భూపతి కృష్ణమూర్తి
భూపతి కృష్ణమూర్తి | |
---|---|
![]() | |
జననం | 1926, ఫిబ్రవరి 21 , వరంగల్Mulkanoor ( village :ముల్కనూర్ )
Mandal Name : Bheemdevarapalli |
మరణం | 15 ఫిబ్రవరి, 2015 |
ఇతర పేర్లు | ప్రజా బందువు, తెలంగాణ గాంధీ |
Organization | తెలంగాణ ప్రజాసమితి |
భూపతి కృష్ణమూర్తిఆయనే తెలంగాణ గాంధీ. చిన్ననాటి నుంచి స్వతంత్ర భావాలు కలిగిన ఆయన..భారత స్వాతంత్ర్య సంగ్రామంలో క్రీయాశీలకంగా పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం తెలంగాణ ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు.[1] తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తుల్లో ఆయనొకరు.
జీవిత విశేషాలు[మార్చు]
1926 ఫిబ్రవరి 21న వరంగల్ జిల్లా mulukanoor mandalలొ భుపతి రాఝవులు బ్రమరాంబ దంపతులకి జన్మించారు భూపతి కృష్నమూర్తి గారు. భుపతి గారికి 1945లో కణకలక్ష్మితో వివాహము జరిగింది. వారికి ముగ్గురు సంతానం శ్యాంసుందర్, (కీ.శే.)కరంచంద్, నర్మద. భూపతికి చిన్ననాటి నుంచి స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి…మహాత్మాగాంధీ అడుగు జాడల్లో నడిచారు. ఆయన బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. మహాత్మా గాంధీతో కలిసి దండియాత్రలోనూ పాల్గొన్నారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయన పోరాటం ఆగలేదు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట అవతరణ తర్వాత తెలంగాణ వెనకబాటును ఎలుగెత్తి చాటారు[2]. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విశేష కృషి చేశారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం భూపతి కృష్ణమూర్తి ఎన్నో పోరాటాలు చేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడారు. 1953-54 సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్ వరంగల్ వచ్చినప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడారు. తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లో వేరే ప్రాంతంతో కలపొద్దని గళమెత్తి గర్జించారు. ఇడ్లీ సాంబార్ వ్యతిరేక ఉద్యమం వరంగల్ లో పురుడుపోసుకున్నప్పుడు క్రీయాశీలకంగా పనిచేశారు. నాటి ప్రభుత్వాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ముక్తకంఠంతో విభేదించారు. తెలంగాణలో ఆంధ్రాపార్టీల పెత్తనం వద్దని ఆనాడే తెగేసి చెప్పారు.[1]
1969 ఉద్యమంలో పాత్ర[మార్చు]
1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు భూపతి కృష్ణమూర్తి.సొంత ఆస్థులను అమ్మేసి.. ఉద్యమానికి పురుడు పోశారు. 1969 ఫిబ్రవరి 28 న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితిని స్థాపించారు.[3] మర్రి చెన్నారెడ్డి పార్టీ వీడిన తర్వాత టీపీఎస్ కు ప్రెసిడెంట్ అయ్యారు. ఇక అప్పటినుంచి అన్నింటికి ఆయనే పెద్ద దిక్కై పార్టీని నడిపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. వయసు సహకరించకున్నా ఉద్యమంలో పాల్గొన్నారు.[2]
మరణం[మార్చు]
తెలంగాణ రాష్ట్రాన్ని చూసి తనువు చాలిస్తానన్న భూపతి… అన్నట్టుగానే ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2015, 15 ఫిబ్రవరి ఆదివారం అర్ధరాత్రి వరంగల్ లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు.[4][5]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "భూపతి కృష్ణమూర్తి కన్నుమూత". janam sakshni. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 16 February 2015. Check date values in:
|archive-date=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ 2.0 2.1 "తెలంగాణ గాంధీ 'భూపతి' ఇకలేరు….!". v6 news. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 16 February 2015. Check date values in:
|archive-date=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ "Bhupathi Krishnamurthy Telangana Gandhi passes away:". Archived from the original on 2016-03-05. Retrieved 2015-08-02.
- ↑ ఆంధ్రజ్యోతి, ముఖ్యాంశాలు (16 February 2015). "తెలంగాణ గాంధీ భూపతి కన్నుమూత". Archived from the original on 8 March 2019. Retrieved 8 March 2019. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Telangana Gandhi Bhupathi Krishnamurthy passes away". Archived from the original on 2015-02-24. Retrieved 2015-08-02.
ఇతర లింకులు[మార్చు]
- CS1 maint: discouraged parameter
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using home town
- 1926 జననాలు
- 2015 మరణాలు
- తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు
- తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న వ్యక్తులు
- గాంధేయవాదులు
- మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వరంగల్లు పట్టణ జిల్లా వ్యక్తులు