భలే బ్రహ్మచారి
Jump to navigation
Jump to search
భలే బ్రహ్మచారి (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.ఎ.శంకరన్ |
---|---|
నిర్మాణం | చంద్రారెడ్డి |
తారాగణం | శివకుమార్, జయచిత్ర, కమల్ హాసన్, రాణిచంద్ర, చో, మనోరమ, తంగవేలు |
సంగీతం | వి.కుమార్ |
గీతరచన | రాజశ్రీ |
సంభాషణలు | వసంతకుమార్, డి.ఆర్.రెడ్డి |
నిర్మాణ సంస్థ | కనకదుర్గా మూవీస్ |
భాష | తెలుగు |
1975లో విడుదలైన తేన్ సింధుదె వానం (தேன்சிந்துதே வானம்) అనే తమిళ సినిమాను భలే బ్రహ్మచారి పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.
కథా సంగ్రహం
[మార్చు]ఈ చిత్రంలో కథానాయకుడికి (శివకుమార్) పెళ్లంటే భయం. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండాలనుకుంటాడు. కథానాయిక (జయచిత్ర)కు మగవాళ్లంటే పడదు. వారి గాలి కూడా ఆమెను సోకడానికి ఇష్టపడదు. ఇది ఇలా ఉండగా రవి (కమల్ హాసన్), రమ (రాణిచంద్ర) ప్రేమించుకుంటారు. పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కాని బ్రహ్మచారిగా ఉండిపోవాలనే నాయకుడికి, మగవాళ్లంటే గిట్టని నాయికకు మధ్య ప్రేమ మొలకెత్తించి వారిద్దరూ దంపతులయ్యేలాగా చేస్తేనే రవి, రమల పెళ్ళి జరుగుతుందని పెద్దవాళ్లు షరతులు పెడతారు. నాయకుణ్ణి, నాయికను కలపడానికి రవి, రమ పడిన అవస్థలు, వారి కృషి ఫలితం, నాయికా నాయకుల కలయిక ఇవి మిగతా కథ.