మణికర్ణికా ఘాట్
మణికర్ణిక ఘాట్ వారణాసి నగరంలో గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర నదీ స్నానఘట్టాలలో (ఘాట్‌లు), అత్యంత పవిత్రమైన [1] శ్మశాన వాటికలలో ఒకటి. హిందూమతంలో, మరణం అనేది మానవుడు చేసిన కర్మ ఫలితాన్ని బట్టి, మరొక జన్మకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. మానవుని ఆత్మ మోక్షాన్ని పొందుతుందని, అందువల్ల ఇక్కడ దహనం చేసినప్పుడు పునర్జన్మ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందని నమ్ముతారు.[2]
అక్కడ పడిన సతీదేవి చెవిపోగుల కారణంగా ఈ ఘాట్‌కు ఆ పేరు వచ్చింది.[3] వారణాసిలోని హిందూ వంశావళి రిజిస్టర్లు అక్కడ ఉంచబడ్డాయి.
స్థానం
[మార్చు]మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, సింధియా ఘాట్‌ల మధ్య ఉంది.
పౌరాణిక మూలం
[మార్చు]మణికర్ణికా ఘాట్ వారణాసిలోని పురాతన ఘాట్‌లలో ఒకటి. 5వ శతాబ్దానికి చెందిన గుప్త శాసనంలో దీని ప్రసక్తి ఉంది.[4] బ్రహ్మ కుమారులలో ఒకడైన దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలో శివుడిని అవమానించడానికి ప్రయత్నించినపుడు సతీదేవి (ఆది శక్తి) తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. శివుడు మండుతున్న ఆమె శరీరాన్ని హిమాలయాలకు తీసుకెళ్లాడు. శివుని అంతులేని దుఃఖాన్ని చూసిన విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని 51 భాగాలుగా చేసాడు. అవి భూమిపై పడిపోయి, శక్తిపీఠాలయ్యాయి. వీటిని "ఏక్యవాన్ శక్తిపీఠం" అంటారు. సతీదేవి శరీర భాగం పడిన చోటల్లా శివుడు శక్తి పీఠాన్ని స్థాపించాడు. మణికర్ణికా ఘాట్ వద్ద మాతా సతీదేవి చెవి ఆభరణం పడింది.
శక్తి పీఠంగా మణికర్ణికా క్షేత్రం
[మార్చు]మణికర్ణిక పుణ్యక్షేత్రం హిందూమతంలోని శక్తిమత శాఖకు ముఖ్యమైన ప్రార్థనా స్థలం. ఇది కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉంది. శక్తి పీఠాల ఆవిర్భావం వెనుక దక్ష యజ్ఞం, సతీదేవి స్వీయ దహన పురాణం ఉన్నాయి. స్థల వ్యుత్పత్తి ఈ పురాణాల కారణంగా ఏర్పడింది. సతీదేవి చెవి పోగులు ఇక్కడ పడిపోయాయని నమ్ముతారు. సంస్కృతంలో మణికర్ణ అంటే చెవి పోగులు.[5]
సతీదేవి శరీర భాగాలు పడిపోవడం వల్ల శక్తి సన్నిధితో ప్రతిష్టించబడిందని విశ్వసించే క్షేత్రాలే శక్తి పీఠాలు. సంస్కృతంలోని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 51 శక్తి పీఠాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో శక్తి మందిరాలు ఉంటాయి. మణికర్ణిక లోని శక్తిని విశాలాక్షి అని మణికర్ణి అనీ అంటారు.
మణికర్ణికా కుండం
[మార్చు]ఘాట్ వద్ద ఉన్న బావిని మణికర్ణికా కుండం అని పిలుస్తారు. దీనిని విష్ణువు నిర్మించాడు.[6]
ప్రతిపాదన
[మార్చు]మణికర్ణిక ఘాట్‌ను పునరుద్ధరించే ప్రతిపాదనను యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లోని అర్బానా, ఛాంపెయిన్ (UIUC), పూణె లోని భానుభేన్ నానావతి కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫర్ ఉమెన్ (BNCA) లోని ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ విభాగాలు ప్రతిపాదించాయి.[7] వారణాసికి చెందిన ఈస్టర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా మణికర్ణిక ఘాట్‌ను పునరుద్ధరించి, తిరిగి అభివృద్ధి చేసే ప్రతిపాదన పురోగతిలో ఉంది. [8]
ఇవి కూడా చూడండి
[మార్చు]కళలో మణికర్ణిక ఘాట్
[మార్చు]-
ఎడ్విన్ లార్డ్ వీక్స్(1849 - 1903), ది లాస్ట్ వాయెజ్, 1884
-
ఎడ్వర్డ్ లియర్(1812–1888) సిటీస్కేప్, 1873
-
ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్; ఎ సర్వే ఆఫ్ ఎ మ్యాన్స్ రికార్డ్" (1902) లోని చిత్రం
-
1825 నవంబరు 25 చంద్రగ్రహణం నాడు, లిటోగ్రాఫ్ బై జేమ్స్ ప్రిన్సెప్
-
చిత్రమైన భారతదేశం. యూరోపియన్ యాత్రికుల కోసం ఒక హ్యాండ్‌బుక్, J. పెద్దర్ (1850-1929), 1890
మూలాలు
[మార్చు]- ↑ Varanasi Guru (15 September 2020). "Manikarnika Ghat". www.varanasiguru.com/manikarnika-ghat.
- ↑ "In queue even after death, wait for 'moksha' gets longer at Kashi ghats". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-06-18. Retrieved 2020-06-11.
- ↑ "Manikarnika Ghat Varanasi". Varanasi Guru (in ఇంగ్లీష్). Retrieved 2020-09-05.
- ↑ "The Varanasi Heritage Dossier/Manikarnika Ghat - Wikiversity". en.wikiversity.org.
- ↑ "Kottiyoor Devaswam Temple Administration Portal". kottiyoordevaswom.com. Kottiyoor Devaswam. Retrieved 20 July 2013.
- ↑ "Manikarnika Ghat". Retrieved 20 December 2010.
- ↑ "Ghats of Varanasi on the Ganga in India The Cultural Landscape Reclaimed, Department of Landscape Architecture University of Illinois at Urbana Champaign, USA, 2014" (PDF).
- ↑ PLANNER INDIA (29 May 2017). "REDEVELOPMENT OF MANIKARNIKA GHAT: PROPOSAL WALKTHROUGH - BY PLANNER INDIA PVT LTD, VARANASI" – via YouTube.