భారత కేంద్ర బడ్జెట్ 2020 - 21

వికీపీడియా నుండి
(భారత కేంద్ర బడ్జెట్ 2020 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020 ఫిబ్రవరి 1పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌.రెండున్నర గంటలకుపైగా కొనసాగిన నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం.[1][2]

చరిత్ర[మార్చు]

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం కేంద్ర బడ్జెట్‌ తప్పనిసరి.భారతదేశం లో మొదటి బడ్జెట్‌ను మొదటి ఆర్థిక మంత్రి ఆర్.కె.శణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26 సమర్పించారు.[3]

ముఖ్యమైన ప్రకటనలు[మార్చు]

ఈ బడ్జెట్ లో విద్యారంగానికి రూ 99.300 [4]కోట్లు

 • జల్‌జీవన్‌ మిషన్‌కు రూ 11,500 కోట్లు
 • షెడ్యూల్డ్ కులాలు ,ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం అభ్యున్నతి కోసం 8138,700 కోట్లు[5]
 • జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధికి రూ.30, 757 కోట్లు.
 • లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు.
 • ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి కీ రూ1480 కోట్లు
 • నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
 • రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు
 • పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
 • సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ 9500 కోట్లు
 • పర్యటక రంగానికి రూ 2500 కోట్లు
 • సాంస్కృతిక శాఖకు రూ 3150 కోట్లు
 • వ్యవసాయ రంగానికి రూ 15 లక్షల కోట్ల
 • వ్యవసాయ రుణాలు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
 • పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
 • ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
 • స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు
 • పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు
 • మహిళా సంక్షేమ పథకాల రూ. 28,600 కోట్లు
 • పౌష్టికాహార పథకానికి రూ. 35.6 కోట్లు

బడ్జెట్‌పై స్పందన[మార్చు]

 • ప్రధాని నరేంద్ర మోదీ:ఈ బడ్జెట్‌ ఉపాధి కల్పనకు పెద్దపీట,వ్యవసాయ రంగం, మౌలికవసతులు, టెక్నాలజీ రంగాల్లో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేలా బడ్జెట్ లో ఉంది అన్నారు.[6]
 • రాజ్‌నాథ్ సింగ్:ఈ బడ్జెట్ దేశానికి అద్భుతమైన బడ్జెట్ అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుభాకాంక్షలు.దేశ అవసరాలు, లక్ష్యాలకు పెద్ద పీట వేశారు.[7]
 • పి చిదంబరం:నామినల్ జీడీపీ, ద్రవ్యలోటు, నికర పన్ను ఆదాయం వసూళ్లు, పెట్టుబడుల ఉపసంహరణ, వ్యయాలు 2019-20 బడ్జెట్‌లో లక్ష్యాలను సాధించలేకపోయారు. ఈ 2020-21లో ఆమె నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారనే నమ్మకం లేదు.[8]
 • రాహుల్‌ గాంధీ:ఈ బడ్జెట్‌లో ఏ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయిందని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం.యువత ఉద్యోగాల కల్పనకు బడ్జెట్‌లో ఎలాంటి ఆలోచన చేయలేదు.[9]

మూలాలు[మార్చు]

 1. Sharma, Shantanu Nandan; Layak, Suman (2020-01-13). "What FM Nirmala Sitharaman could do in Budget 2020 to boost demand and revive economy". The Economic Times. Retrieved 2020-02-01.
 2. "Budget For The Common Man: Key Income Tax Changes Announced In Past Budgets". NDTV.com. Retrieved 2020-02-01.
 3. Standard, Business. "Budget 2020 Live: Union Budget 2020-2021, Income Tax, Railway Budget 2020 India". www.business-standard.com. Retrieved 2020-02-01.
 4. "Budget 2020 highlight: ₹99,300 crore for education sector, new income tax slab". Livemint (ఆంగ్లం లో). 2020-02-01. Retrieved 2020-02-01.
 5. Feb 1, Bloomberg | Updated:; 2020; Ist, 17:30. "Union Budget 2020: Winners and losers - Times of India". The Times of India (ఆంగ్లం లో). Retrieved 2020-02-01.CS1 maint: extra punctuation (link)
 6. "బడ్జెట్‌ 2020: ప్రధాని మోదీ స్పందన". Sakshi. 2020-02-01. Retrieved 2020-02-02.
 7. Eenadu. "బడ్జెట్‌ 2020: ఎవరేమన్నారంటే? - EENADU". www.eenadu.net. Retrieved 2020-02-02.
 8. "బడ్జెట్‌పై చిదంబరం ఘాటు స్పందన". www.andhrajyothy.com. 2019-02-01. Retrieved 2020-02-02.
 9. "బడ్జెట్‌పై రాహుల్‌ ఏమన్నారంటే..." Sakshi. 2020-02-01. Retrieved 2020-02-02.