Jump to content

భారతీయ నాగ జెముడు

వికీపీడియా నుండి
(భారతీయ నాగజెముడు నుండి దారిమార్పు చెందింది)

భారతీయ నాగజెముడు
Illustration by Eaton in The Cactaceae
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Subgenus:
Opuntia
Species:
O. ficus-indica
Binomial name
Opuntia ficus-indica
Synonyms
  • Cactus decumanus Willd.
  • Cactus ficus-indica L.
  • Opuntia amyclaea Ten.
  • Opuntia cordobensis Speg.
  • Opuntia decumana (Willd.) Haw.
  • Opuntia gymnocarpa F. A. C. Weber
  • Opuntia hispanica Griffiths
  • Opuntia maxima Mill.
  • Opuntia megacantha Salm-Dyck
  • Opuntia paraguayensis K. Schum.

భారతీయ నాగజెముడు లేదా నాగజెముడు ఫికస్ ఇండికా కాక్టేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది సుదీర్ఘకాలంగా కొన్ని దేశాలలో ఆహార ఉత్పత్తి కోసం పండించబడుతున్న ముఖ్యమైన వ్యవసాయ మొక్క.

దీని వృక్ష శాస్త్రీయ నామం Opuntia ficus-indica. ఇవి ఎక్కువగా ఇసుక ప్రాంతాలలో పెరుగుతుంటాయి. వీటి కాండం ఆకు రూపాన్ని కలిగి ఉంటుంది. ఇవి తక్కువ నీటితో ఎక్కువకాలం బతుకుతాయి.

ప్రపంచం మొత్తం మీద ఎండిన, సారహీనమైన, నిర్జల, ఎడారి వంటి అన్ని నేలలో ఇది పండుతుంది. ఈ మొక్క సుమారు 12 నుంచి 16 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ మొక్క యొక్క మూలాలు మెక్సికో కు చెందినవిగా భావిస్తున్నారు.[1]

పండు

[మార్చు]

నాగజెముడు ఫికస్ ఇండికా మొక్క యొక్క కాయ ఆకు పచ్చరంగు నుండి బాగా మగ్గిన తరువాత ఎరుపు రంగుకు మారుతుంది.

బాగా మగ్గిన పండ్లను అతి జాగ్రత్తగా దాని పైన ఉన్న తోలును వలచి లోపలి కండను నములుతూ విత్తనాలను అతి జాగ్రత్తగా ఊసివేస్తారు.

నాగజెముడు ఫికస్ ఇండికా మొక్క చాలా భయంకరంగా అనేక ముళ్ళను కలిగి ఉంటుంది. అదికాక ఇది నాగ అనే పేరును కలిగి ఉంది.

నాగుపాము పడగ విప్పినపుడు తల భాగం ఏ ఆకారంలో ఉంటుందో ఈ చెట్టు కాండం మొత్తం అదే పద్ధతి లో ఉంటుంది. అందుకే ఈ రకం మొక్కలను నాగజెముడు అని అంటారు.

తీసుకోవాలసిన జాగ్రత్తలు

[మార్చు]

ఈ మొక్క యొక్క పండ్లను తినాలనుకునే వారు పెద్దల సలహాను తీసుకోండి. ఈ చెట్లు వుండే ప్రాంతాలలో చీకుగా ఉన్నందువలన పాములు సంచరిస్తుంటాయి.

ఈ చెట్టుంతా ముళ్ళతో ఉంటుంది. చాలా జాగ్రత్తగా పండును తీసుకోవాలి. ఈ పండుకు కూడా వందల సంఖ్యలో అనేక చిన్న ముళ్ళుంటాయి. ఈ ముళ్ళను ఏ మాత్రం కొంచెం తగిలినా అనేక ముళ్ళు గుచ్చుకుంటాయి.

ఈ పండుకు ఉండే కనిపించి కనిపించని సన్నని ముళ్లు అవేమి చేస్తాయిలే అని ఆజాగ్రత్తగా ఉన్నప్పుడు అనేక ముళ్ళు గుంచుకుని విపరీతమైన చురుకును కలుగజేస్తాయి.

ఈ పండును తినడం అనేక సమస్యలతో కూడుకున్నందు వలన ఈ పండును తినడం కన్నా ఊరకుండడం మేలు లేదా తినకూడదనే అభిప్రాయం భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఉంది.

Opuntia ficus-indica flower
Opuntia ficus-indica (Indian fig) in Secunderabad, India.
The fruits of Opuntia ficus-indica as sold in Morocco.
దస్త్రం:Opuntia Ficus.jpg
Opuntia ficus-indica plant, also known as Indian or Barbary Fig
Tuna
Opuntia ficus-indica (Indian fig) flowering in Secunderabad

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Opuntia ficus-indica (L.) Mill". USDA GRIN.