మంగళ తోరణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగళ తోరణాలు
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం కృష్ణ,
షా
తారాగణం చంద్రమోహన్ ,
తాళ్ళూరి రామేశ్వరి,
నూతన్ ప్రసాద్
నిర్మాణ సంస్థ కృష్ణ షా ఫిల్మ్స్
భాష తెలుగు

మంగళ తోరణాలు 1979లో విడుదలైన సాంఘిక చిత్రం. మహాభారతంలోని సుభద్రార్జున కల్యాణం ఘట్టాన్ని ఆధునిక సాంఘిక రూపంగా సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని మలిచాడు.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

బలరామయ్య, కృష్ణయ్య అనే సోదరుల గారాల చెల్లి సుభద్ర. తండ్రి ముగ్గురికీ సమానంగా ఆస్తి ఇచ్చి పోయాడు. కృష్ణయ్యకు ఇద్దరు భార్యలు. ఆస్తి కోసం సుభద్రను తన తమ్మునికి ఇచ్చి పెండ్లి చేయాలని బలరామయ్య భార్య, తన తమ్మునికి ఇచ్చి చేయాలని కృష్ణయ్య భార్య పట్టుబడుతూ వుంటారు. కృష్ణయ్య బావమరిది అర్జునరావును సుభద్ర ప్రేమిస్తూ ఉంటుంది. బలరామయ్య మిత్రుడు గంగరాజు ఒక వడ్డీ వ్యాపారి. అతని ప్రబోధంతో బలరామయ్యకు అర్జునరావు అంటే గిట్టకుండా పోతుంది. సుభద్ర, అర్జునరావులకు పెండ్లి చేయాలని కృష్ణయ్య అనేక ప్రయత్నాలు చేస్తాడు[1].

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
  • సంగీతం: రమేష్ నాయుడు

పాటలు

[మార్చు]
  1. ఈడు పెళ్ళంటోంది మూడు ముళ్ళంటోంది తాళి కడితే గాని - పి.సుశీల - రచన: వేటూరి
  2. ఉదయమౌతున్నా సంధ్యపడుతున్న కదలదు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన: సినారె
  3. ఏమైందంటే నే చెప్పలేను ఏంకాలేదంటే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
  4. సందెమెళ్లిపోగానే చందురుడు రాగానే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
  5. కుర్రవాడే అల్లరోడే - ఎస్.జానకి - రచన: దాసం గోపాలకృష్ణ

మూలాలు

[మార్చు]
  1. పి.ఎస్. (4 January 1980). "చిత్రసమీక్ష మంగళతోరణాలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 273. Retrieved 16 January 2018.[permanent dead link]