Jump to content

భలే దొంగ

వికీపీడియా నుండి
(భలేదొంగ నుండి దారిమార్పు చెందింది)
భలేదొంగ
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం దేవి వరప్రసాద్
చిత్రానువాదం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం నందమూరి బాలకృష్ణ,
విజయశాంతి
సంగీతం కె. చక్రవర్తి
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ దేవి ఫిలింస్
భాష తెలుగు

భలే దొంగ 1989 లో వచ్చిన యాక్షన్ చిత్రం. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో దేవి ఫిల్మ్స్ పతాకంపై కె. దేవి వర ప్రసాద్ నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని ఖైదీ నెం .1 పేరుతో హిందీలోకి అనువదించారు.[1][2][3][4] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.

దొంగ, మారువేషాలు వెయ్యడంలో దిట్ట అయిన సురేంద్ర ( నందమూరి బాలకృష్ణ ), ఎప్పుడూ నగరాన్ని శాసిస్తూండే విధాత ( చరణ్ రాజ్ ) ను లక్ష్యంగా చేసుకుంటాడు. సమర్థవంతమైన పోలీసు అధికారిణి ఎస్పీ ఇంద్రాణి ( శారదా ) అతన్ని వెంటాడుతూ ఉంటుంది. దొంగిలించిన డబ్బుతో సురేంద్ర, ఓ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని కడుతున్నాడు. ఇంద్రాణి చెల్లెలు డాక్టర్ రేఖ ( విజయశాంతి ) సురేంద్ర మంచి హృదయంతో ప్రేరణ పొంది ఆయనను ప్రేమిస్తుంది.

అనేక ప్రయత్నాల తరువాత, ఒక రోజు సురేంద్రను రేఖ పట్టుకుంటుంది. అతను ఆమెకు తన గతాన్ని వెల్లడిస్తాడు. అతని తండ్రి ( రంగనాథ్ ) నిజాయితీ గల వ్యక్తి, తన భాగస్వామి విధాతతో కలిసి ఆసుపత్రి నిర్మాణం కోసం పట్టణ ప్రజల నుండి విరాళాలు సేకరించాడు. విధాత అతన్ని డబుల్ క్రాస్ చేసి, మొత్తం డబ్బును దొంగిలించి, నేరం తన తండ్రిపై మోపి, అతడి ఆత్మహత్యకు కారణమయ్యాడు. అందుకే విధాతపై సురేంద్ర ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.

సురేంద్రను ఇంద్రాణి మరోసారి అరెస్టు చేస్తుంది. అతడి క్షేమం కోసమే ఇలా చేస్తున్నానని ఆమె అతనికి చెబుతుంది. ఆమెకు విధాతతో వ్యక్తిగత పోరాటం ఉంది.అతడి అసలు పేరు విజయ్, ఆమె మాజీ ప్రేమికుడు. అతడు, ఆమె తల్లిదండ్రులను చంపాడు. ఆ తరువాత జైలు నుండి తప్పించుకున్నాడు. ఇప్పుడు సురేంద్ర, ఇంద్రాణి చేతులు కలుపుతారు. వారు విధాతపై ప్రతీకారం తీర్చుకోగలరా, సురేంద్ర ఆసుపత్రిని పూర్తి చేయగలరా అనేది మిగిలిన కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం. పాట పేరు గాయకులు పొడవు
1 "పెదవిని చూడు" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:32
2 "కన్నె పిల్ల" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:42
3 "మల్లెలో మ్యాచ్ మ్యాచ్" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:10
4 "ఏం ముద్దు" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:31
5 "ఆడిగింధి ఇస్తే" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:13

మూలాలు

[మార్చు]
  1. "Heading". Nth Wall. Archived from the original on 2015-01-22. Retrieved 2020-08-28.
  2. "Heading-2". Spicy Onion. Archived from the original on 2015-01-22. Retrieved 2020-08-28.
  3. "Heading-3". Chithr.co. Archived from the original on 2015-01-29. Retrieved 2020-08-28.
  4. "Heading-4". gomolo. Archived from the original on 2018-08-04. Retrieved 2020-08-28.
"https://te.wikipedia.org/w/index.php?title=భలే_దొంగ&oldid=4373517" నుండి వెలికితీశారు