తెలంగాణ రిసోర్స్ సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రిసోర్స్ సెంటర్ - ద్విభాషా, త్రైమాసిక జర్నల్ ఆఫ్ తెలంగాణ స్టడీస్ సంచికను ప్రచురిస్తోంది

తెలంగాణ రిసోర్స్ సెంటర్ (ఆంగ్లం:Telangana Resource Centre) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అవసరమైన భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో తమదైన రీతిలో కృషిచేసిన వివిధ సంస్థలు, ప్రజాసంఘాలలో ఒకటి. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ వీధి నెం.12లోని దక్కన్ అకాడమీలో ఈ సంస్థ నెలకొంది. ఈ సంస్థ పరిమిత వనరులతో ప్రారంభమై అనతి కాలం లోనే అపరిమిత స్థాయిలో తెలంగాణ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది.

చర్చా కార్యక్రమాలు

[మార్చు]

ఈ సంస్థ ఇప్పటి వరకూ క్రమం తప్పకుండా ప్రతీ శనివారం ఒక అంశంపై "చర్చ"ను నిర్వహిస్తూ 2015 నవంబర్ 14 న 200వ చర్చను 'మట్టి మనుషులు' అనే సినిమాపై నిర్వహించింది. తెలంగాణ భావజాలాన్ని పరిపుష్ఠం చేయడంలో దాదాపు నాలుగేళ్ళుగా విశిష్ట కృషి చేస్తూ, ప్రతి శనివారం ఓ అంశంపై ‘చర్చ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ 200 చర్చ మైలురాయిని విజయ వంతంగా చేరుకుంది. క్రమం తప్పకుండా వారం వారం ఈ విధమైన చర్చ నిర్వహణ ఎంతో కష్టమే అయినా కూడా టీఆర్సీ చైర్మన్ మణికొండ వేదకుమార్ సారథ్యంలోని బృందం ఎంతో సమర్థంగా ఈ పని చేయగలిగింది. వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు, వెబ్సైట్ నిర్వాహకులు కూడా ఈ కృషిలో ఎంత గానో సహకరించారు. ఈ విధమైన చర్చాకార్యక్రమాలు తెలంగాణ వివిధ ప్రాంతాల్లో మరెన్నో సంస్థలు చిన్నస్థాయిలో అయినా, అడపాదడపాగా నైనా ఇలాంటి చర్చలు నిర్వహించేందుకు ప్రేరణగా నిలిచాయి.

2012 జనవరి 12న తెంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో మొదటి చర్చ జరిగింది. నాటి నుంచీ నేటి వరకూ వివిధ అంశాలపై ఎప్పుడూ ఎలాంటి అంతరాయం లేకుండా ఆ ‘చర్చ’ కొన సాగుతూ వచ్చింది. వ్యవసాయం, కళలు, పాటలు, నాటి నిజాం పాలన, పోలీసు చర్య, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణ విలీనం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మలి దశ ఉద్యమం, సహజ వనరులు, చరిత్ర, సంస్కృతి, నేటి రాజ కీయాలు, తెలంగాణ పునర్ నిర్మాణం.... లాంటి అంశాలెన్నో ఇందులో చర్చకు వచ్చాయి.

చర్చా నేపథ్యం

[మార్చు]

ఒక సమస్యను నిశితంగా పరిశీలించి పరిష్కారం దిశగా మార్గాలు అన్వేషించడం, వాటిని సమాజం దృష్టికి తీసుకురావడం, అవసరమైన సందర్భాల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం... టీఆర్సీ ‘చర్చ’ ప్రధాన లక్ష్యం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగే వరకు జరిగిన చర్చలు ఒకరకమైతే, తదనంతరం జరిగిన చర్చలు మరో రకం.మొదటి రకం చర్చలు తెలంగాణ భావజాలాన్ని చాటిచెప్పి తెంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేసే దిశలో సాగాయి. ఇక రెండో రకం చర్చలు ప్రత్యేక తెలంగాణలో ఉన్న సమస్యలను విడమర్చి చెప్పి వాటి పరిష్కారమార్గాలను అన్వేషించే దిశలో, ప్రభుత్వానికి, సమాజానికి దిశానిర్దేశం చేసే దిశలో జరిగాయి. ఆయా చర్చలు ప్రభుత్వానికి, సమాజానికి మధ్య వారథిగా ప్రజ ఆకాంక్షను, వాటితో ముడిపడిన పరిష్కారాలను ప్రభుత్వానికి సూచించే విధంగా జరిగాయి. నూతనంగా ఆవిర్భవించిన తెలం గాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. ఈ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆయా అంశాలపై అవగాహన పొంది పరిష్కార మార్గాలను అన్వేషించే వీలు కలిగింది.

వక్తలుగా ప్రముఖులు

[మార్చు]

తెలంగాణ రిసోర్స్ సెంటర్ చర్చా కార్యక్రమాల్లో ప్రముఖులెందరో భాగస్వాముయ్యారు. వారంతా కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులే. ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖులు... ఇలా ఎందరెందరో ఈ చర్చాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ ఎం.కోదండరాం, గద్దర్, ఎన్.వేణుగోపాల్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, బోయినపల్లి వినోద్, రామచంద్రుడు, కె.వేణుగోపాలాచారి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమరావు, మల్లేపల్లి లక్ష్మయ్య, పాశం యాదగిరి, పిట్టల రవీందర్, జూలూరి గౌరీశంకర్, మాడభూషి శ్రీధర్, జీవన్ కుమార్, వి. ప్రకాష్, ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, విమలక్క, సి.ఎల్. యాదగిరి, పొత్తూరి వేంకటేశ్వరరావు, రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, కట్టా శేఖర్ రెడ్డి, జహీరుద్దీన్ అలీఖాన్, గౌతమ్ పింగ్లే, డాక్టర్ ఎల్.పాండురంగారెడ్డి, డాక్టర్ ఎ.గోపాల కృష్ణ, సి.విఠల్, దేవీ ప్రసాద్, డి.పి. రెడ్డి, తడకమళ్ళ వివేక్, ముత్యం రెడ్డి, ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, ఆర్.విద్యాసాగర్ రావు, హమిద్ మహ్మద్ ఖాన్, సూరేపల్లి సుజాత, సనాఉల్లా ఖాన్, శ్రీధర్ ధర్మాసనం, రమా మెల్కోటే, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వై.బి. సత్యనారాయణ, ప్రొఫెసర్ శ్రీధర స్వామి, టి.శివాజీ, జూపాక సుభద్ర, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ, ప్రొఫెసర్ హరనాథ్, ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, డాక్టర్ జి.వి. రామాంజనేయులు, కె. మధుసూదన్ రెడ్డి, భిక్షం, దిలీప్ కొణతం, డాక్టర్ చక్రపాణి, కూరపాటి రమేశ్, సజయ, కొమ్మిడి నర్సింహారెడ్డి, సజ్జాద్ షాహిద్, కిరణ్ విస్సా, డాక్టర్ డి.రాజారెడ్డి, పెంటారెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, రత్నమాల, చిక్కుడు ప్రభాకర్, విద్యార్థి నాయకురాలు బాలలక్ష్మి, ఇఫ్లూ కోటి, ఆదివాసి నాయకుడు మైపతి అరుణ్కుమార్, బ్రదర్ వర్గీస్ తదితరులు ఈ చర్చా కార్యక్రమాల్లో పాల్గ్గొన్నారు.

వన్నె తెచ్చిన పాట

[మార్చు]

తెంగాణ ఉద్యమంలో ‘పాట’ ప్రత్యేక స్థానం పొందింది. ప్రజల ఆవేదనకు, ఆకాంక్షలకు కవులు అక్షరరూపం ఇచ్చారు. గాయకులు తమ గానంతో వాటిని చిరస్థాయిగా నిలిపారు. ఈ నేపథ్యంలో పాట అంశంపై ఏకథాటిగా మూడు వారాల పాటు చర్చ జరగడం విశేషం. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, రసమయి బాలకిషన్, జయరాజ్, అంబటి వెంకన్న, దరువు ఎల్లన్న, నేర్నాల కిశోర్, మెట్టపల్లి సురేందర్, భిక్షపతి, బాబ్జి, అభినయ శ్రీనివాస్, కోదారి శ్రీను, పికెఎం కోటి, జంగ్ ప్రహ్లాద్, పైలం సంతోష్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఎన్నో సాంస్కృతిక అంశాలపై....

[మార్చు]

తెలంగాణ సాంస్కృతిక సంపద-పరిరక్షణ, శ్రీశైలం గుడి-చెంచుల హక్కు, తెలంగాణ పండుగలు, నిర్లక్ష్యానికి గురవుతున్న తెలంగాణ పురావస్తు ప్రాధాన్య ప్రాంతాలు తదితర అంశాలపై చర్చ జరిగింది.

విభిన్న సామాజిక అంశాలపై....

[మార్చు]

ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్-చట్టబద్దత, ఫ్లోరోసిస్ వ్యాధి, హైదరాబాద్ మెట్రో రైలు, తెలంగాణలో ఆరోగ్య వ్యవస్థ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, తెలంగాణలో ఉన్నత విద్య తదితర అంశాలపై చర్చ జరిగింది.

ఆర్థిక అంశాలపై....

[మార్చు]

తెలంగాణ కులవృత్తుల పరిస్థితి, తెలంగాణ పరిశ్రము, హైదరాబాద్ స్టేట్లో రైల్వే వ్యవస్థ, నిజాం పాలనలో విమానయానం, తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ, హైదరాబాద్ పట్టణీకరణతో పరిసర పల్లెల వెతలు, తెలంగాణ ప్రాంతంలో నేత కార్మికు ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు, సింగరేణి ఓపెన్ కాస్ట్ మై నింగ్, మెట్టప్రాంతాల్లో నీటి యాజమాన్యం, తెలంగాణలో గుట్టల విధ్వంసం తదితర అంశాలపై చర్చ జరిగింది.

డాక్యుమెంటేషన్

[మార్చు]

చర్చలు నిర్వహించడం ఒక ఎత్తయితే, వాటి డాక్యుమెంటేషన్ మరో ఎత్తు. జరుగుతున్న చర్చ కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీస్తున్నారు. చర్చ సారాంశాన్ని ప్రత్యేక బులెటిన్లుగా, పుస్తకాలుగా, డీవీడీలుగా తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అంతేగాకుండా తెలంగాణ ప్రజల చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలపై సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి నేటి తరానికి ప్రింట్, ఆడియో, వీడియో రూపాల్లో అందించే ప్రయత్నం కూడా తెలంగాణ రిసోర్స్ సెంటర్ చేపట్టింది. తెలంగాణ చరిత్రను భావితరాకు అందించేందుకు, పరిశోధన విద్యార్థులకు సహకరించేందుకు ప్రత్యేకించి ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేసుకుంది. సంస్థ కార్యకలాపాలపై ఆసక్తి గలవారు తమ వద్ద ఉన్న పాత, కొత్త పుస్తకాలను, కరపత్రాలను, ఆడియో, వీడియో రూపాలలోని సాహిత్యాన్ని దీనికి అందజేయవచ్చు.

సంకలనాలు

[మార్చు]

తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకున్న వివిధ అంశాలపై వార్తలు, వ్యాసాల సంకలనాలను ‘నెగడు’ పేరిట వెలువరించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక, 8వ అధ్యాయం, సకలజనుల సమ్మె, పోలవరం తదితరాలపై ఈ సంకలనాలు వెలువడ్డాయి. విశిష్ట వ్యక్తుల జీవితచరిత్రను, వారి సేవలను, త్యాగాలను వివరించేందుకు ‘మనిషి పేరిట సంకలనాలను తీసుకువస్తోంది. డాక్టర్ గోపు లింగారెడ్డి, బుర్రా రాము, కన్నబిరాన్ తదితరులపై ఈ సంకలనాలు వెలువడ్డాయి. జెండర్ వివక్ష తదితర అంశాలపై జరిగిన ఆందోళన కార్యక్రమాలకు తెలంగాణ రిసోర్స్ సెంటర్ అండగా నిలిచింది.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]