మచ్చ ప్రభాకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మచ్చ ప్రభాకర్
జననం1953
పోత్గల్‌, ముస్తాబాద్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా
మరణంజనవరి 23, 2018
ముంబై
మరణ కారణంఆత్మహత్య
నివాస ప్రాంతంముంబై
మతంహిందూ
భార్య / భర్తపుష్ప
పిల్లలుకుమారుడు, కూతురు

మచ్చ ప్రభాకర్ (1953 - జనవరి 23, 2018) తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, అనువాదకుడు. తెలంగాణ రచయితల వేదిక జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు.[1][2][3]


జననం - విద్యాభ్యాసం[మార్చు]

ప్రభాకర్ 1953లో రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం పోత్గల్‌ గ్రామంలోని పద్మశాలి కుటుంబంలో జన్మించాడు. ముస్తాబాద్‌లో మెట్రిక్యులేషన్‌, సిద్దిపేటలో ఇంటర్‌ పూర్తిచేశాడు. అనంతరం హైదరాబాదులోని అడిక్‌మెట్ కళాశాలలో డిగ్రీ చేస్తుండగానే అనాటి విప్లవ ఉద్యమాలపై సాగిన నిర్బంధం వలన అహ్మద్‌నగర్ లో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వలసపోయాడు. అక్కడ ఒక సంవత్సరంపాటు నేతకార్మికునిగా పనిచేసాడు.

వివాహం[మార్చు]

ప్రభాకర్ కు పుష్పతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు.

ఉద్యోగం[మార్చు]

1977లో ముంబై వెళ్లి అక్కడి ఆంధ్రా పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి 2014లో పదవీ విరమణ చేశాడు.

రచనా ప్రస్థానం[మార్చు]

ముంబైలో అనేక పుస్తకాలను రాశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని మరాఠిలో పుస్తకంగా పరిచయం చేయడమేకాకుండా, దేశవ్యాప్తంగా విప్లవపోరాటాలపై చర్చోపచర్చలు జరుగుతున్న సందర్భంలో పూలే, అంబేడ్కర్‌లను అధ్యయనం చేసి, వారి రచనలను తెలుగు వారికి పరిచయం చేశాడు. మఠారీ నుంచి పలు కవితలను తెలుగులోకి తర్జుమా చేయడంతోపాటు మహారాష్ట్రలోని తెలంగాణ వారి చరిత్రను వెలికితీసాడు. ముంబాయి కార్మిక చైతన్య ఉద్యమాలకు సంఘీభావంగా ఉంటూ, మరాటి పత్రికు వ్యాసాలు రాసేవారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ముంబైలో తెలంగాణ ధూంధాం కార్యక్రమాలను నిర్వహించారు.

ముంబైలోని కార్మికులను ఏకంచేసి అనేక ఉద్యమాలను నడిపించాడు. తెలంగాణ నుంచి వెళ్ళిన కార్మికులకు భావజాల శిక్షణ తరగతులను నిర్వహించాడు. నేడు ముంబైలో కొనసాగుతున్న తెలుగు సాహితీ వేత్తలందరికీ దాదాపు గురువుగా నిలిచాడు.

రచించిన పుస్తకాలు[మార్చు]

  1. నడక (కవిత్వం)
  2. రాజకీయ పెళ్లి (దీర్ఘ కవిత)
  3. నడుస్తున్న చరిత్ర (సాహిత్య వ్యాసాలు)
  4. శంభుకుడు – కర్ణుడు – అంబేద్కర్ (వ్యాసావళి)
  5. మూడడుగుల యుద్ధం (కవిత్వం) (09.09.2015.న తెరవే ఆధ్వర్యంలో కరీంనగర్ లో విడుదల)
  6. ముంబాయి నిర్మాణంలో తెలుగుప్రజల క్రియాశీల పాత్ర (మనోహర్ కదం రాసిన చరిత్ర పరిశోధన మరాఠి నుంచి అనువాదం)
  7. మేము చూసిన ఫూలే (మరాఠి అనువాదం)
  8. రామయ్య వెంకయ్య అయ్యవారు (అపూర్వ జీవిత చరిత్ర అనువాదం)

మరణం[మార్చు]

ఇటీవలే పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌ భార్య పుష్ప 2018, జనవరి 2న గుండె పోటుతో చనిపోయింది. అప్పటినుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ప్రభాకర్ 2018, జనవరి 23 మంగళవారం ఉదయం ముంబైలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (24 January 2018). "స్మృతిగా మిగిలిన ప్రభాకర్‌". జూకంటి జగన్నాథం. Retrieved 26 January 2018.[permanent dead link]
  2. 2.0 2.1 వి6 న్యూస్, వార్తలు  » రాష్ట్రీయ వార్తలు (24 January 2018). "ప్రముఖ సాహితీవేత్త మచ్చ ప్రభాకర్ కన్నుమూత". Retrieved 26 January 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  3. 3.0 3.1 నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (24 January 2018). "రచయిత, చరిత్రకారుడు మచ్చ ప్రభాకర్ మృతి". Retrieved 26 January 2018.[permanent dead link]