11 సీజన్‌లో ఎడబ్ల్యూ గ్రీన్‌షీల్డ్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. క్లబ్ నిర్వహణలో ముఖ్య పాత్రను పోషించాడు.

2013 ఆగస్టులో, న్యూజీలాండ్ క్రికెట్‌లో జనరల్ మేనేజర్ నేషనల్ సెలెక్షన్‌లో పార్ట్-టైమ్ పదవిని చేపట్టేందుకు ఎడ్గర్ తన స్వదేశానికి తిరిగి వచ్చాడు.[6] ఎడ్గార్ 2015 మే లో తన పదవికి రాజీనామా చేశాడు. మరుసటి నెలలో, జేమీ సిడాన్స్ స్థానంలో ఎడ్గర్ మూడు సంవత్సరాల ఒప్పందంపై వెల్లింగ్టన్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[7]

మూలాలు[మార్చు]

  1. "Records | One-Day Internationals | Batting records | 99 not out (and 199, 299 etc) | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-03-23.
  2. "1st ODI: New Zealand v India at Auckland, Feb 14, 1981 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-03-23.
  3. Romanos, Joseph (16 August 2013). "Edgar should be in charge of New Zealand Cricket". The Timaru Herald.
  4. "All-round records | Test matches | Cricinfo Statsguru | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-03-23.
  5. "All-round records | One-Day Internationals | Cricinfo Statsguru | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-03-23.
  6. "Bruce Edgar New Zealand's new GM national selection". ESPN Cricinfo. 12 August 2013.
  7. Geenty, Mark (30 June 2015). "Former Black Cap Bruce Edgar named Wellington Firebirds coach". Stuff.co.nz.

బాహ్య మూలాలు[మార్చు]