మన్సూర్ అమ్జాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్సూర్ అమ్జాద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మన్సూర్ అమ్జాద్
పుట్టిన తేదీ (1986-12-25) 1986 డిసెంబరు 25 (వయసు 37)
సియాల్‌కోట్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 170)2008 జూన్ 29 - శ్రీలంక తో
ఏకైక T20I (క్యాప్ 23)2008 ఏప్రిల్ 20 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004–2005Zarai Taraqiati Bank Limited
2004–presentSialkot
2005–presentNational Bank of Pakistan
2006–2007లీసెస్టర్‌షైర్
2010–2013Sialkot Region Cricket Association
2014–2015స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు
2015–2018వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ క్రికెట్ టీమ్
2019–2020Galle Cricket Club
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 1 127 155
చేసిన పరుగులు 5 5,448 2,783
బ్యాటింగు సగటు 5.00 30.60 28.69
100లు/50లు 0/0 7/31 3/8
అత్యుత్తమ స్కోరు 5 157 119*
వేసిన బంతులు 48 6 12,670 6,970
వికెట్లు 1 3 235 175
బౌలింగు సగటు 44.00 1.00 32.79 33.01
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 7 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/44 3/3 6/19 5/37
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 50/– 50/–
మూలం: CricInfo, 2013 నవంబరు 28

మన్సూర్ అమ్జాద్ (జననం 1987, డిసెంబరు 14) పాకిస్తానీ క్రికెటర్.[1] పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు,ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. అమ్జాద్ తన చిన్నతనంలో వీధిలో టేప్-బాల్ క్రికెట్ ఆడాడు. ఇతని స్వగ్రామంలో బ్యాట్, బాల్ బాయ్‌గా పేరు పొందాడు. చిన్న వయస్సులోనే సాగా స్పోర్ట్స్ క్రికెట్ క్లబ్ కోసం క్రికెట్ ఆడాడు. 1998-99లో లాహోర్‌లోని హబీబ్ బ్యాంక్ మొబైల్ క్యాంప్‌కు ఆడాడు. అమ్జాద్ లెగ్ స్పిన్ బౌలర్‌గా ప్రారంభించాడు. కుడిచేతి బ్యాట్స్‌మన్‌గా చక్కటి ఆటతీరును కనబరచాడు. 2000లో అమ్జాద్ అండర్-15 క్యాంపుకు ఎంపికయ్యాడు.

తొలి జీవితం[మార్చు]

2001లో లాహోర్‌లోని పాకిస్థాన్ జూనియర్ క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. మరుసటి సంవత్సరం, మొదటి అంతర్జాతీయ పాకిస్తాన్ అండర్-15కి ఎంపికయ్యాడు.[2] అబుదాబిలో పాకిస్తాన్ వారి మొట్టమొదటి జూనియర్ అండర్-15 ఆసియా కప్‌ను గెలుచుకుంది.[3] అమ్జాద్ తన మొదటి అండర్-15 మ్యాచ్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులకు ఐదు వికెట్లు తీసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.[4] 2003 పాకిస్తాన్ అకాడమీ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు, నాలుగు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ఆ సంవత్సరం వీడియోకాన్ ఆసియన్ ఎమర్జింగ్ ట్రోఫీని పాకిస్తాన్ గెలుచుకుంది,[5] ఫైనల్‌లో శ్రీలంకను ఓడించిన జట్టులో అమ్జాద్ సభ్యుడిగా ఉన్నాడు.[6]

పాకిస్తాన్ 2004 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా, ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు తీసుకున్నాడు. ఐర్లాండ్‌పై 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసిన అమ్జాద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.[7] దాదాపు 13 సంవత్సరాలపాటు అత్యుత్తమ అండర్-19 రికార్డులను నెలకొల్పాడు.[8]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2005లో, ఆస్ట్రేలియా ఎ క్రికెట్ జట్టు పర్యటనలో రెండు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ఆ తరువాత గ్రీన్ టీమ్ తరపున పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైడ్ మ్యాచ్ ఆడాడు, రెండు వికెట్లు తీయడంతోపాటు 29 పరుగులు చేశాడు.[9] అమ్జద్ 2005లో ఇంగ్లాండ్‌తో పాకిస్తాన్ ఎ తరపున ఒక సైడ్ మ్యాచ్ ఆడాడు.[10]

2006లో జరిగిన యురేషియా క్రికెట్ సిరీస్‌లో పాకిస్తాన్ ఎ జట్టు తరపున భారత్‌పై నాలుగు వికెట్లు తీశాడు.[11] ఐదు మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో అమ్జాద్ బౌలర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు.[12] లీసెస్టర్‌షైర్ ఫాక్స్‌లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్‌ను గెలుచుకున్నాడు.[13]

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 42 పరుగులతో పాకిస్తాన్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.[14]

2008 ఏప్రిల్ లో కరాచీలో బంగ్లాదేశ్‌తో జరిగిన ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. పదహారవ ఓవర్ లో రెండవ, ఐదవ, ఆరవ బంతుల్లో వికెట్లు తీశాడు. మొత్తం 1-0-3-3తో మహ్మదుల్లా, మష్రఫే ముర్తాజాను అవుట్ చేశాడు.[15] 2008 జూన్ లో, ఆసియా కప్‌లో వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు; శ్రీలంకపై తనకు కేటాయించిన ఎనిమిది ఓవర్లలో 44 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.[16]

మూలాలు[మార్చు]

  1. "Mansoor Amjad | Pakistan Cricket Team | Official Cricket Profiles | PCB". www.pcb.com.pk. Retrieved 2023-09-05.
  2. "Team Pakistan Under-15s ODI Batting Bowling Stats | Live Cricket Scores | PCB". www.pcb.com.pk2023-09-05. Retrieved 2023-09-05.
  3. "Under-15 Asia Cup (UAE) 2002". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  4. "Super League Group A: Oman Under-15s vs Pakistan Under-15s at Abu Dhabi |Cricket Scorecard | Live Results | PCB". www.pcb.com.pk2023-09-05. Retrieved 2023-09-05.
  5. "Emerging Team Trophy - Cricket Schedules, Updates, Results | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  6. "Full Scorecard of SL Emerg vs PAK Emerg Final 2003/04 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  7. "Full Scorecard of Ireland U19 vs Pakistan U19 Group D 2003/04 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  8. "Records | Under-19s Youth One-Day Internationals | Bowling records | Best career bowling average | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-09-05.
  9. "Pakistan Cricket Board Greens v Pakistan Cricket Board Whites: Pakistan Cricket Board Greens vs Pakistan Cricket Board Whites at Lahore |Cricket Scorecard | Live Results | PCB". www.pcb.com.pk2023-09-05. Retrieved 2023-09-05.
  10. "Pakistan A v England XI: England XI vs Pakistan A at Lahore |Cricket Scorecard | Live Results | PCB". www.pcb.com.pk2023-09-05. Retrieved 2023-09-05.
  11. "Full Scorecard of Pakistan A vs India A Final 2006 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  12. "EurAsia Cricket Series, EurAsia Cricket Series 2006 score, Match schedules, fixtures, points table, results, news". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  13. "Leicestershire County Cricket Club". www.leicestershireccc.co.uk. Retrieved 2023-09-05.
  14. "Full Scorecard of Sth Africans vs PCB XI Tour Match 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  15. "Full Scorecard of Pakistan vs Bangladesh Only T20I 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  16. "Full Scorecard of Sri Lanka vs Pakistan 8th Match, Super Four 2008 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.

బాహ్య లింకులు[మార్చు]