భోజరాజ్ నాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భోజరాజ్ నాగ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 June 2024
ముందు మోహన్ మాండవి
నియోజకవర్గం కంకేర్

పదవీ కాలం
2014 – 2018
ముందు విక్రమ్ ఉసెండి
తరువాత అనూప్ నాగ్
నియోజకవర్గం అంతగఢ్

వ్యక్తిగత వివరాలు

జననం (1972-04-07) 1972 ఏప్రిల్ 7 (వయసు 52)
హిమోదా, కాంకేర్ , ఛత్తీస్‌గఢ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సాధన నాగ్
సంతానం 3 (2 కుమారులు, 1 కుమార్తె)

భోజరాజ్ నాగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కంకేర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

భోజరాజ్ నాగ్ 1972 ఏప్రిల్ 7న కంకేర్‌లో జన్మించాడు. ఆయన 9వ తరగతి వరకు చదువుకున్నాడు. భోజరాజ్ నాగ్ 1990లో సాధన నాగ్‌ని వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

భోజరామ్ నాగ్‌ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా వచ్చి ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి 1992లో హిమోరా గ్రామం నుంచి సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2002 నుండి 2005 వరకు అంతఘర్‌లో పంచాయతీ అధ్యక్షుడిగా ఆ తర్వాత 2009 నుండి 2014 వరకు అంతఘర్‌ జిల్లా పంచాయతీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేసి 2014లో అంతగఢ్ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయనకు ఆ తరువాత ఎన్నికలలో పోటీ చేయలేదు, ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కంకేర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బిరేష్ ఠాకూర్ పై 1884 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha Elections 2024: Kanker constituency result". Deccan Herald (in ఇంగ్లీష్). 3 June 2024. Retrieved 2024-07-03.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kanker". Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  3. India Today (20 September 2014). "BJP wins Antagarh assembly bypoll in Chhattisgarh" (in ఇంగ్లీష్). Retrieved 31 July 2024.
  4. TV9 Bharatvarsh (5 June 2024). "विवादों में रहने वाले भोजराज नाग, कांकेर से जीता चुनाव, जानिए कैसा रहा सियासी सफर". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)