Jump to content

భానుమతీ దేవి

వికీపీడియా నుండి
భానుమతీ దేవి
జననం(1934-05-15)1934 మే 15 [1]
మరణం2013 జనవరి 4(2013-01-04) (వయసు 78)
వృత్తినాటకరంగ, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1953–1987
జీవిత భాగస్వామిహరిహర పండ
పిల్లలుస్వర్ణలత
తల్లిదండ్రులుసారతి పట్నాయక్
పట్టాడేయ్
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ (1985)

భానుమతీ దేవి (1934, మే 15 - 2013, జనవరి 4) ఒరియా నాటకరంగ, సినిమా నటి.[2][3]

జననం

[మార్చు]

భానుమతీ దేవి 1934, మే 15న బ్రిటిష్ బర్మాలోని భారతీయ కుటుంబంలో జన్మించింది.[4] రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తన కుటుంబంతో కలిసి ఒడిశాలోని పూరీ నగరానికి వెళ్ళింది.[3][4]

నటనారంగం

[మార్చు]

భానుమతీ దేవి తన ఏడేళ్ళ వయసులోనే 1942లో నటిగా నాటకరంగంలోకి అడుగుపెట్టింది.[4] లఖే హీరా, నపహు రాతి నమరు పతి వంటి నాటకాలలో నటించి గుర్తింపు పొందింది.[4] నలభై ఏళ్ళకు పైగా కటక్‌లోని అన్నపూర్ణ నాటకసంస్థలోని వివిధ నాటక ప్రదర్శనలలో పాల్గొన్నది.[2]

పంతొమ్మిదేళ్ళ వయసులో 1954లో అమరి గన్ ఝియా అనే సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[5] ముఖ్యంగా 1950లు, 1960లలో ఒడిషా సినిమాల్లో నటించింది. పన్నెండుకు పైగా సినిమాలలో ప్రధాన పాత్రల్లో నటించింది.[2] భానుమతీ దేవి నటించిన మతిర మనీషా (1966) అనే ఒడియా సినిమా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2] 1986లో విడుదలైన జయదేబ్ సినిమాలో చివరిసారిగా నటించింది.[2]

అవార్డులు

[మార్చు]

మరణం

[మార్చు]

భానుమతీ దేవి తన 78 సంవత్సరాల వయస్సులో 2013, జనవరి 4న పూరి నగరంలోని రెడ్‌క్రాస్ రోడ్‌లోని తన ఇంటిలో మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. "Bhanumati leaves the 'stage' | Orissa Post". orissapost.com. 2013. Archived from the original on 16 February 2013. Retrieved 5 January 2013. Born May 15, 1934, in Burma, Bhanumati had returned Orissa
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Veteran Actor Bhanumati Devi dead". The Indian Express. 2013-01-05. Archived from the original on 2013-01-08. Retrieved 2013-01-16.
  3. 3.0 3.1 "Bhanumati Devi cremated in Puri". The Times of India. 2013-01-06. Archived from the original on 2013-02-16. Retrieved 2013-01-16.
  4. 4.0 4.1 4.2 4.3 "Bhanumati leaves the 'stage'". Orissa Times. 2013-01-05. Archived from the original on 2013-02-16. Retrieved 2013-01-16.
  5. Panda, Namita (26 November 2012). "Arclights out, actresses fight poverty". telegraphindia.com. Calcutta, India. Archived from the original on 22 December 2015. Retrieved 18 January 2013. She started her film career at the age of 19 in 1953 with Aama Gaan Jhua,

బయటి లింకులు

[మార్చు]