మధుబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధుబాబు
Madhubabu.png
జననం
వల్లూరు మధుసూదన రావు

(1948-07-06) 1948 జూలై 6 (వయసు 74)[ఆధారం చూపాలి]
ఇతర పేర్లుమధుబాబు
వృత్తిఉపాధ్యాయుడు
రచయిత
జీవిత భాగస్వామిఆదిలక్ష్మి
పిల్లలుఉదయ్
తల్లిదండ్రులు
  • సూర్యనారాయణ రావు (తండ్రి)
  • భారతి (తల్లి)

మధుబాబుగా ప్రసిద్ధుడైన వల్లూరు మధుసూదన రావు ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఎక్కువగా పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవలలు ప్రచురించాడు. వీరి చాలా నవలలో షాడో కథానాయకుడిగా కనిపిస్తాడు. కొన్ని నవలలలో వాత్సవ్‌ని కూడా కథానాయకుడిగా చేసి రాస్తూ ఉంటారు. ఈయన రచనా శైలిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ విషయాన్ని రచయతగా చెప్పారు. దానిని కథ లోని పాత్రలు మాట్లాడుకునేటట్లు చేస్తారు. ఈయన వ్రాసిన జానపద నవలలు కూడా ఇంతే స్థాయిలో చదువరులను ఆకట్టుకున్నాయి.

విజయవాడకు దగ్గరున్న హనుమాన్ జంక్షన్కు చెందిన ఈయన 100కి పైగా నవలలను ప్రచురించాడు. ఈయన నవలలు ప్రాచుర్యము పొందడానికి పాత్రలలోని మానవీయత, హాస్యమేనని పాఠకులు భావిస్తారు. ప్రారంభదశలో మధుబాబు నవలలు మద్రాసులోని ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్ ప్రచురించింది. ఆ తరువాత ఈయన మధుబాబు పబ్లికేషన్స్ పేరుతో సొంత ప్రచురణాలయము ప్రారంభించారు. మధుబాబు నవలలు స్వాతి వార పత్రికలో చాలా సంవత్సరాలు వారం వారం ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి వారి నవ్య వీక్లీలో మధుబాబు నవలలు ధారావాహికలుగా ప్రచురించబడుతున్నాయి.

మధుబాబు చాలా కాలం వరకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈమధ్యనే పదవీ విరమణ చేసారు. మెర్కురి ఎంటర్‌టైన్‌మెంట్ అనే చలన చిత్ర నిర్మాణ సంస్థకి ఒక కథను సమకూర్చారు. ఈయన పేరుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా మధుబాబును అనుకరిస్తూ మధురబాబు, శ్రీ మధుబాబు వంటి రచయితలు వెలశారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

మధుబాబు జులై 6, 1948 న కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు గ్రామంలో జన్మించాడు. సూర్యనారాయణ రావు, భారతి ఈయన తల్లిదండ్రులు. తండ్రి కరణంగా పనిచేసేవాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. మధుబాబుకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. ఏడో తరగతి వరకు తోట్లవల్లూరు లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. చదువు అనుకున్నట్టుగా సాగకపోవడంతో తండ్రి ఈయనను ఎ. కొండూరు మండలం, కంభంపాడు గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబాయి దగ్గరకు పంపించాడు. అక్కడ చదువుతున్నప్పుడే నాటకాలమీద, సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడ్డాయి. ఎస్. ఎస్. ఎల్. సి కోసం మళ్ళీ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తండ్రి స్వతహాగా సాహిత్యాభిమాని. ఆయన ఎక్కువగా శరత్ సాహిత్యం చదివేవాడు. వీరి ఇంట్లో సుమారు 2000 దాకా పుస్తకాలు ఉండేవి. మధుబాబు వీటిలో చాలా పుస్తకాలు చదివాడు. మచిలీపట్నంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాడు. కానీ ఆ వృత్తిలో ఎదుగుదల ఉండదని మొదట్లో అందులో చేరలేదు.[1]

వృత్తి[మార్చు]

హైదరాబాదులో దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభ లో అకౌంటెంట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి కళాశాలలో చదువుతూ పి. యు. సి, తర్వాత బి. కాం పూర్తి చేశాడు. తన పని చేసే చోటనే ఉన్న గ్రంథాలయంలో చాలా పుస్తకాలు చదివాడు. కొద్దికాలం హైదరబాదు రిజర్వు బ్యాంకులో కాయిన్, నోట్ ఎక్జామినర్ కూడా పనిచేశాడు. అదే సమయంలో నాటకాల మీద ఆసక్తితో చాలా నాటకాల్లో పాల్గొన్నాడు.

జీవితంలో ఏదో సాధించాలనే తపనతో అనేక ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టాడు. 1972 నాటికి మద్రాసు చేరుకున్నాడు. అక్కడే రచనలు మొదలు పెట్టాడు. తన మొదటి రచన ప్రారంభించక మునుపే ఎం. వి. ఎస్. పబ్లిషర్స్ అనే సంస్థకు వెళ్ళి తన దగ్గర ఒక నవల ఉన్నదనీ ప్రచురిస్తారా అని అడిగాడు. విషయం బాగుంటే ప్రచురిస్తామన్నారు వాళ్ళు. దాని తర్వాత ఆయన కేవలం మూడు రోజుల్లో వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్ అనే నవలను రాసి వారికి ఇచ్చాడు. ఇది 15 సార్లు పునర్ముద్రితమైంది. ఆయన అందుకున్న తొలి పారితోషికం 50 రూపాయలు. ఈయన రచయిత కావడం వెనుక స్నేహితుడు బొర్రా సుబ్బారావు ప్రోత్సాహం ఉంది. ఈయన మధుబాబును మరిన్ని రచనలు చేసేలా ప్రోత్సహించాడు.

నవలలు రాస్తూ దాదాపు ఏడు సంవత్సరాల పాటు మద్రాసులో గడిపి రచయితగా మంచి గుర్తింపు సాధించాడు. తర్వాత 1979 లో స్వస్థలానికి తిరిగి వచ్చి తనకున్న విద్యార్హతలతోనే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఉద్యోగంలో కొనసాగుతూనే ఖాళీ సమయాల్లో తన రచనా ప్రస్థానం కొనసాగించాడు.

పుస్తక పఠనం అనే అలవాటు మరుగున పడిపోయిన నేటి అంతర్జాల యుగంలో కొత్త తరానికి తన రచనలను దగ్గర చేద్దామనే ఉద్దేశ్యంతో ఇటీవలే 'షాడో మధుబాబు (అఫిషియల్) ఆడియోబుక్స్' అనే యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించారు.

రచనలు[మార్చు]

పరిశోధనాత్మక నవలలు[మార్చు]

  1. ఎ బుల్లెట్ ఫర్ షాడో
  2. ఎ డెవిల్ ఎ స్పై (మూడు భాగాలు)
  3. ఏంజెల్ అఫ్ డెత్ (రెండు భాగాలు)
  4. అస్సాల్ట్ ఆన్ షాడో (రెండు భాగాలు)
  5. అస్సైన్‌మెంట్ లవ్ బర్డ్
  6. అస్సైన్‌మెంట్ కరాచి (రెండు భాగాలు)
  7. ఎ జర్నీ టు హెల్
  8. ఎ మినిట్ ఇన్ హెల్
  9. బాబా
  10. బద్మాష్
  11. బంజాయ్
  12. భోలా శంకర్ (రెండు భాగాలు)
  13. బ్లడీ బోర్డర్
  14. బ్లడ్ హౌండ్
  15. బాంబింగ్ స్క్వాడ్
  16. ది బ్రెయిన్ వాషర్స్
  17. బ్రోకెన్ రివోల్వర్
  18. బఫ్ఫెలో హంటర్స్
  19. బర్మా డాల్
  20. కార్నివాల్ ఫర్ కిల్లర్స్
  21. చైనీస్ బ్యూటీ
  22. చైనీస్ మాస్క్
  23. చైనీస్ పజిల్
  24. చిచ్చర పిడుగు
  25. కమాండర్ షాడో
  26. కౌంటర్ ఫీట్ కిల్లర్స్
  27. సి.ఐ.డి షాడో
  28. డాగర్ అఫ్ షాడో
  29. డేంజరస్ డయబోలిక్ (రెండు భాగాలు)
  30. డేంజరస్ గేమ్ (రెండు భాగాలు)
  31. డెడ్లీ స్పై
  32. డియర్ షాడో
  33. డెత్ ఇన్ ది జంగిల్ (రెండు భాగాలు)
  34. డెవిల్స్ ఇన్ నికోబార్
  35. డర్ట్టి డెవిల్
  36. డాక్టర్ షాడో
  37. డాక్టర్ జీరో
  38. డ్యుయల్ అట్ డబుల్ రన్
  39. డైనమైట్ డోర
  40. ఫైటింగ్ ఫోర్
  41. ఫిస్ట్ అఫ్ షాడో
  42. ఫ్లయింగ్ బాంబ్
  43. ఫ్లయింగ్ హార్స్
  44. ఫ్లయింగ్ ఫాల్కన్
  45. గోల్డెన్ రోబ్
  46. గ్రేనేడ్ గ్రూప్
  47. గన్ ఫైట్ ఇన్ గ్రీన్లాండ్
  48. గన్స్ ఇన్ ది నైట్
  49. హర్రర్స్ అఫ్ డార్క్‌నెస్
  50. ఇన్స్‌పెక్టర్ షాడో
  51. జాగ్వార్ జస్వంత్
  52. జూనియర్ ఏజెంట్ శ్రీకర్
  53. కాలకన్య
  54. కాలనాగు
  55. కాళికాలయం (మూడు భాగాలు)
  56. కళ్యాణ తిలకం
  57. కంకాళ లోయ
  58. కేండో వారియర్
  59. కిల్ క్విక్ ఆర్ డై
  60. కిల్ థెం మిస్టర్ షాడో
  61. కిల్లర్స్ గ్యాంగ్
  62. కిస్ కిస్ కిల్ కిల్
  63. లైసెన్స్ టు కిల్
  64. మధు మాలిని
  65. మేరా నామ్ రజూలా
  66. మిడ్ నైట్ అడ్వంచర్ (రెండు భాగాలు)
  67. మిడ్ నైట్ ప్లస్ వన్ (రెండు భాగాలు)
  68. మిషిన్ టు పెకింగ్
  69. మర్డరింగ్ డెవిల్స్
  70. నెవర్ లవ్ ఎ స్పై
  71. నైట్ వాకర్
  72. నెంబర్ 28
  73. ఒన్స్ అగైన్ షాడో
  74. ఆపరేషన్ ఆరిజోనా
  75. ఆపరేషన్ బెంగాల్ టైగర్
  76. ఆపరేషన్ కౌంటర్ స్పై
  77. ఆపరేషన్ డబుల్ క్రాస్
  78. ఆపరేషన్ కాబుల్
  79. ప్లీజ్ హెల్ప్ మీ
  80. ప్రొఫెసర్ షాడో
  81. రెడ్ షాడో
  82. రివెంజ్ రివెంజ్
  83. రన్ షాడో రన్
  84. రన్ ఫర్ ది బోర్డర్
  85. రన్ ఫర్ ది హైల్యాన్డ్స్
  86. సైంటిస్ట్ షాడో
  87. సైంటిస్ట్ మిస్ మాధురి
  88. సీక్రెట్ ఏజెంట్ మిస్టర్ షాడో
  89. సెవెంత్ కిల్లర్
  90. షాడో ఇన్ బాగ్దాద్
  91. షాడో ఇన్ బార్నియో
  92. షాడో ఇన్ హైదరాబాద్
  93. షాడో ఇన్ ది జంగిల్
  94. షాడో ఇన్ కోచ్చిన్
  95. షాడో ఇన్ జపాన్
  96. షాడో ఇన్ సిక్కిం
  97. షాడో ఇన్ థాయ్‌లాండ్
  98. షాడో ది అవెంజర్
  99. షాడో !
  100. షాడో ! షాడో !!
  101. షాడో ! షాడో !! షాడో !!!
  102. షాడో ది స్పై కింగ్
  103. షాడో వొస్తున్నాడు జాగ్రత్త
  104. సిల్వర్ కింగ్
  105. స్పైడర్ వెబ్
  106. టేస్ట్ ఫర్ డెత్
  107. టెంపుల్ అఫ్ డెత్
  108. టెన్ అగైనెస్ట్ షాడో (రెండు భాగాలు)
  109. టెర్రా 205 (రెండు భాగాలు)
  110. టెర్రర్ ఐలాండ్
  111. ది కర్స్ అఫ్ కుంగ్ ఫు
  112. ది గర్ల్ ఫ్రం సి.ఐ.బి.
  113. ది కిల్లర్ ఫ్రం సి.ఐ.బి.
  114. టైగర్ మున్నా
  115. టైం ఫర్ లవ్
  116. టు షాడో విత్ లవ్
  117. ట్రబుల్ మేకర్స్
  118. 2 మైల్స్ టు ది బోర్డర్
  119. విప్లవం వర్ధిల్లాలి
  120. వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవ్
  121. హు ఆర్ యు
  122. యముడు

నవలలు[మార్చు]

  1. ఆనంద జ్యోతి
  2. ఆర్తి
  3. అతను
  4. భవాని
  5. బొమ్మ
  6. క్రైం కార్నర్
  7. చక్ర తీర్థం
  8. డెత్ వారంట్
  9. ఫైనల్ వార్నింగ్
  10. ఘర్షణ
  11. హెచ్చరిక
  12. జ్వాలాముఖి
  13. కంకన రహస్యం
  14. నందిని
  15. పాము
  16. పులి మడుగు
  17. రహస్యం
  18. రుద్రాణి
  19. రెడ్ అలెర్ట్
  20. రెడ్ సిల్వర్
  21. రుద్ర భూమి
  22. సాలభంజిక
  23. సాధన
  24. శిక్ష (రెండు భాగాలు)
  25. స్పందన
  26. శంకర్ దాదా (రెండు భాగాలు)
  27. శ్రావని
  28. స్వర్ణ ఖడ్గం (రెండు భాగాలు)
  29. టైగర్ వాత్సవ
  30. టైం బాంబు
  31. టాప్ సిక్రేట్
  32. టాప్ టెన్
  33. టచ్ మీ నాట్
  34. వెన్నెల మడుగు
  35. వర్జిన్ ఐస్లాండ్
  36. విశ్వ ప్రయత్నం

టీవీ ధారావాహికలు[మార్చు]

  1. చక్ర తీర్థం (ఈ టీవీ)
  2. కాళికాలయం ( జెమిని టీవీ)
  3. శంకర్ దాదా
  4. శిక్ష

మూలాలు[మార్చు]

  1. టి. డి., ప్రసాద్ (2008). ఈనాడు ఆదివారం. విజయవాడ: ఈనాడు. pp. 20, 21.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మధుబాబు&oldid=3727366" నుండి వెలికితీశారు