మద్దిరాల (చిలకలూరిపేట)
స్వరూపం
| మద్దిరాల | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
|---|---|
| జిల్లా | పల్నాడు |
| మండలం | చిలకలూరిపేట |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 522616 |
| ఎస్.టి.డి.కోడ్ 08647. | |
మద్దిరాల,పల్నాడు జిల్లా,చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జవహర్ నవోదయ విద్యాలయం ఈ గ్రామంలో ఉంది. 2016, జనవరి 4 నుండి 7 వరకు పుదుచ్చేరి రాష్ట్రంలో నిర్వహించిన 22వ అంతర్జాతీయస్థాయి యోగా పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఐదువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆ పోటీలలో ఈ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 10 నుండి 15 సంవత్సరాల విభాగంలో ఈ పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న చీల్ల వెంకట అజయ్ కుమార్, ద్వితీయ స్థానం సాధించాడు. ఇంకొక విభాగంలో పాల్గొన్న ఈ పాఠశాలలో 11వ తరగతి చదువుచున్న సి.హెచ్.డి.సతీష్, 10వ తరగతి చదువుచున్న జి.ఎస్.సాయినాథ్, ఎం.పవన్ కళ్యాణ్, తమ ప్రతిభ ప్రదర్శించి ప్రశంసా పత్రాలు పొందారు.అంతర్జాతీయ యోగా క్రీడాకారిణి తూమాటి స్రవంతి వీరికి యోగాలో శిక్షణ ఇచ్చారు.
గ్రామంలో ప్రధానమైన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు