భమిడిపాటి జగన్నాథరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భమిడిపాటి జగన్నాథరావు కృష్ణాజిల్లాకు చెందిన కథారచయిత. ఇతడు కృష్ణా జిల్లా, గుడివాడలో 1934, డిసెంబర్ 1న జన్మించాడు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్అడ్మినిస్ట్రేషన్‌లో ఎం.ఎ పట్టా పొందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌కు ప్రెస్ సెక్రెటరీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ గావించాడు.[1]

రచనలు[మార్చు]

ఇతడు వ్రాసినవి కొన్ని కథలే అయినా అవి పాఠకుల, విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇతని కథలు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మాభూమి, జ్యోతి, జయశ్రీ, ఆహ్వానం, తెలుగు స్వతంత్ర, వార్త, రచన, నవ్య, చినుకు, ఇండియా టుడే తదితర పత్రికలలో అచ్చయ్యాయి. మూడు కథా సంపుటాలుగా వెలువడ్డాయి.

కథల జాబితా[మార్చు]

కథానిలయంలో లభ్యమౌతున్న ఇతని కథలు కొన్ని:[2]

  1. అడుగుజాడలు
  2. అనుతాపం అనురాగం
  3. అపరంజి పంజరం
  4. చిత్రనళీయం
  5. చూపు
  6. చేదునిజం
  7. జాజిపూలు
  8. జీవనరాగం
  9. జీవితపు విలువలు
  10. దాహం
  11. నిప్పు
  12. పాపం! దీక్షితులు
  13. పురోగామి
  14. బంతి
  15. బొంగరం
  16. భావి పౌరులు
  17. మంటల్లో జాబిల్లి
  18. మువ్వలు
  19. రంగులకల
  20. లౌక్యుడు
  21. వంతెన
  22. వరహీనం
  23. విరుద్ద మనస్తత్వం
  24. వెన్నెలజల్లులు
  25. సముద్రం

పుస్తకాలు[మార్చు]

  1. భమిడిపాటి జగన్నాథరావు కథలు
  2. పరస్పరం
  3. మువ్వలు (కథాసంపుటి)
  4. అడుగు జాడలు (కథాసంపుటి)
  5. త్రిపుర ఓ జ్ఞాపకం (సంపాదకత్వం - అత్తలూరి నరసింహారావు, కె.కె.రామయ్యలతో కలిసి)

మూలాలు[మార్చు]

  1. Kartik Chandra, Dutt (1999). Who's who of Indian Writers, 1999: A-M. New Delhi: Sahitya Akademi. p. 479. ISBN 81-260-0873-3.
  2. వెబ్, మాస్టర్. "రచయిత: భమిడిపాటి జగన్నాథరావు". కథానిలయం. కాళీపట్నం రామారావు. Retrieved 29 October 2016.