భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | Superfast Express train | ||||
స్థానికత | తెలంగాణ & మహారాష్ట్ర | ||||
తొలి సేవ | 1 జనవరి 2004 | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | సికింద్రాబాద్ జంక్షన్ | ||||
ఆగే స్టేషనులు | 32 | ||||
గమ్యం | బల్హార్షా | ||||
ప్రయాణ దూరం | 367 కి.మీ. (228 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 9 గంటల 35 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | 1 AC chair car, 3 second class sitting, 14 general, 3 SLR | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | No | ||||
ఆహార సదుపాయాలు | Yes | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ | ||||
వేగం | 38 km/h (24 mph) average with halts | ||||
|
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Express) భారతీయ రైల్వేలు నడిపిస్తున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, మహారాష్ట్ర లోని బల్హార్షా స్టేషన్ల మధ్య నడుస్తుంది. తేది:1 జనవరి 2004వ తేదీన ప్రవేశపెట్టబడినది. హైదరాబాద్ యొక్క మరో పేరైన భాగ్యనగరం పేరుమీద నామకరణం చేయబడినది. ఇది దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో నడుస్తుంది.
రైలు సంఖ్య
[మార్చు]సికింద్రాబాద్ జంక్షన్ నుండి బల్హార్షా కు వెళ్లు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ సంఖ్య 17233 కాగా; బల్హార్షా నుండి సికింద్రాబాద్ జంక్షన్ కు వెళ్లు రైలు బండి సంఖ్య 17234.
రైలుమార్గం
[మార్చు]ఈ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుండి 15:25 గంటలకు బయలుదేవి బల్హార్షా మరునాడు 01:00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో బల్హార్షా నుండి 02:10 గంటలకు బయలుదేవి సికింద్రాబాద్ జంక్షన్ అదే రోజు 10:45 గంటలకు చేరుతుంది. ఇది మార్గంలో భువనగిరి, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్ నగర్ స్టేషన్లలో ఆగుతుంది.
భోగీల సర్దుబాటు
[మార్చు]ఈ రైలు భోగీలను గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (17201/17202), సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240/17239) లతో పంచుకొంటుంది.
ఇంజను
[మార్చు]ఈ రైలు సాధారణంగా లల్లాగూడ కు చెందిన డబ్లూ.ఎ.పి.-4 ఇంజనుతో నడపబడుతున్నది.
తరగతులు
[మార్చు]ఈ రైలుకు 21 భోగీలు ఉంటాయి. ఇందులో 1 AC చైర్ కారు, 3 రెండవ తరగతి సీటింగ్ భోగీలు, 14 సాధారణ భోగీలు, 3 స్లీపర్ భోగీలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- "17233/Bhagyanagar Express". India Rail Info.
- "17234/Bhagyanagar Express". India Rail Info.