Jump to content

మండవ బాపయ్య చౌదరి

వికీపీడియా నుండి

మండవ బాపయ్య చౌదరి భారత జాతీయ కాంగ్రేసు పార్టీ నాయకుడు, సమాజసేవకుడు, రాజకీయవేత్త.

ఈయన 1952లో స్వతంత్ర అభ్యర్ధిగా బెల్లంకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.[1] ఆ తర్వాత 1955లో బెల్లంకొండ నియోజకవర్గం రద్దై గురజాల నియోజకవర్గంగా రూపాంతరం చెందడంతో, 1955లో కృషికర్ లోక్ పార్టీ అభ్యర్ధిగా గురజాల నుండి గెలిచి రెండవ పర్యాయం, ఆంధ్ర రాష్ట్రంలో శాసనసభ్యుడయ్యాడు.

మండవ బాపయ్య చౌదరి, 1921, మే 9న జన్మించాడు.[2] బి.ఏ. బి.ఎల్ డిగ్రీలతో పట్టభద్రుడై, న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. ఈయన గురజాలలో గాంధీ సేవక హరిజన హాస్టలుకు యొక్క అధ్యక్షుడు. పల్నాడు, వినుకొండ తాలూకాలలో హరిజన, సుగాలీ ప్రజల ఉద్దరణకు ప్రత్యేక అభిమానంతో కృషిచేశాడు[2]

మూలాలు

[మార్చు]
  1. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 2014-10-14.
  2. 2.0 2.1 Wikisource link to పుట:Aandhrashaasanasabhyulu.pdf/66. వికీసోర్స్.