మదన్ లాల్ ధింగ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదన్ లాల్ ధింగ్రా
జననం(1883-09-18)1883 సెప్టెంబరు 18
మరణం1909 ఆగస్టు 17(1909-08-17) (వయసు 25)
ఇండియా హౌస్
ఉద్యమంభారత స్వాతంత్ర ఉద్యమం

మదన్ లాల్ ధింగ్రా (18 సెప్టెంబర్ 1883-17 ఆగస్టు 1909) ఒక భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు. ఇతను ఇంగ్లాండ్‌లో చదువుతున్నప్పుడు బ్రిటిష్ సీక్రెట్ పోలీసు అధికారి అయిన విలియం హట్ కర్జన్ వైల్లీని హత్య చేశాడు. దీనికి గాను ఇతనికి మరణశిక్ష విధించారు. తనకు మరణశిక్ష విధించిన కోర్టును కోర్టు గా భావించడంలేదని, తనకు శిక్షవేసే అధికారం కోర్టుకులేదని దేశం కోసం ప్రాణాలర్పించడానికి గర్వపడుతున్నానని తన దేశభక్తిని చాటి చెప్పాడు.[1][2]

జననం, బాల్యం[మార్చు]

మదన్ లాల్ ధింగ్రా 18 సెప్టెంబర్ 1883 న భారతదేశంలోని అమృత్‌సర్‌లో విద్యావంతులైన, సంపన్నమైన పంజాబీ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి డా. దిట్ట మల్ ధింగ్రా ఇతను ఒక సివిల్ సర్జన్. దిట్టమల్ ధింగ్రాకు గల ఏడుగురు సంతానంలో మదన్ లాల్ ఒకరు (ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె). ధింగ్రా సహా మొత్తం ఆరుగురు కుమారులు విదేశాలలో చదువుకున్నారు.[3]

సావర్కర్ తో పరిచయం,స్వతంత్ర ఉద్యమం[మార్చు]

1905 లో శ్యామాజీ కృష్ణవర్మ ఇండియా హౌస్ స్థాపించిన ఒక సంవత్సరం తర్వాత ధింగ్రా లండన్ వచ్చాడు. ఈ సంస్థ భారతీయ జాతీయతా వాదుల సమావేశ స్థలం. ధింగ్రా భారతదేశ స్వాతంత్ర్యం కోసం వినాయక్ దామోదర్ సావర్కర్, శ్యామ్‌జీ కృష్ణ వర్మలతో పరిచయం ఏర్పరచుకున్నాడు. వారు అతని పట్టుదల, తీవ్రమైన దేశభక్తిని చూసి స్వాతంత్ర్య ఉద్యమం వైపు ప్రోత్సహించారు. తరువాత సావర్కర్, అతని సోదరుడు గణేష్ స్థాపించిన అభినవ్ భారత్ మండల్‌లో ఒక రహస్య సమాజంలో ధింగ్రా సభ్యత్వం పొందాడు.[3]

ఇదే సమయంలో వచ్చిన బెంగాల్ విభజన చట్టాన్ని సావర్కర్, ధింగ్రా, ఇతర విద్యార్థి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించి ఆగ్రహించారు.[4]

ధింగ్రా చివరి మాటలు, మరణం[మార్చు]

మదన్ లాల్ ధింగ్రాకు ఉరి శిక్ష విధించినపుడు చనిపోయే ముందు అతడు మాట్లాడిన చివరి మాటలు:

విదేశీమూకల ద్వారా పట్టుబడిన నాదేశం శాశ్వతమైన యుద్ధ స్థితిలో ఉందని నేను నమ్ముతున్నాను. నిరాయుధమైన జాతికి బహిరంగ యుద్ధం అసాధ్యం కనుక, నేను ధైర్యంతో దాడి చేసాను. తుపాకులు నాకు నిరాకరించబడినందున నేను నా తుపాకీని తీసి కాల్చాను. తెలివి తక్కువ గల నా లాంటి కొడుకు తన తల్లికి తన రక్తాన్ని తప్ప మరేమీ ఇవ్వలేడు. కాబట్టి నేను ఆమె బలిపీఠం మీద త్యాగం చేసాను. ప్రస్తుతం భారతదేశంలో అవసరమైన ఏకైక పాఠం ఎలా చనిపోవాలో నేర్చుకోవడం, దానిని నేర్పించడానికి ఏకైక మార్గం మనమే చనిపోవడం. భగవంతుడికి నా ఏకైక ప్రార్థన ఏమిటంటే, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నా మాతృభూమి భారతదేశంలోనే పుట్టాలి కారణం ఏమిటంటే మనం అనుకున్న స్వాతంత్ర్యం విజయవంతం అయ్యే వరకు నేను అదే పవిత్రమైన కారణంతో తిరిగి జన్మించాలి ఒకవేళ మరుజన్మలో కూడా ఇవే పరిస్థితులు ఉంటే మళ్ళీ తిరిగి చనిపోవచ్చు. వందేమాతరం! ("నేను నిన్ను ప్రశంసిస్తున్నాను తల్లీ!")[5]

అంత్యక్రియలు, గుర్తింపు[మార్చు]

మదన్ లాల్ ధింగ్రా గౌరవార్థం 1992లో విడుదల చేసిన భారతదేశపు పోస్టల్ స్టాంపు

అతని మరణశిక్ష తర్వాత, ధింగ్రా అంత్యక్రియలకు హిందూ ఆచారాలు నిరాకరించబడ్డాయి. బ్రిటిష్ అధికారులు మృతదేహాన్ని ధింగ్రా కుటుంబీకులకు గానీ, సావర్కర్‌కు గానీ అప్పగించడాన్ని నిరాకరించారు. కొన్ని రోజులకు షహీద్ ఉధమ్ సింగ్ అవశేషాల కోసం వెతుకుతుండగా అనుకోకుండా ధింగ్రా శవపేటిక బయటపడింది. 12 డిసెంబర్ 1976భారతదేశానికి తిరిగి వచ్చింది.[5] అతని అవశేషాలు మహారాష్ట్రలోని అకోలా నగరంలో అతని పేరు పెట్టబడిన ఒక ప్రధాన కూడలిలో ఉంచబడ్డాయి.[4] ధింగ్రా పేరు ఈ రోజు భారతదేశంలో విస్తృతంగా వినబడుతుంది. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి జాతీయతావాదులకు దింగ్రా ఆ సమయంలో ఎంతో స్ఫూర్తిగా నిలిచాడు.[6]మదన్ లాల్ ధింగ్రా మరణానంతరం నాటి ప్రభుత్వం అతని జ్ఞాపకార్థంతో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

సినిమాలో[మార్చు]

వీర్ సావర్కర్ అనే హిందీ సినిమాలో, నటుడు పంకజ్ బారీ మదన్ లాల్ ధింగ్రా పాత్ర పోషించాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Chandra, Bipan (1989). India's Struggle for Independence. New Delhi: Penguin Books India. pp. 144–145. ISBN 978-0-14-010781-4.
  2. Nehru, Jawaharlal; Nand Lal Gupta (2006). Jawaharlal Nehru on Communalism. Hope India Publications. p. 161. ISBN 978-81-7871-117-1.
  3. 3.0 3.1 "Madan Lal Dhingra". The Open University. Retrieved 19 March 2016.
  4. 4.0 4.1 "Family continues to boycott Madan Lal Dhingra, even as country celebrates his martyrdom". The Indian Express [P] Ltd. 18 August 2015. Retrieved 19 March 2016.
  5. 5.0 5.1 Godbole, Dr Shreerang. "Madan Lal Dhingra: A lion hearted National hero". Hindu Janajagruti Samiti. Retrieved 19 March 2016.
  6. Bagga, Neeraj (18 February 2012). "Youth bodies demand national memorial status for house of martyr Madan Lal Dhingra". The Tribun. Retrieved 1 March 2012.
  7. Chaware, Dilip (2001-10-23). "After delays, Veer Savarkar to premier on Nov 16". The Times of India. Mumbai. Archived from the original on 2012-10-23. Retrieved 29 May 2012.