Jump to content

భూలా భాయిదేశాయ్

వికీపీడియా నుండి
భూలా భాయిదేశాయ్
ఏప్రిల్ 1939 ఎఐసిసి సెషన్‌లో జవహర్‌లాల్ నెహ్రూ, భూలాభాయ్ దేశాయ్, బాబు రాజేంద్ర ప్రసాద్ (కేంద్రం)
జననం(1877-10-13)1877 అక్టోబరు 13
మరణం1946 మే 6(1946-05-06) (వయసు 68)

భూలా భాయి జీవంజీభాయి దేశాయ్, 13-10-1877 న గుజరాత్ లోని సూరత్ జిల్లా చారిత్రాత్మక బార్డోలికి దగ్గరున్న బల్సూరులో  అనవిల్ బ్రాహ్మణ న్యాయవాద  కుటుంబ లో పుట్టాడు.[1] ఇతను ఒక భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, ప్రశంసలు పొందిన న్యాయవాది. రెండవ ప్రపంచ యుద్ధంలో దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు భారత జాతీయ ఆర్మీ సైనికులకు రక్షణగా నిలిచినందుకు, ముస్లిం లీగ్‌కు చెందిన లియాఖత్ అలీ ఖాన్‌తో రహస్య అధికారం పంచుకునే ఒప్పందానికి ప్రయత్నించినందుకు అతను బాగా గుర్తుండిపోయాడు.

విద్య

[మార్చు]

భూలా భాయిదేశాయ్ తండ్రి ప్రభుత్వ ప్లీడర్. స్వగ్రామ౦ లో చదువు ముగించి బొంబాయి ఎలిఫిన్ స్టన్ కాలేజిలో చేరి ప్రధమ శ్రేణిలో పట్టా పొంది ,ఎం ఏ పాసై , అహ్మదాబాద్ కాలేజిలో  హిస్టరీ ప్రొఫెసర్ అయ్యాడు. రెండేళ్ళు పని చేసి ,ఎల్.ఎల్ .బి.చేసి, బాంబే హైకోర్ట్ లో న్యాయవాదిగా చేరాడు .అక్కడ అందరూ బారిస్టర్లే. స్వదేశీ న్యాయవాదిగానే ఉంటూ భూలాభాయ్, వాదనా సామర్ధ్యంతో త్వరలోనే అద్వితీయ న్యాయవాది గా మారాడు.

ఉద్యోగం

[మార్చు]

1923 లో వైస్రాయ్ కార్యవర్గ పదవిని స్వీకరించమని కోరినా నిరాకరించి, అనేకసార్లు ,హైకోర్ట్ న్యాయమూర్తి పదవికి ఆహ్వాని౦చినా తిరస్కరించి ,1926లో తాత్కాలికంగా అడ్వొకేట్ జనరల్ పదవి మాత్రం స్వీకరించాడు.

రాజకీయం

[మార్చు]

మితవాదిగా రాజకీయం లోకి ప్రవేశించి, అనిబీసెంట్ హోం రూల్ ఉద్యమంలో  భూలాభాయ్  పని చేసి విస్తృత ప్రచారం తెచ్చాడు. అప్పుడే గాంధీజీ, వల్లభాయ్ పటేల్ లతో పరిచయం కలిగింది. 1928 బార్డోలీ సత్యాగ్రహం  చరిత్రాత్మకమై సైమన్ కమీషన్ బహిష్కరణలో దేశం ఊగిపోయింది .ప్రజలు అనేక కష్టనష్టాలు  ఎదుర్కొంటూ అత్యంత ధైర్య సాహసాలతో ‘’సైమన్ గోబాక్ ‘’నినాదాలతో దేశాన్ని అట్టుడికి౦చారు .అప్పుడే బార్దోలీలో రీ సెటిల్ మెంట్ విషయంలో పన్నుల నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది .ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించింది .1930లో గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగి ,లండన్ లో రెండవ రౌండ్ టేబుల్ సభకు గాంధీకి ఆహ్వానం వచ్చింది .గాంధీ నిరాకరించాడు .బార్డోలీ పన్నుల విషయం లో ఒక ప్రత్యేకకోర్టు పెట్టి విచారిస్తామని ప్రభుత్వం తెలియజేయగా గాంధీ లండన్ వెళ్ళటానికి ఒప్పుకున్నాడు .1931లో బార్డోలీ విచారణ సంఘం ఏర్పడింది .

1928లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రూం ఫీల్డ్ కమిటీ ముందు  రైతులపక్షాన భూలాభాయ్ వాదింఛి,1931 బార్డోలీ విచారణ సంఘం  ఎదుట కూడా వాదించాడు. 1932 సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీతో పాటు పాల్గొన్నాడు .ఈ మహోద్యమానికి ముఖ్యకారణం లార్డ్ విల్లింగ్టన్ వైఖరే .గాంధీ లండన్ నుంచి రాగానే నెహ్రూను అలహాబాదులో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను పెషావర్ లోనూ దేశవ్యాప్తంగా వేలాది సత్యాగ్రహులను  అరెస్ట్ చేసి౦ది ప్రభుత్వం .కలకత్తాలో ఆర్డినెన్స్ పెట్టారు .దేశమంతా నానా భీభత్సంగా మారింది .గాంధీ వైశ్రాయికి ఒక టెలిగ్రాం పంపిస్తూ అతనితో మాట్లాడాలని ఉందని తెలిపాడు .రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విషయాలుతప్ప ,ఇంకేమీ మాట్లాడటానికి వీల్లేదని జవాబు రాగా, గత్యంతరం లేక కాంగ్రెస్ స్వాతంత్ర్య పోరాటానికి దిగాల్సి వచ్చింది .

ఉద్యమం జయప్రదంగా సాగుతుంటే వైస్రాయ్ ఆరు వారాలలో అణచి వేస్తానని  ప్రగల్భాలు పలుకగా ,ఉద్యమం ఉవ్వెత్తున రెండేళ్ళు నడిచింది . 1921 ఉద్యమంలో 30వేల మంది 1930ఉద్యమం లో 60వేలమంది ,1932లో లక్ష ఇరవై వేలమంది  ప్రజలు స్వచ్చందంగా జైలుకు వెళ్ళారు  ,1932లో సత్యాగ్రహ ఉద్యమంలో భూలాభాయ్ పాల్గొని ఒక ఏడాదిజైలు శిక్ష  అనుభవించి ,10వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాడు .విడుదలై 1933లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సభలో కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరయ్యాడు.

1930 లో లిబరల్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత భూలాభాయ్ దేశాయ్ అధికారికంగా కాంగ్రెస్‌లో చేరాడు. పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం విదేశీ వస్తువుల బహిష్కరణ ప్రభావం గురించి ఒప్పించి, భూలాభాయ్ స్వదేశీ సభను ఏర్పాటు చేసి, 80 టెక్స్‌టైల్ మిల్లులను చేరడానికి ఒప్పించారు.సభను చట్టవిరుద్ధంగా ప్రకటించారు. 1932లో సభలో తన కార్యకలాపాల కోసం భూలాభాయ్‌ను అరెస్టు చేశారు.అతను ప్రత్యేక అధికారాలతో "A" తరగతి ఖైదీగా పరిగణించబడ్డాడు. జైలులో ఉన్నప్పుడు భూలాభాయ్ బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నట్లు భావించారు. తన కుమారుడికి రాసిన లేఖలో, "... బాహ్య ప్రపంచంలో, నా ఆత్మలు ఎక్కువగా నిర్వహించబడ్డాయి," అయితే జైలులో, "స్థిరమైన దినచర్య, చనిపోయిన గోడల ఖాళీ ముఖం" ఉన్నాయి. అతను భగవద్గీత, చట్టంతో సహా వివిధ అంశాలపై పుస్తకాలు చదవడానికి తన సమయాన్ని వెచ్చించాడు.[2]

వ్యూహం మార్చి కాంగ్రెస్ శాసనసభ ఆక్రమణకు దిగింది .శాసనసభా బహిష్కరణ కు వత్తాసు పలికిన పార్టీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటానికి ముఖ్యకారకుడు భూలాభాయ్ .గుజరాత్ నుంచి కేంద్ర శాసన సభ సభ్యుడుగా భాయ్ ఎన్నికయ్యాడు .కాంగ్రెస్ పక్ష నాయకుడయ్యాడు. ఎస్ సత్యమూర్తి ఉపనాయకుడు .పండిత మోతీలాల్ నెహ్రూ చనిపోయాక అంతటి ప్రతిభాశాలి శాసన సభలో కరువయ్యారు .ఆకొరత తీర్చటానికి భూలాభాయ్ ని పార్టీ ఎంపిక చేసింది .అప్పటికి ఇతనికి  అందులో  అనుభవం లేదు..స్వయం కృషితో అనుభవం సాధించి 1936లో ప్రభుత్వ విధానాలకు అసమ్మతి తెలుపుతూ  అసెంబ్లీ నుంచి పార్టీ సభ్యులతో మొదటి సారిగా వాకౌట్ చేసి భూలాభాయ్ చరిత్రసృస్టించాడు.

మరణం, ఆస్తులు, సంపద

[మార్చు]

భూలాభాయ్ దేశాయ్ మే 6, 1946 న మరణించారు. అతని అపారమైన సంపద భూలాభాయ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు దారితీసింది.[2]

మూలాలు

[మార్చు]
  1. https://ia801607.us.archive.org/24/items/in.ernet.dli.2015.372342/2015.372342.Kiirti-Sheishhudu.pdf
  2. 2.0 2.1 "Bhulabhai Desai". web.archive.org. 2021-03-23. Archived from the original on 2021-03-23. Retrieved 2021-09-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]