మంగోలియాలో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగోలియాలో హిందూమతం
మంగోలు లిపిలో ఓమ్
Total population
0.5% of religious Mongolians follow a religion other than Buddhism, Shamanism, Islam or Christianity.
భాషలు
మంగోలు
మతం
హిందూమతం

బ్మంగోలియాలో హిందూమతం మైనారిటీ మతం; చాలా కొద్దిమంది మాత్రమే దీన్ని ఆచరిస్తారు. ఇరవయ్యవ శతాబ్దం చివరిలో మంగోలియాలో హిందువులు కనిపించడం మొదలైంది. [1] 2010, 2011 మంగోలు జనాభా లెక్కల ప్రకారం, మెజారిటీ ప్రజలు బౌద్ధమతం (86%), షమానిజం (4.7), ఇస్లాం (4.9%) లేదా క్రైస్తవం (3.5)ని అనుసరిస్తారు. జనాభాలో 0.5% మాత్రమే ఇతర మతాలను అనుసరిస్తున్నారు. [2]

ఇరవయ్యవ శతాబ్దంలో, సామ్యవాద మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ మతాచారాలను పరిమితం చేసింది. దేశవ్యాప్తంగా నాస్తికత్వాన్ని అమలు చేసింది. [3] 90వ దశకం చివరిలో కమ్యూనిస్టు పాలన పతనమవడంతో మతపరమైన బహుళత్వానికి, ప్రయోగాల శకానికీ నాంది జరిగింది. [3] మంగోలియన్లు హిందూమతం, మార్మోనిజం, క్రైస్తవ మతంతో సహా వివిధ మతాలను ఆచరించడం ప్రారంభించారు. [4]

ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, ఆనంద మార్గ సంస్థలతో సహా హిందూ తత్వాలను బోధించే వివిధ ఆధ్యాత్మిక సమ్మేళనాలు ఉలాన్‌బతార్‌లో పనిచేస్తున్నాయి. పతంజలి యోగా, ఆధ్యాత్మిక శాకాహారం వంటి హిందూమతం నుండి ప్రేరణ పొందిన పద్ధతులు మంగోలియాలో ఆచరిస్తారు; సస్కియా అబ్రహమ్స్-కవునెంకో ప్రకారం, మంగోలియా బౌద్ధులు తమ బౌద్ధ ఆచారాలలో హిందూ ఆధ్యాత్మికతను, భావనలనూ చేర్చడం ప్రారంభించారు. [4] హిందూ చిహ్నాలు మంగోలు గాథలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రభావితం చేశాయి. [5]

చరిత్ర

[మార్చు]
1206 నుండి 1294 వరకు మంగోల్ సామ్రాజ్య విస్తరణ.

మంగోలు సామ్రాజ్యంలో హిందూమతం

[మార్చు]

మంగోల్ సామ్రాజ్యం పరమత సహనాన్ని పాటించేది. [6] చెంఘీజ్ ఖాన్ మతపరమైన వైవిధ్యానికి తెరతీశాడు. చెంఘీజ్ ఖాన్ జయించిన దేశాల్లో వారి స్థానిక మతాలను ఆచరించడాన్ని అనుమతించాడు. [7] ఈ కారణంగా, బౌద్ధమతం, షమానిజం, ఇస్లాం, క్రైస్తవ మతం అన్నీ మంగోలు చక్రవర్తి పాలనలో ప్రజలు ఆచరించేవారు. [7] చెంఘీజ్ ఖాన్ భారతదేశంపై దండెత్తలేదు; అతను భారతదేశాన్ని "సోదరుడు" లేదా దేవుని తోటి బిడ్డగా చూశాడు. స్వర్గం దృష్టిలో మంచిగా ఉండటం కోసం భారత భూమిని జయించకుండా మిన్నకున్నాడు. [6] అతని సామ్రాజ్యం భారతదేశంలోకి విస్తరించనందున, మంగోల్ సామ్రాజ్యంలో హిందూమతం ప్రధాన మతం కాలేదు. [6]

మంగోలియా చరిత్రలో హిందూ సూచనలు

[మార్చు]

మంగోలియా బౌద్ధం మెజారిటీగా ఉన్న దేశం. [8] రచయిత శరద్ సోనీ ప్రకారం, ఈ కారణంగా మంగోలియా, భారతదేశాలు ఆధ్యాత్మికంగా ఇరుగు పొరుగు దేశాలు. [9] బౌద్ధమతం హిందూమతం నుండి ఉద్భవించింది. వాస్తవానికి అది హిందూ సంస్కరణవాద ఉద్యమం. స్వయానా బుద్ధుడు హిందూ యువరాజు. [10] బౌద్ధ విశ్వాసాలలో అనేక హిందూ ప్రస్తావనలు, దేవుళ్ళు, దేవతలు, అభ్యాసాలూ ఉన్నాయి. [11] మంగోలియాలో హిందూమతం ప్రబలంగా ఉంది, అక్కడి ప్రజలు దాన్ని బాగా అర్థం చేసుకున్నారు కూడాను. ఎందుకంటే మంగోలు చరిత్ర, మత వ్యవస్థల్లో అనేక హిందూ ప్రస్తావనలు ఉన్నాయి. ఉదాహరణకు, 1500లలో మంగోలియా గ్రాండ్ లామాను హిందూ, బౌద్ధ దేవుడైన మైత్రేయ అవతారంగా భావించేవారు; మంగోలియన్లు హిందూ దేవుడు శివుని రూపంగా మహాకాలుడిని పూజిస్తారు. [12]

ఆధునిక మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్‌లో హిందూమతం

[మార్చు]

కమ్యూనిజంకు మారడానికి ముందు మంగోలియాలో ఉన్న రాజకీయ వ్యవస్థ, సంస్కృతి బౌద్ధ వ్యవస్థలు అభ్యాసాలతో కలిసేవి. సోవియట్ తరహాలో ఏర్పడిన మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్, మతస్వేచ్ఛను అణచివేసింది. [3] మఠాలు, మతపరమైన చిహ్నాలను నాశనం చేసింది. నాస్తికత్వాన్ని స్వీకరించాలటూ ప్రజలను వత్తిడి చేసింది. [3] విద్యావేత్త ఇవాన్ మేరీ-డొమినిక్ చెప్పినట్లుగా, ఆధ్యాత్మిక అణచివేత యుగం తరువాత, 1999లో కమ్యూనిస్ట్ పాలన పతనం కావడంతో మంగోలియా తన మతపరమైన గుర్తింపును తిరిగి పొందింది. [3] బౌద్ధమతం మంగోలియాలో ప్రధాన మతంగా తిరిగి వచ్చింది. 1990 నుండి, మంగోలియన్లు ఇతర మతపరమైన గుర్తింపులతో సముదాయాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. [13]

మంగోలియాలో హిందూయిజం

[మార్చు]

హిందూ దేవుడు శివుడు

[మార్చు]

బెర్తోల్డ్ లాఫెర్ ప్రకారం, మంగోలు గాథల్లో, హిందూ దేవుడైన శివుడు ఉండే స్ఫూర్తిదాయకమైన ఓ కల కారణంగా మంగోల్ చక్రవర్తులు బౌద్ధమతంలోకి మారారు. [14] మంగోలు రాజు కుబ్లాయ్ ఖాన్, తంత్రాల పుస్తకానికి సంబంధించి తనకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకోడానికి ఒక సన్యాసిని పిలిపించాడని మంగోలియన్ క్రానికల్ సనాంగ్ సెట్సెన్ వివరించిన పురాణం పేర్కొంది. ఖాన్‌ ప్రశ్నలకు సన్యాసికి సమాధానం తెలియలేదు. చక్రవర్తులు ప్రశ్నించడాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ రాత్రి సన్యాసికి శివుడు కలలో కనిపించాడని పురాణం చెబుతోంది. [15] శివుడు సన్యాసికి తంత్రాల పుస్తకాన్ని ఇవ్వగా, దాన్నతడు నిద్రలోనే కంఠస్థం చేశాడు. [14] శివుడు దర్శనమిచ్చిన మరుసటి రోజు, సన్యాసి తిరిగి వెళ్ళి కుబ్లాయ్ ఖాన్‌ ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. దీని ఫలితంగా ఖాన్ అతనిని పవిత్ర లామాగా చైనా, టిబెట్, మంగోలియాల్లో సైద్ధాంతిక రాజుగా నియమించాడు. [16] ఆ యుగంలో సన్యాసి ఫాగ్పా, మంగోలియా బౌద్ధ భవిష్యత్తుకు పునాది వేసేలా, టిబెటన్ బౌద్ధమతాన్ని ప్రతిబింబించేలా, మంగోలు న్యాయస్థానాలనూ శాసనాలనూ సంస్కరించాడు.

గంగా సరస్సు

[మార్చు]

మంగోలు రచయిత గొంబోజావ్ మెండ్-ఓయో ప్రకారం, భారతదేశంలోని గంగా నది నుండి ఒక మంగోలు కులీనుడు రెండు సీసాల్లో తీసుకువచ్చిన నీటి నుండి మంగోలియాలోని సుఖ్‌బాతర్ ప్రావిన్స్‌లోని గంగా సరస్సు ఉద్భవించిందని మంగోలు గాథ చెబుతోంది. [17] గంగానది ప్రభావవంతమైన హిందూ చిహ్నం. గంగాస్నానం సర్వపాపహరణం. [18] మంగోలియాలోని గంగా సరస్సు గాథలు, గంగాస్నానం ద్వారా ముక్తి పొందవచ్చనే హిందూ నమ్మకానికి అద్దం పడతాయి. మంగోలు జానపద కథల ప్రకారం, గంగా సరస్సు నుండి వచ్చే నీటికి ఔషధ గుణాలు, శుద్ధి చేసే లక్షణాలూ ఉన్నాయి. [19]

ఆధునిక మంగోలియాలో హిందూమతం

[మార్చు]

ప్రపంచంలో అత్యధికంగా ఆచరించే మతాలలో హిందూమతం మూడవ స్థానంలో ఉంది. సంవత్సరానికి 1.9% చొప్పున పెరుగుతోంది. [20] ఇయర్‌బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలిజియస్ డెమోగ్రఫీ రికార్డ్స్ 2014 ప్రకారం, ప్రపంచంలోని హిందువులలో 98.3% మంది దక్షిణాసియాలో నివసిస్తున్నారు. [21] హిందూమతం అనేది ఒక ఛత్రం, ఇది వివిధ దేవుళ్ళను పూజించే, విభిన్న గ్రంథాలను చదివే అనేక విభిన్న సమూహాల సంకలనం. మంగోలియాలో, హిందూమతంలోని అంశాలను సూచించే సమాజాలు, పద్ధతులు పెరుగుతున్నాయి.

మంగోలు హిందువుల ఆచార వ్యవహారాలు

[మార్చు]

మంగోలియాలో హిందూమతం మైనారిటీ మతం. జాతీయ స్థాయిలో గుర్తించదగ్గ హిందూ పండుగలూ ఉత్సవాలూ మంగోలియాలో లేవు. హిందూమతంపై ఆధారపడ్డ ఆధ్యాత్మిక సంఘాలు, సత్సంగాల కారణంగా ఉలన్‌బాతర్‌లో హైందవ ఆచారాలు నగరంలో కనిపిస్తూంటాయి.[22]

మంగోలియాలో శాకాహారం

[మార్చు]

మంగోలు ఆహారంలో సాంప్రదాయికంగా మాంసం, పశువుల ఉత్పత్తులూ ఉంటాయి. [23] హిందూ-ఆధారిత ఆధ్యాత్మిక సమూహాలైన ఆనంద మార్గ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లు శాకాహార జీవనశైలిని బోధిస్తాయి. ఇది వారికి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందడంలో సహాయపడుతుంది. [24] ఆనంద మార్గ సమాజం 2006లో ఉలాన్‌బాతర్‌లో మొదటి శాకాహార రెస్టారెంట్‌ను ప్రారంభించింది, అప్పటి నుండి, పదికి పైబడిన హిందూ ఆధ్యాత్మిక సముదాయాలతో అనుబంధించబడిన శాకాహార రెస్టారెంట్‌లు తెరిచారు.

మంగోలియాలో హిందూ సాహిత్యం

[మార్చు]

మంగోలియాలో హిందూ ఆధ్యాత్మిక తత్వాలను అన్వేషించే గ్రంథాలు అసాధారణం కాదు. ఉలాన్‌బాతర్‌లో నిర్వహించిన ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనం ప్రకారం, అబ్రహ్మ్స్-కవునెంకో మంగోలు పుస్తక దుకాణాలలో హిందూ గురువైన ఓషో, రవిశంకర్ లు రాసిన గ్రంథాలు ఎక్కువగా అమ్ముడవుతూ ఉంటాయి.

కృష్ణ సొసైటీ ఆఫ్ మంగోలియా లేదా అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం దాని వ్యవస్థాపక గురువు శ్రీల ప్రభుపాద రాసిన అనేక పుస్తకాలను భగవద్గీతతో సహా మంగోలు భాష లోకి అనువదించింది. పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఫేస్‌బుక్ ద్వారా అలాగే ఫిజికల్ స్టోర్‌లలో విక్రయిస్తారు. [25] హరే కృష్ణులతో సమానంగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుయాయులు ఉపనిషత్తులు, యోగ సూత్రం వంటి సాంప్రదాయ భారతీయ తాత్విక ఉపన్యాసాలపై వారి గురువు రవిశంకర్ రాసిన అనేక కరపత్రాలు, వ్యాఖ్యానాలను అనువదించారు.

అతీంద్రియ ధ్యానం గురించిన పుస్తకాలను మొదటగా మంగోలు లోకి అనువదించిన వారు దివంగత గురువు శ్రీ చిన్మోయ్ భక్తులు. [26]

హిందూ తత్వశాస్త్రపు సంక్లిష్టమైన భావనలు, సూక్ష్మ నైపుణ్యాలను మరింత లోతుగా పరిశోధిస్తూ, "మంగోలు భాషలో భారతీయ తాత్విక వ్యవస్థల రూపురేఖలు" అనే పుస్తకం అద్వైత వేదాంతానికి ప్రాధాన్యతనిస్తూ సాంప్రదాయిక 6 హిందూ దర్శనాల (చార్వాక, మీమాంస, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ) భావనలను సమీక్షిస్తుంది. 2021 జూలై నుండి ఉలాన్‌బాతర్ పుస్తక దుకాణాల్లో లభిస్తోంది. [27]

మంగోలియాలో మత సహనం

[మార్చు]

చట్టం ప్రకారం, మంగోలు ప్రభుత్వం మత స్వేచ్ఛ కల్పిస్తోంది. మతపరమైన సంస్థలను రాజ్యాన్నీ వేరువేరుగా చూస్తుంది. [28] మంగోలియాలోని మతపరమైన సమూహాలకు అధికారుల నమోదు తప్పనిసరి. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ (UNHR) ప్రకారం, మంగోలియాలోని చిన్న మత సంస్థలు, నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసేటప్పుడు తాము అధికారుల వివక్షను ఎదుర్కొంటున్నట్లు నివేదించాయి. [28] నమోదులను పునరుద్ధరించే సమయంలో ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నామని ఇతర మైనారిటీ సమూహాలు పేర్కొన్నాయి. నమోదుకాని మతపరమైన సామూహిక సంఘాలు, మైనారిటీ మత సమూహాలు తమను ప్రభుత్వ అధికారులు, పన్ను వసూలు చేసేవారు, పోలీసులు వేధిస్తున్నారని పేర్కొన్నాయి. [28]

ఆధునిక మంగోలియాలో హిందూ సమ్మేళనాలు, సమాజాలు

[మార్చు]

మంగోలియాలో హరే కృష్ణ

[మార్చు]
దస్త్రం:Krishna tells Gita to Arjuna.jpg
కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసాడు. హరేకృష్ణ భక్తులు కృష్ణుని భగవంతుని ఏకైక రూపంగా పూజిస్తారు.

మంగోలియాలో హిందూ విశ్వాసాలను ఆచరించిన, ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న సంఘంగా మారడానికి ప్రయత్నించిన మొదటి సంఘం, ఉలాన్‌బాతర్‌లోని కృష్ణ చైతన్య సంఘం. [29] గ్రాహం M. స్కీవిగ్ ప్రకారం, కృష్ణ చైతన్యం అనేది హిందూమతంలో ఒక శాఖ. ఇది వైష్ణవ మతం నుండి ఉద్భవించింది. విష్ణువు లేదా కృష్ణుడి ఆరాధన కేంద్రంగా ఉన్న సంఘం ఇది. మంగోలియన్ కృష్ణ సొసైటీ అనేది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ISKON) లేదా హరేకృష్ణ ఉద్యమానికి శాఖ. [30]

హరే కృష్ణను 1999లో లక్ష్మీ నారాయణ మంగోలియాకు తీసుకువచ్చాడు. అతను ఇస్కాన్‌కు అంకితమైన వ్యక్తి. హరేకృష్ణ కార్యక్రమాలను నిర్వహించడానికి తూర్పు సైబీరియా నుండి మంగోలియాకు మిషనరీగా ప్రయాణించారు. [31] ISKON ప్రకారం, చాలా మంది మంగోలియన్లు ఆచరణలో సంఘం ఆసక్తిని కనబరిచారు; స్థానిక భక్తులే స్వయంగా ఆరాధనా సమావేశాలను నిర్వహించడం ప్రారంభించారు. శ్రీల ప్రభుపాద ఆధ్యాత్మిక గ్రంథాలను మంగోలియన్‌లోకి అనువదించిన తర్వాత సభ మరింతమంది ప్రేక్షకులకు చేరువైంది. [32] 2009 నాటికి, భారతదేశంలో 25 మంది భక్తులకు శిక్షణ నిస్తున్నారు. అలాగే కృష్ణ చైతన్యాన్ని అభ్యసించే అనేక మంది విద్యార్థులు ఉన్నారు.

హరే కృష్ణ దేవాలయాలు

[మార్చు]

2009లో సొసైటీ మంగోలు ప్రభుత్వం క్రింద రిజిస్టర్డ్ సొసైటీగా మారడానికి ప్రయత్నించింది. సంఘం అధికారిక ఆలయాన్ని నిర్మించాలనే షరతుపై ప్రభుత్వం ఆ అభ్యర్థనను అంగీకరించింది. 2009లో ISKON ఉలాన్‌బాతర్‌లో వేద ఆలయాన్ని నిర్మించే ప్రణాళికను ప్రకటించింది. ప్రతిపాదిత ఆలయ నిర్మాణానికి ముందు, సంఘం స్థానిక యర్ట్‌లో వారానికోసారి సమావేశాలు నిర్వహించేది. తాము విరాళాలపై ఆధారపడినందున ఆలయానికి నిధులు సమకూర్చడం సవాలుగా ఉంటుందని 2009 లో ఇస్కాన్ పేర్కొంది, ఈ ప్రకటన తరువాత ఆలయ నిర్మాణ పురోగతిపై ఎటువంటి తాజా సమాచారం లేదు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్

[మార్చు]

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ను ఒక ఆధ్యాత్మిక విద్యా, మానవతా ఉద్యమంగా రవి శంకర్ 1981 లో స్థాపించాడు. [33] ఈ సంస్థ 152 దేశాల్లో పనిచేస్తుంది. రవిశంకర్ యొక్క శాంతి, కరుణ తత్వాన్ని ప్రచారం చేస్తుంది. [34] రవిశంకర్ ఆధ్యాత్మికత సారాంశాన్ని బోధిస్తాడు. హిందూ విలువలు, అభ్యాసాలు, వ్యవస్థలు, సంప్రదాయాలను ప్రోత్సహిస్తాడు. [35] ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది మతపరమైన సంస్థ కాదు; ఇది యోగా, పూజ, జపం వంటి హిందూ అభ్యాసాలనూ కృతజ్ఞత, ప్రేమ, అనుబంధం కరుణ వంటి హిందూ విలువలనూ స్వీకరించే ఆధ్యాత్మిక ఉద్యమం. [36]

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి మొదటి తరగతి ఉలాంబాతర్ లో 1995 లో జరిగింది. [37] మంగోలియాలోని మెడిటేషన్ సెంటర్ ప్రస్తుతం రవిశంకర్ రూపొందించిన కోర్సులను ఎలా నిర్వహించాలో వంద మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణనిస్తోంది. పది లక్షల కంటే ఎక్కువ మంది మంగోలులు కనీసం ఒక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుకు గాని, రిట్రీట్‌కు గానీ హాజరయ్యారు. [38] ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులకు హాజరైన రచయిత్రి నారాయణి గణేష్‌ ఇంటర్వ్యూ చేసిన మంగోలు వ్యక్తి తాను రవిశంకర్ తత్వాలను స్వీకరించడానికి బౌద్ధమతాన్ని వదులుకోలేదని చెప్పాడు. ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి బలోపేతం చేసుకుంటాయి. [39] సస్కియా అబ్రహ్మ్స్-కవునెంకో ప్రకారం, ప్రతి ముగ్గురు బౌద్ధులలో ఒకరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రిట్రీట్‌లకు హాజరయ్యారు. రవిశంకర్ మంగోలియాను మూడుసార్లు సందర్శించాడు. ప్రతిసారీ మూడు వేల నుండి ఐదు వేల మంది ప్రేక్షకులు స్వాగతం పలికారు. [40] ఉలాన్‌బతార్ సమీపంలోని ఒక స్థలంలో అంతర్జాతీయ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. [41] నారాయణి గణేష్ ప్రకారం, మతపరమైన అణచివేత కారణంగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం లేని రష్యా, పోలాండ్, మంగోలియా వంటి పూర్వ సోవియట్ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక సంస్థ విజయవంతమైంది. [42]

ఆనంద మార్గ

[మార్చు]

ఆనంద మార్గ 1955 లో భారతదేశంలో ప్రభాత్ రంజన్ సర్కార్ స్థాపించాడు. ఇదొక సామాజిక ఆధ్యాత్మిక సంస్థ, [43] హైందవ తాత్విక, యోగ వ్యవస్థ. [44] ఇది దేవతను ఆరాధించదు కానీ దాని తత్వశాస్త్రాన్ని రూపొందించడానికి కొన్ని హిందూ బోధనలను ఎంపిక చేసుకుంది. [45] ఆనంద మార్గ హిందూమతం లోనే మతపరమైన వర్గంగా గుర్తించబడింది. ఇది వ్యక్తిగత అభివృద్ధిని సమాజ అభివృద్ధినీ ప్రచారం చేస్తుంది. [46]

దీదీ ఆనంద కాళిక, గతంలో గాబ్రియెల్ డౌలింగ్ అనే పేరున్న ఆనంద మార్గ సన్యాసిని. ఆమె 1993లో ఉలాన్‌బాతర్‌కు వెళ్లి అక్కడ ఒక అనాథాశ్రమాన్ని తెరిచి ఆనంద మార్గ ఆధ్యాత్మికతను అభ్యసించడం ప్రారంభించింది. ఉలాన్‌బాతర్‌లోని లోటస్ పిల్లల పాఠశాల ఒక అనాథాశ్రమం. అది ఆనంద మగరా ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. [47] దీదీ ఆనంద కాళిక మంగోలియాలోని ఆనంద యోగా కేంద్రాన్ని కూడా నడుపుతోంది. ఇక్కడ వారు యోగా, ధ్యాన అభ్యాసాలు, ఆనంద మార్గ సిద్ధాంతాలను బోధిస్తారు. [48] శాకాహారాన్ని ప్రోత్సహించే ఆనంద మార్గ తాత్విక విలువలకు అనుగుణంగా దీదీ ఆనంద కాళిక, 2006లో ఆనంద కేఫ్ పేరుతో ఉలాన్‌బాతర్‌లో మొదటి శాకాహార రెస్టారెంట్‌ను ప్రారంభించింది. [24]

మూలాలు

[మార్చు]
  1. Mongolianembassy.org.au. 2020. About Mongolia – Embassy Of Mongolia In Australia. [online] Available at: <https://mongolianembassy.org.au/about-mongolia/ Archived 2021-11-27 at the Wayback Machine> [Accessed 14 October 2020].
  2. Mongolianembassy.org.au. 2020. About Mongolia – Embassy Of Mongolia In Australia. [online] Available at: <https://mongolianembassy.org.au/about-mongolia/ Archived 2021-11-27 at the Wayback Machine> [Accessed 14 October 2020].
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Marie-Dominique, Evan. “Ritual Efficiency or spiritual quest? Buddhism and modernity in Post-communist Mongolia.” Brill's Tibetan Studies Library : Revisiting Rituals in a Changing Tibetan World. Leiden: BRILL. 2012 Accessed September 10, 2020. ProQuest Ebook Central.
  4. 4.0 4.1 Abrahms-Kavunenko, Saskia (1 January 2012). "Religious 'Revival' After Socialism? Eclecticism and Globalisation Amongst Lay Buddhists in Ulaanbaatar". Inner Asia. 14 (2): 279–297. doi:10.1163/22105018-90000005. JSTOR 24572065.
  5. Laufer, Berthold (April 1931). "Inspirational Dreams in Eastern Asia". The Journal of American Folklore. 44 (172): 208–216. doi:10.2307/535842. JSTOR 535842.
  6. 6.0 6.1 6.2 Prawdin, Michael; Chaliand, Gérard (2017). "The Conqueror's Grandsons". The Mongol Empire. pp. 286–302. doi:10.4324/9781315133201-17. ISBN 978-1-315-13320-1.
  7. 7.0 7.1 Atwood, Chirtopher P. (June 2004). "Validation by Holiness or Sovereignty: Religious Toleration as Political Theology in the Mongol World Empire of the Thirteenth Century". The International History Review. 26 (2): 237–256. doi:10.1080/07075332.2004.9641030. మూస:ProQuest.
  8. Wallace, Vesna (2010). "Buddhism in Mongolia". doi:10.1093/obo/9780195393521-0111. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  9. Nyamdavaa, Oidov (2015). "Ancient Cultural, Ethnic And Religious Ties Between Mongolia And India". World Affairs: The Journal of International Issues. 19 (4): 150–159. JSTOR 48505253.
  10. Issitt, Micah Lee, and Main, Carlyn. 2014. Hidden Religion: the Greatest Mysteries and Symbols of the World's Religious Beliefs. Santa Barbara: ABC-CLIO, LLC. Accessed September 11, 2020. ProQuest Ebook Central.
  11. Issitt, Micah Lee, and Main, Carlyn. 2014. Hidden Religion: the Greatest Mysteries and Symbols of the World's Religious Beliefs. Santa Barbara: ABC-CLIO, LLC. Accessed September 11, 2020. ProQuest Ebook Central.
  12. Eliot, Charles., 2019. HINDUISM AND BUDDHISM. 3rd ed. [Place of publication not identified]: OUTLOOK Verlag, pp.329, 330.
  13. Mongolia's religious revival: Many Mongolians are embracing religion again following decades of communist rule [online]. World News Australia (SBS Melbourne); Time: 18:42; Broadcast Date: Monday, 18th July 2011;Duration: 2 min., 28 sec. Availability: <https://search-informit-com-au.ezproxy1.library.usyd.edu.au/documentSummary;dn=TEX20112901004;res=TVNEWS> [cited 08 Sep 20]
  14. 14.0 14.1 Laufer, Berthold (April 1931). "Inspirational Dreams in Eastern Asia". The Journal of American Folklore. 44 (172): 208–216. doi:10.2307/535842. JSTOR 535842.
  15. Laufer, Berthold (April 1931). "Inspirational Dreams in Eastern Asia". The Journal of American Folklore. 44 (172): 208–216. doi:10.2307/535842. JSTOR 535842.
  16. Bangdel, D. and Huntington, J., 2003. The Circle Of Bliss: Buddhist Meditational Art. Chicago, Ill: Serindia Publications, pp.45,46.
  17. "GANGA RIVER, GANGA LAKE, FOLKTALES AND POETRY: THE FIVE OF US". 2020. Mend-Ooyo.Mn. http://www.mend-ooyo.mn/news/219.html.
  18. Garcia, A 2017, ‘Hinduism, the Buddha, & the Ganges’ Dig Into History, vol. 19, no. 2.
  19. "GANGA RIVER, GANGA LAKE, FOLKTALES AND POETRY: THE FIVE OF US". 2020. Mend-Ooyo.Mn. http://www.mend-ooyo.mn/news/219.html.
  20. Yearbook of International Religious Demography 2014 : Yearbook of International Religious Demography 2014, BRILL, 2014. ProQuest Ebook Central, http://ebookcentral.proquest.com/lib/usyd/detail.action?docID=1786624. Created from usyd on 2020-09-08 00:46:13.
  21. Yearbook of International Religious Demography 2014 : Yearbook of International Religious Demography 2014, BRILL, 2014. ProQuest Ebook Central, http://ebookcentral.proquest.com/lib/usyd/detail.action?docID=1786624. Created from usyd on 2020-09-08 00:46:13.
  22. Abrahms-Kavunenko, Saskia (1 January 2012). "Religious 'Revival' After Socialism? Eclecticism and Globalisation Amongst Lay Buddhists in Ulaanbaatar". Inner Asia. 14 (2): 279–297. doi:10.1163/22105018-90000005. JSTOR 24572065.
  23. Sebastia, Brigitte, ed. (2017). Eating Traditional Food: Politics, identity and practices. doi:10.4324/9781315643410. ISBN 978-1-315-64341-0.మూస:Pn
  24. 24.0 24.1 Abrahms-Kavunenko, Saskia Adelle (2011). Improvising tradition: lay Buddhist experiences in cosmopolitan Ulaanbaatar (Thesis). OCLC 903861529.
  25. "www.veda.mn - Дэлгүүр". Archived from the original on 2021-11-27. Retrieved 2021-11-27.
  26. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-11-27. Retrieved 2021-11-27.
  27. "Internom. Уншъя. Урагшилъя". Archived from the original on 2021-11-27. Retrieved 2021-11-27.
  28. 28.0 28.1 28.2 United Nations High Commissioner for Refugees. "2016 Report on International Religious Freedom - Mongolia". Refworld.
  29. Smullen, M., 2009. Mongolian Devotees Pave The Path To Their First Krishna Temple. [online] ISKCON News. Available at: <https://iskconnews.org/mongolian-devotees-pave-the-path-to-their-first-krishna-temple,1476/ Archived 2021-11-27 at the Wayback Machine> [Accessed 13 October 2020].
  30. ISKCON - The Hare Krishna Movement. n.d. Home - ISKCON - The Hare Krishna Movement. [online] Available at: <https://www.iskcon.org/> [Accessed 13 October 2020].
  31. Smullen, M., 2009. Mongolian Devotees Pave The Path To Their First Krishna Temple. [online] ISKCON News. Available at: <https://iskconnews.org/mongolian-devotees-pave-the-path-to-their-first-krishna-temple,1476/ Archived 2021-11-27 at the Wayback Machine> [Accessed 13 October 2020].
  32. Smullen, M., 2009. Mongolian Devotees Pave The Path To Their First Krishna Temple. [online] ISKCON News. Available at: <https://iskconnews.org/mongolian-devotees-pave-the-path-to-their-first-krishna-temple,1476/ Archived 2021-11-27 at the Wayback Machine> [Accessed 13 October 2020].
  33. "Sri Sri Ravi Shankar". The Indian Express. 22 November 2018. Retrieved 17 December 2018.
  34. Yogapedia.com. 2020. What Is The Art Of Living? - Definition From Yogapedia. [online] Available at: <https://www.yogapedia.com/definition/8807/the-art-of-living> [Accessed 17 November 2020].
  35. Tandon, Smriti (2016). "Exploring Well Being in Indian Context". Indian Anthropologist. 46 (1): 63–78. JSTOR 43899793.
  36. Pandya, Samta P. (September 2015). "New Strategies of New Religious Movements: The Case of Art of Living Foundation". Sociological Bulletin. 64 (3): 287–304. doi:10.1177/0038022920150301.
  37. Ganesh, N., 2010. Art Of Living In Mongolia. [online] Speakingtree.IN. Available at: <https://www.speakingtree.in/article/art-of-living-in-mongolia> [Accessed 17 November 2020].
  38. Ganesh, N., 2010. Art Of Living In Mongolia. [online] Speakingtree.IN. Available at: <https://www.speakingtree.in/article/art-of-living-in-mongolia> [Accessed 17 November 2020].
  39. Ganesh, N., 2010. Art Of Living In Mongolia. [online] Speakingtree.IN. Available at: <https://www.speakingtree.in/article/art-of-living-in-mongolia> [Accessed 17 November 2020].
  40. Ganesh, N., 2010. Art Of Living In Mongolia. [online] Speakingtree.IN. Available at: <https://www.speakingtree.in/article/art-of-living-in-mongolia> [Accessed 17 November 2020].
  41. Ganesh, N., 2010. Art Of Living In Mongolia. [online] Speakingtree.IN. Available at: <https://www.speakingtree.in/article/art-of-living-in-mongolia> [Accessed 17 November 2020].
  42. Ganesh, N., 2010. Art Of Living In Mongolia. [online] Speakingtree.IN. Available at: <https://www.speakingtree.in/article/art-of-living-in-mongolia> [Accessed 17 November 2020].
  43. Crovetto, Helen (1 August 2008). "Ananda Marga and the Use of Force". Nova Religio. 12 (1): 26–56. doi:10.1525/nr.2008.12.1.26.
  44. Chryssides, GD 2012, Historical dictionary of new religious movements, 2nd ed., Scarecrow Press, Lanham, MD.
  45. Academy, H., 2020. Hinduism Today Magazine. [online] Hinduismtoday.com. Available at: <https://www.hinduismtoday.com/magazine/may-1989/1989-05-ananda-marga/[permanent dead link]> [Accessed 16 November 2020].
  46. Academy, H., 2020. Hinduism Today Magazine. [online] Hinduismtoday.com. Available at: <https://www.hinduismtoday.com/magazine/may-1989/1989-05-ananda-marga/[permanent dead link]> [Accessed 16 November 2020].
  47. Lotuschild.org. 2020. Lotus Children's Centre | A Loving Home For Vulnerable Mongolian Children.. [online] Available at: <http://www.lotuschild.org/ Archived 2021-11-27 at the Wayback Machine> [Accessed 16 November 2020].
  48. Ananda Marga. [online] Available at: <https://www.anandamarga.org/> [Accessed 16 November 2020].