జింబో
(మంగారి రాజేందర్ నుండి దారిమార్పు చెందింది)
జింబో | |
---|---|
జననం | మంగారి రాజేందర్ 1957 వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
వృత్తి | కవి, కథా రచయిత, విమర్శకుడు, న్యాయమూర్తి. |
జింబో (1957) కవి, కథా రచయిత, విమర్శకుడు, న్యాయమూర్తి.జిల్లా , సెషన్స్ జడ్జి గా పనిచేసారు. జ్యూడిషీయల్ అకాడెమి డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా, ఆర్బిట్రేటర్ గా పనిచేస్తున్నారు.
బాల్యం
[మార్చు]జింబో అసలు పేరు మంగారి రాజేందర్. ఇతను 1957లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ లో జన్మించారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]వృత్తి పరంగా న్యాయమూర్తి. న్యాయవ్యవస్థపై బండారాన్ని బయటపెట్టె కథలెన్నో ఇతను రాశారు. కవిగా, కథకుడిగా ఎన్నో రచనలు రచించారు.
కవిత్వ సంపుటాల
[మార్చు]- హాజిర్ హై
- రెండక్షరాలు
- లోపలి వర్షం
- చూసుండగానే
- ఒకప్పుడు
కథా సంపుటాలు
[మార్చు]- రూల్ ఆఫ్ లా
- జింబో కథలు
- మా వేములవాడ కథలు
- కథలకి ఆవల
- ఒక చిన్నమాట
- నేనూ .. నా నల్లకోటు
- మా వేములవాడ కథలు-2
మూలాలు
[మార్చు]- ↑ జింబో. "జింబో రెండక్షరాలు". నమస్తే తెలంగాణ. Retrieved 8 October 2017.