భువనైక సౌందర్యం (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భువనైక సౌందర్యం (పుస్తకం)
భువనైక సౌందర్యం (పుస్తకం)
కృతికర్త: డా. ద్యావనపల్లి సత్యనారాయణ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): భువనగిరి కోట చరిత్ర
ప్రచురణ: తెలంగాణ రిసోర్స్ సెంటర్
విడుదల: 2016
పేజీలు: 84


భువనైక సౌందర్యం (భువనగిరి పర్యాటకం, చరిత్ర - శాసనాలు) అనేది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని భువనగిరి కోట చరిత్ర గురించి రాయబడిన పుస్తకం.[1] చరిత్ర పరిశోధకుడు డా. ద్యావనపల్లి సత్యనారాయణ రాసిన ఈ పుస్తకం 2016లో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రచురించబడింది.[2]

పుస్తక నేపథ్యం[మార్చు]

ఈ పుస్తకంలో భువనగిరి కోటగోడలు, ప్రాంగణాల గురించి రచయిత వివరించాడు. భువనగిరికి సంబంధించిన తెలియని విషయాలు వెళ్ళడించారు. చరిత్ర పూర్వయుగంలో భువనగిరి కొండ ఏర్పడిన తీరును ఈ పుస్తకంలో రచయిత వివరించాడు. రాక్షస గూళ్ళ యుగాన్ని, ఆ కాలంలోని ప్రజలు పూజలు నిర్వహించిన స్థలం గురించి తెలియజేశాడు.

చారిత్రక యుగంలో ఇక్కడ ఇకోట, ఆలయాల నిర్మాణం, వాటిల్లో వివిధ రాజవంశాల పాత్రను వివరించాడు. సామాన్య శకం 1100 నుండి జరిగిన చరిత్రను కూడా వివరించాడు. తెలంగాణ సాయుధ పోరాటంలోని భువనగిరిలో సంఘటలను కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించాడు.

భువనగిరి కోట గురించి ప్రచారంలో ఉన్న పలు కథలను వివరించాడు. సర్వాయి పాపన్నతో కోటకు ఉన్న అనుబంధాన్ని, కోటలోని వివిధ శాసనాల గురించి తెలిపాడు. భువనగిరి కోటలోని వివిధ నిర్మాణాలు, అలంకరణలను, భువనగిరి పట్టణంలోని ఇతర కట్టడాల గురించి ప్రస్తావించాడు.[3]

విషయసూచిక[మార్చు]

1. చరిత్ర

  • 'భువనం పైనే పెద్ద 'గిరి’
  • బృహత్ శిలా యుగపు ఆలయాలు
  • విష్ణుకుండుల కాలంలో...
  • పద్మనాయకుల కాలంలో...
  • చాళుక్యుల కాలంలో...
  • కాకతీయుల కాలంలో...
  • సుల్తానుల కాలంలో...
  • ఆధునిక యుగంలో...

2. పర్యాటకం

  • కోటగోడలు, ప్రాంగణాలు
  • మంటపం, వంటశాల, అశ్వశాలలు
  • సప్త గుండాలు
  • చెరువులు, కుంటలు
  • కోటగోడ అంచులు
  • రాణుల స్నానఘట్టాలు
  • ఏనుగుల బావి
  • రాజభవనం, ఫౌంటెయిన్
  • నిర్మాణ వైచిత్రం
  • అలంకరణలు
  • పరిసర కట్టడాలు
  • పర్యాటక అవకాశాలు
  • అభివృద్ధి ప్రణాళికలు

3. శాసనాలు

  • భువనగిరి శాసనాలు (1-9)
  • కొలనుపాక శాసనం

4. అనుబంధాలు

  • భోనగిరి కథ
  • సర్వాయి పాపన్న
  • భువనగిరి ఆంధ్ర మహాసభ
  • అద్భుత పర్యాటకంగా భువనగిరి ఖిల్లా
  • Bhongir's Batholith Marvel

ఆవిష్క్రరణ[మార్చు]

2016 డిసెంబరులో హైదరాబాదులోని ఎన్.టి.ఆర్. స్టేడియంలో జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో భాగంగా రచయిత డి. సత్యనారాయుణ, మాజీ ఎంపి బి. వినోద్‌ కుమార్, తెలంగాణ రీసోర్స్‌  చైర్మన్‌ ఎం. వేదకుమార్‌, హైదరాబాద్‌ బుక్‌ ఫెుుర్‌ సొసైటీ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్‌ చేతులమీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడింది.[4]

మూలాలు[మార్చు]

  1. Satyanarayana, Dyavanapalli (2016-03-01). Bhuvanaika Soundaryam: Bhuvanagiri Paryatakam (in Telugu). Sree Bhagavan Publications.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. "Bhuvanaika Soundaryam" (PDF). www.etelangana.org. Archived (PDF) from the original on 2018-12-11. Retrieved 2021-11-02.
  3. భువనైక సౌందర్యం, డా. ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ రీసోర్స్ సెంటర్, 2016, పేజీలు 6-7.
  4. "'భువనైక సౌందర్యం' ఆవిష్కరణ". lit.andhrajyothy.com. Archived from the original on 2021-11-02. Retrieved 2021-11-02.