మడావి తూకారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మడావి తుకారం
స్థానిక పేరుమడావి తుకారం
జననం(1941-05-04)1941 మే 4
నివాస ప్రాంతం
లక్షేటి పేట్
మండలం: ఉట్నూరు
జిల్లా:ఆదిలాబాద్
తెలంగాణ రాష్ట్రం
 India భారతదేశం
విద్యఎం.ఏ
తల్లిదండ్రులుబాబూరావ్, మాన్కుబాయి

మడావి తూకారం(జననం 9141 మే 4) ఆదిలాబాద్ జిల్లా గోండి ఆదివాసీ తెగకు చెందిన తొలి ఐఏఎస్ అధికారి .[1][2]

జననం[మార్చు]

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని లక్షేట్టిపేట్ గ్రామంలో మడవి బాబూరావ్, మాన్కుబాయి దంపతులకు మూడో సంతానంగా 1941 మే 4న జన్మించాడు .

విద్యాభ్యాసం[మార్చు]

తుకారం పేదరికంలో మగ్గుతూనే ఎంఏ వరకు చదువు కున్నాడు. మాతృభాష గోండి తో పాటు మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పట్టు సాధించాడు.

వృత్తి జీవితం[మార్చు]

అనువాదకుడిగా[మార్చు]

దేశంలో గిరిజన జాతులు, భాషా సంస్కృతుల అధ్యయనం కోసం నైజాం కాలంలో రెండోసారి వచ్చిన హైమండార్ఫ్ వద్ద గోండి భాషలో అనువాదకుడిగా పని చేశాడు.

గ్రూప్-1 అధికారిగా[మార్చు]

హైమండార్ఫ్ లండన్ వెళ్లిన తర్వాత ఆయన స్ఫూర్తితో గ్రూప్-1 అధికారిగా ఎన్నికైన తుకారం మొదట కాకినాడ ఆర్డీవోగా విధుల్లో చేరాడు. 1981 ఏప్రిల్ 21న ఇంద్రవెల్లి లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎందరో ఆదివాసులు మృతి చెందినప్పుడు ఉట్నూరు ఐటీడీఏ సహాయ అధికారిగా ఉన్న తుకారం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాడు. ఆదివాసీల సమస్యల పరిష్కారాలకు ఏర్పాటైన రాయ్ సెంటర్లను ఏర్పాటు చేశాడు.

నిర్వహించిన భాద్యతలు[మార్చు]

కరీంనగర్ ‌లో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్‌గా, హైదరాబాద్ ‌లో గిరిజన సంస్కృతీ పరిశోధన శిక్షణా సంస్థలో ఇన్‌చార్జి డెరైక్టర్‌గా, మహబూబ్‌నగర్‌ లో డీఆర్‌డీవోగా సేవలందించిన తుకారం అనంతరం ఐఏఎస్‌గా పదోన్నతి పొందాడు. మొదటిసారి నిజామాబాద్ జిల్లా కలెక్టరుగా, తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌గా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంస్థ కమిషనర్‌గా, ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1998 నవంబర్ 29న ఆయన అస్వస్థతతో తనువు చాలించాడు. ప్రతియేటా తుకారం వర్ధంతి రోజున ఆదివాసులు ఆనవాయితీగా నివాళులర్పిస్తారు.[3]

మూలాలు[మార్చు]

  1. Correspondent, Special (2017-11-29). "Adivasis pay homage to Madavi Tukaram". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-10.
  2. "ఆదివాసీల ఆశాకిరణం తుకారాం ఐఏఎస్". Sakshi. 2014-11-29. Retrieved 2023-09-10.
  3. సాక్షి (2024-04-21), ఐఏఎస్ కు ఆమడ దూరం..!, retrieved 2024-04-21