భారత గవర్నరు జనరల్


భారతదేశంలో సా.శ. 1600 లో వ్యాపారం చేసుకునుటకు ప్రవేశించిన బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ క్రమేణా వలసరాజ్యస్థాపనచేసి, రాజ్యాదికారాలు చేపట్టి దేశంను పరిపాలించు ప్రభుత్వంగా మారింది. తరువాత ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వం 1858 నవంబరు 1న విక్టోరియా రాణీ ప్రకటన ద్వారా భారతదేశమందలి ప్రభుత్వంను ఇంగ్లీషు వారి రాజ్యమకుటంలో చేర్చిన విసిష్ట చరిత్రలో కుతూహలకర విశేషాలు చాలా ఉన్నాయి. బ్రిటిష్ పార్లమెంటు 1773 లో ఆమోదించిన రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి గవర్నరు జనరల్ ను నియమించింది (మొట్టమొదటి గవర్నరు జనరల్ వారన్ హేస్టింగ్సు ). అంతకు ముందు 1773 దాకా గవర్నర్ల పదవులే ఉన్నాయి. 1773 నుండి గవర్నరు జనరల్ గా చేసినవారు బ్రిటిష్ ఇండియాలో కేవలం కలకత్తా రాష్ట్రానికే (ఇప్పటి బెంగాల్ రాష్ట్రం) గవర్నరు జనరల్సు ఉన్నారు. 1833 లో చేసిన రాజ్యాగ చట్టం అనగా 1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టం వలన బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీనే బ్రిటిష్ ప్రభుత్వం వారి ప్రతినిధిగా నియమించి భారతదేశంను బ్రిటిష్ ఇండియా (వలసరాజ్యంగా) నిరంకుశంగా పరిపాలనసాగించారు. అందుచే 1833 నుండి భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ ఇండియా గవర్పరుజనరల్సు అనవచ్చును. అటువంటివారిలో విలియం బెంటింక్ మొట్టమొదటి బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్. 1858 నవంబరు 1 వ తేదీన విక్టోరియా రాణి రాజ్యాంగపత్రం ద్వారా చేసిన ప్రకటనతో భారతదేశపు ప్రభుత్వంను ఇంగ్లీషురాజ్యమకుటంలో కలిపినప్పటినుండి భారతదేశంను పరిపాలించు బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిని వైస్రాయి (VICEROY) అనికూడా అనేవారు అందుచే గవర్నరు జనరల్ లేదా వైస్రాయిగా సంబోధించారు. వైస్రాయి పదం వాడుట మొదలుపెట్టిన కాలం నుండి (1858) మొదటి వైస్రాయి క్యానింగ్ (Charles John Canning). 1947 ఆగస్టు 15వరకు ఆఖరి వైస్రాయిగా చేసిన లార్డు మౌంట్ బాటన్. భారతదేశం స్వతంత్రమైన తేదీనుండి వైస్రాయి అను బిరుదు ఉపసంహరింపబడింది అందుచే అక్కడనుండి తదుపరి 1948 జూన్ 28 వరకూ గవర్నరు జనరల్ గా కొనసాగిన మౌంట్ బాటన్ ఆఖరి బ్రిటిష్ గవర్నరు జనరల్. అతని పదవిపూర్తి (1948 జూన్ 28) కావడంతో అప్పటినుండి భారతదేశ రాజ్యాంగం విడుదలయ్యే వరకూ అంటే 1950 జనేవరి 26 వరకూ గవర్నర్ జనరల్ గా మొదటి భారతీయుడు రాజాజీగా ప్రసిధ్ది చెందిన చక్రవర్తి రాజగోపాలాచారి (అధినివేశ స్వరాజ్యము) [1]
గవర్నర్ జనరల్ గా చేసిన వారి జాబితా
[మార్చు]1725 గవర్నరు జనరల్ గా పనిచేసినవారి జాబితా[2]
| వ.సంఖ్య | గవర్నరు జనరల్ | జననం | పదవీక్రమణ | పదవీ విరమణ | మరణం |
| 1 | రాబర్టు క్లైవు (గవర్నరు) | 1725 | 1743 | 1767 | 1774 |
| 2 | వారన్ హేస్టింగ్సు | 1732 | 1750 | 1785 | 1818 |
| 3 | కారన్ వాలీసు | 1738 | 1786 | 1793 | 1805 |
| 4 | జాన్ షోర్ | 1795 | |||
| 5 | లార్డు (మార్నింగటన్) వెల్లెస్లీ | 1760 | 1798 | 1805 | 1842 |
| 6 | కారన్ వాలీసు | 1738 | 1805 | 1795 | 1805 |
| 7 | మింటో | 1823 | 1828 | ||
| 8 | లార్డు హేస్టింగ్సు | 1754 | 1813 | 1823 | 1826 |
| 9 | అమ్హరెస్టు | 1823 | 1828 | ||
| 10 | విలియం బెంటింక్ | 1774 | 1828 | 1835 | 1839 |
| 11 | సర్ ఛార్ల్సు మెట్కాఫ్ (ఆక్టింగ్ గవర్నర్ జనరల్) | 1835 | |||
| 12 | ఎలెన్ బరో | 1842 | 1847 | ||
| 13 | జేమ్సు యాన్డూృ బ్రౌన్ ర్యామ్సె ( డల్ హౌసీ ) | 1812 | 1847 | 1856 | 1860 |
| 14 | కర్జన్ | 1899 | 1910 | ||
| 15 | లార్డు హార్డింజి | 1858 | 1910 | 1914 | 1944 |
| 28 | లార్డు షెమ్స ఫర్డు | 1916 | 1921 | ||
| 29 | రీడింగ్ | 1921 | 1926 | ||
| 30 | లార్డు ఇర్విన్ | 1881 | 1926 | 1931 | 1959 |
| 31 | లార్డు వెల్లింగటన్ | 1866 | 1931 | 1936 | 1941 |
| 32 | లార్డు వావెల్ | 1944 | 1947 | ||
| 33 | మౌంట్ బాటన్ | 1947 | 1948 |
మూలాలు
[మార్చు]- ↑ "The British Rule in India" D.V. Siva Rao(1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ
- ↑ "List of All Governors General of India". Unacademy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-05-19.