భారతదేశంలో అధికార హోదా లేని ముఖ్యమైన భాషలు
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
భారతదేశంలోని కేంద్రం కానీ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అధికారిక భాషలుగా గుర్తించని ముఖ్యమైన భాషల జాబితా ఇది. భారత్ లోని వివిధ ప్రాంతాల ప్రజలు అనేక భాషలు మాట్లాడుతారు. కనీసం 800 భాషలు, 2000 వరకు యాసలు గుర్తించబడ్డాయి. ఐతే వీటిలో హిందీ, ఇంగ్లీషు కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషలుగానూ, మరో 22 భాషలు రాజ్యాంగపు ఎనిమిదవ షెడ్యూల్ ద్వారా గుర్తింపు పొందినవి గానూ ఉండగా, మరికొన్ని భాషలు కేవలం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో అధికారికంగా గుర్తించబడివున్నాయి. ఇవి కాక ముఖ్యమైన భాషలు మరెన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని:
50 లక్షల మందికి పైగా మాట్లాడుతున్న భాషలు
[మార్చు]50 లక్షలకు పైగా ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ అధికార హోదా లేని భాషలు ఇవి. వీటిని హిందీ లోని వివిధ రకాలుగా స్థానికులు భావిస్తారు.
బీహారీ భాషలు
[మార్చు]కింది మూడు బీహారీ భాషలకు 50 లక్షల మంది కంటే ఎక్కువ మాట్లాడే వారు ఉన్నప్పటికీ అధికార హోదా లేదు. ఒకప్పుడు వీటిని హిందీ యొక్క వేరువేరు మాండలికాలుగా భావించారు. కానీ బెంగాలీ, అస్సామీ, ఒరియా లాగానే ఇవి కూడా ఇండిక్ భాషల నుండి వచ్చినవేనని ఇటీవల తెలిసింది.
- ఆంగిక — బీహారు లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో మాట్లాడుతారు.
- భోజ్‌పురి — బీహార్
- మాగధి — దక్షిణ బీహార్ లో మాట్లాడుతారు
రాజస్థానీ
[మార్చు]రాజస్థాన్ రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా రాజస్థానీ మాట్లాడుతారు. ప్రాంతం నుండి ప్రాంతానికి రాజస్థానీ యాస మారుతూ ఉన్నప్పటికీ, ప్రజలు ఈ భాషలో సంభాషించ గలుగుతారు. చాలా మంది హిందీ కూడా మాట్లాడగలరు. రాజస్థానీ, హిందీ రెండూ ఒకతే అని చాలా మంది అనుకుంటారు. రాజస్థానీలోని ప్రధాన రకాలివి:
- మార్వారీ — మార్వార్ (జోధ్‌పూర్, నాగౌర్, బికనీర్) ప్రాంతపు భాష.
- మేవారీ — మేవార్ (ఉదయపూర్, చిత్తూరు, కోట-బుందీ)ప్రాంతపు భాష.
- షెఖావతీ — షెఖావతి (సీకర్, చురు, ఝుంఝును) ప్రాంతపు భాష
ఇతర భాషలు
[మార్చు]- హర్యానవీ - హర్యానాకు చెందిన హిందీ మాండలికం
- భిలి (భిల్లు తెగవారు)
- గోండి (గోండు తెగవారు)
- కొడవ, కర్ణాటక లోని కొడగు జిల్లాలో మాట్లాడుతారు
- కచ్చి — గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో మాట్లాడుతారు
- తుళు — కర్ణాటక, కేరళ లోని తుళు ప్రజలు మాట్లాడుతారు.
- సంకేతి — కర్ణాటక, కేరళ, తమిళనాడు లలోని సంకేతి ప్రజలు మాట్లాడుతారు.
భారత రాజ్యాంగం 18 ప్రాంతీయ భాషల జాబితాను గుర్తించింది.
అల్పసంఖ్యాక భాషలు
[మార్చు]పది లక్షల కంటే తక్కువ మంది మాట్లాడే భాషలు ఇవి:
మూలాలు
[మార్చు]- "Major Indian Languages". Discover India. Archived from the original on 1 January 2007. Retrieved 16 April 2018.
- Ethnologue report
- Central Institute of Indian Languages