అక్షాంశ రేఖాంశాలు: 12°54′21″N 77°36′53″E / 12.90583°N 77.61472°E / 12.90583; 77.61472

మడివాలా సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మడివాలా సరస్సు
Map showing the location of మడివాలా సరస్సు
Map showing the location of మడివాలా సరస్సు
మడివాలా సరస్సు
Locationమడివాలా,బెంగళూరు, కర్ణాటక
Nearest cityబెంగళూరు
Coordinates12°54′21″N 77°36′53″E / 12.90583°N 77.61472°E / 12.90583; 77.61472

మడివాలా సరస్సు కర్ణాటకలోని బెంగుళూరులో ఉన్న అతిపెద్ద సరస్సులలో ఒకటి. ఇది 114.3 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ సరస్సును చోళులు ఒక్క రోజులో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. 1990 సంవత్సరం వరకు సరస్సులోని నీటిని త్రాగడానికి ఉపయోగించే వారు. కానీ ఆతర్వాత నుండి పారిశ్రామిక వ్యర్థాలు, మురికినీరు సరస్సులోకి ప్రవేశించడం వల్ల ఇది క్రమంగా కలుషితమైంది.[2]

పరిరక్షణ

[మార్చు]

ఇది అనేక వలస పక్షులకు నిలయం. ఈ సరస్సు కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ పరిపాలన క్రింద పరిరక్షించబడుతుంది. సరస్సు సాధారణ, ప్రాథమిక నిర్వహణ బాధ్యతలు ఈ శాఖ నిర్వహిస్తుంది. పిల్లల పార్కు కూడా ఉంది. ఈ సరస్సు బెంగుళూరు లేక్ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి 2016 లో రూ. 25 కోట్ల గ్రాంట్‌ను పొందింది.[3]

పక్షులు

[మార్చు]

మడివాలా సరస్సు దగ్గరకు శీతాకాలంలో (నవంబర్-డిసెంబర్) భారీ సంఖ్యలో స్పాట్-బిల్ పెలికాన్ అనే పక్షులు వలస వస్తాయి. ఈ స్పాట్-బిల్ పెలికాన్స్ సమూహాలుగా నివసిస్తాయి. వాటి ప్రధాన ఆహారం చేపలు. చేపలను వేటాడడానికి పెలికాన్స్ సరస్సు మీదుగా ప్రయాణం చేస్తాయి. ఈ వలస పక్షులను శ్రీలంకలో కూడా చూడవచ్చు. ఈ పక్షులు భూమి పై వాలుతున్నపుడు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. సాధారణంగా వాటి రెక్కలు దాదాపు 8.5 అడుగుల పొడవు వరకు ఉంటాయి. ఈ పక్షులతో పాటు ఎగ్రెట్స్ పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు.[4]

మూలాలు

[మార్చు]
  1. Bharadwaj, Arun (20 June 2016). Seen & Unseen Bangalore. Notion Press. ISBN 9789386073181 – via Google Books.ISBN 9789386073181
  2. "Artificial 'floating islands' clean Madiwala Lake". Deccan Herald. 23 March 2019.
  3. "Thousands of snails pile up on Madiwala Lake banks in southeast Bengaluru - Times of India". The Times of India. Retrieved 2018-11-18.
  4. "Islands of 'hope' at Madiwala Lake". Bangalore Mirror.