మనోరమ (హిందీ నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోరమ
సుహాగీ చలనచిత్రంలో మనోరమ
జననం
ఎరిన్ ఐజాక్ డేనియల్స్

(1926-08-16)1926 ఆగస్టు 16
లాహోర్, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
మరణం2008 ఫిబ్రవరి 15(2008-02-15) (వయసు 81)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1936–2005
జీవిత భాగస్వామిరాజన్ హక్సర్ (విడాకులు తీసుకున్నారు)
పిల్లలురీటా హక్సర్

మనోరమ (1926 ఆగష్టు 16 - 2008 ఫిబ్రవరి 15) భారతీయ క్యారెక్టర్ ఆర్టిస్ట్. బాలీవుడ్‌లో గడసరి అత్త పాత్రలకు ఆమె ప్రసిద్ధి చెందింది. దో కలియాన్ (1968), ఏక్ ఫూల్ దో మాలి (1969), సీతా ఔర్ గీతా (1972) చిత్రాలలో ఆమె పాత్రలతో మెప్పించింది.

ఆమె 1936లో లాహోర్‌లో బేబీ ఐరిస్ పేరుతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించింది. తన 60 సంవత్సరాల కెరీర్ లో ఆమె 160కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె 1940ల ప్రారంభంలో కథానాయిక పాత్రలు పోషించింది. ఆ తర్వాత, ఆమె ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించడంలో స్థిరపడింది. 2005లో వచ్చిన వాటర్‌ చిత్రంలో తన చివరి పాత్రను పోషించింది,[1]

తన కెరీర్‌లో కిషోర్ కుమార్, మధుబాలతో కలిసి హాఫ్ టికెట్ వంటి సూపర్‌హిట్ చిత్రాలలో ఆమె హాస్య పాత్రలు పోషించింది. ఆమె దస్ లఖ్, ఝనక్ ఝనక్ పాయల్ బాజే, ముజే జీనే దో, మెహబూబ్ కి మెన్హదీ, కారవాన్, బాంబే టు గోవా, లావారీస్‌.. చిత్రాలలో ఆమె నటన చిరస్మరణీయం.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
ఖజాంచి (1941) జాన్వర్ (1965) ఇంటర్నేషనల్ క్రూక్ (1974)
మేరా మహి (1941) పంజాబీ చిత్రం మద్రాసు నుండి పాండిచ్చేరి (1966) దుల్హన్ (1974)
ఖండాన్ (1942) నీంద్ హమారీ ఖ్వాబ్ తుమ్హారే (1966) సునేహ్రా సన్సార్ (1975)
లచ్చి (1949) పంజాబీ సినిమాలో ప్రధాన కథానాయిక జోహార్ ఇన్ కాశ్మీర్ (1966) లఫాంగే (1975)
పోస్టి (1950) పంజాబీ చిత్రం దస్ లఖ్ (1966) మహా చోర్ (1976)
హన్స్టే అన్సూ (1950) బుడ్తమీజ్ (1966) అదాలత్ (1976)
మాల్తీగా జుగ్ని (1952) పంజాబీ చిత్రం మేరా మున్నా (1967) గుమ్రా (1976)
పరిణీత (1953) బహరోన్ కే సప్నే (1967) గిద్ద (1976)
కుందన్ (1955) మేరే హుజూర్ (1968) ఆజ్ కా మహాత్మా (1976)
లజ్వంతి (1958) దో కలియాన్ (1968) హీరా ఔర్ పత్తర్ (1976)
ఖజాంచి (1958) ఏక్ ఫూల్ దో మాలి (1969) సాహెబ్ బహదూర్ (1977)
దుల్హన్ (1958) పవిత్ర పాపి (1970) లడ్కీ జవాన్ హో గయీ (1977)
సంతాన్ (1959) మస్తానా (1970) చరదాస్ (1977)
చాచా జిందాబాద్ (1959) నా ప్రేమ (1970) లావారిస్ (1981)
ఫ్యాషన్ వైఫ్ (1959) దేవి (1970) సహస్ (1981)
గోకుల్ కా చోర్ (1959) మెహబూబ్ కి మెహందీ (1971) కటిలోన్ కే కాటిల్ (1981)
పతంగ్ (1960) మన్ మందిర్ (1971) మెహర్బానీ (1981)
మియా బీబీ రాజీ (1960) లడ్కీ పసంద్ హై (1971) ధరమ్ కాంత (1981)
వాంటెడ్ (1961) హాంకాంగ్‌లో జోహార్ మెహమూద్ (1971) ధరమ్ కాంత మున్నీబాయి (1982)
రూప్ కీ రాణి చోరోన్ కా రాజా (1961) జూదగాడు (1971) తేరీ మాంగ్ సితారోన్ సే భర్ దూన్ (1982)
ప్యార్ కి ప్యాస్ (1961) దునియా క్యా జానే (1971) హాడ్సా (1983)
షాదీ (1962) కారవాన్ (1971) మెయిన్ ఆవారా హూన్ (1983)
రిపోర్టర్ రాజు (1962) బాంబే టు గోవా (1971) వాటర్ (2005)
మా బేటా (1962) గోమతి కే కినారే (1972)
హాఫ్ టికెట్ (1962) సీతా ఔర్ గీత (1972)
మమ్మీ డాడీ (1963) షోర్ (1972)
ముజే జీనే దో (1963) జీత్ (అన్‌క్రెడిటెడ్)(1972)
దిల్ హాయ్ తో హై (1963) బనారసి బాబు (1972)
నీలా ఆకాష్ (1965) జెహ్రీలా ఇన్సాన్ (1973)
నమస్తే జీ (1965) నయా దిన్ నై రాత్ (1974)

మూలాలు

[మార్చు]
  1. Subhash K. Jha. "Actress Manorama was bitter about Bollywood shunning her: Deepa Mehta". Bollywood.com. Archived from the original on 20 October 2017. Retrieved 17 May 2014.