మమ్మీ, మీ ఆయనొచ్చాడు
మమ్మీ, మీ ఆయనొచ్చాడు (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. అజయ్ కుమార్ |
---|---|
నిర్మాణం | బి.బనజ సి.కళ్యాణ్ |
కథ | యర్రంశెట్టి సాయి సత్యమూర్తి |
చిత్రానువాదం | కె. అజయ్ కుమార్ |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ |
సంగీతం | ఎం.ఎం.శ్రీలేఖ |
సంభాషణలు | మరుధూరి రాజా |
ఛాయాగ్రహణం | లోక్ సింగ్ |
కూర్పు | కె.రమేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ అమూల్యా ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మమ్మీ మీ ఆయనొచ్చాడు 1996 లో విడుదలైన తెలుగు కామెడీ చిత్రం. శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి. వనజ, సి. కళ్యాణ్ లు కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో నిర్మించారు.[1] ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజా, కీర్తన ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం అందించాడు.[2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పొందింది.[3]
కథ
[మార్చు]కోటీశ్వరుడు ఆనందరావు (కోట శ్రీనివాసరావు) కుమారుడు సతీష్ (రాజేంద్ర ప్రసాద్). యువకుడు ఉత్సాహవంతుడూను. ఆనందరావు తిరుగుబోతు. తన కుమారుడు కూడా తన మార్గాన్నే అనుసరించాలని కోరుకుంటాడు. కానీ ఒక అందమైన మంచి అమ్మాయిని వివాహం చేసుకుని జీవితం గడపాలనేది సతీష్ ఆశయం. మంచి సంబంధం చూసే పనిని పెళ్ళిళ్ళ పేరయ్య ఆచారి (ఎవిఎస్) కు అప్పగిస్తాడు. కాని కుటిలుడైన ఆచారి అత్యాశగల మహిళ రాజ్యలక్ష్మి (వై.జయ) కుమార్తె సంగీత (కీర్తన) ద్వారా అతన్ని ఉచ్చులోకి లాగుతాడు. వాస్తవానికి, సతీష్‌కు ఒక బలహీనత ఉంది -అతను తాగినప్పుడల్లా, నియంత్రణ కోల్పోతాడు. మళ్ళీ స్పృహలోకి వచ్చాక తాగినపుడు చేసిందంతా మరచిపోతాడు. రాజ్యలక్ష్మి ఆ బలహీనతను వాడుకుని, సతీష్ సంగీతను వేధించాడని తప్పుడు ప్రచారం చేస్తుంది. సతీష్ సంగీతను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ సందర్భంగా సతీష్ బ్రహ్మచారి పార్టీ ఇస్తాడు. మళ్ళీ తాగుతాడు. మరుసటి రోజు ఉదయం, ఆశ్చర్యకరంగా, శారద అనే అమ్మాయి (ఇంద్రజ) తాను సతీష్ భార్యనంటూ వస్తుంది. ముందు రోజు రాత్రి పెళ్ళి చేసుకున్నాడని చెబుతుంది. ఇక సతీష్ ఆమెను వదిలించుకోడానికి సంగీత, రాజలక్ష్మిలతో కలిసి అనేక ఉపాయాలు వేస్తాడు. కానీ అన్నీ బెడిసి కొడతాయి. కొన్ని హాస్య సంఘటనల తరువాత, సతీష్ శారద మంచితనాన్ని, సంగీత, రాజలక్ష్మిల మోసాన్నీ తెలుసుకుంటాడు. శారద అతన్ని ఒక పెద్దామె (మంజు భార్గవి) వద్దకు తీసుకువెళుతుంది. అనైతికత కారణంగా ఆనంద రావును విడిచిపెట్టిన అతని తల్లి వసుంధరే ఆమె. నిజానికి ఆమే తన కొడుకును రక్షించడానికి శారదను నియమిస్తుంది. చివరికి, సతీష్ ఒక నాటకం ఆడి, ఆనంద రావు తన తప్పును గ్రహించేలా చేస్తాడు. చివరగా, ఈ చిత్రం సతీష్, శారదల పెళ్ళితో సంతోషంగా ముగుస్తుంది.
నటీనటులు
[మార్చు]- సతీష్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్
- శారదగా ఇంద్రజ
- కీర్తన సంగీతగా
- ఆనంద్ రావుగా కోట శ్రీనివాసరావు
- పొట్టి రాయుడు / బాషా / బిగ్ బాస్ గా బ్రహ్మానందం
- పోలీస్ ఇన్స్పెక్టర్గా తనికెళ్ళ భరణి
- ఆచారిగా ఎ.వి.ఎస్
- శివాజీ రాజా
- గుండు హనుమంతరావు
- చిట్టి బాబు
- న్యాయవాదిగా కళ్ళు చిదంబరం
- వసుంధరగా మంజు భార్గవి
- లతాశ్రీ
- రాజ్యలక్ష్మిగా వై విజయ
పాటలు
[మార్చు]విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు. సుప్రీం మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది.
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ధింతానా వెన్నెల్ చిలకా" | Sahithi | మనో, సింధు | 4:10 |
2. | "చలిగాలి చెంగుచాటు" | భువనచంద్ర | మనో, చిత్ర | 4:29 |
3. | "గంపలో కోడంట" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మనో, చిత్ర | 4:44 |
4. | "మహారణీ మంజులవాణీ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మనో, సుజాత | 4:12 |
5. | "హై హై మదనా" | భువనచంద్ర | మనో, చిత్ర | 3:55 |
మొత్తం నిడివి: | 21:30 |
మూలాలు
[మార్చు]- ↑ "Mummy Mee Aayanochadu (Direction)". Spicy Onion. Archived from the original on 2020-07-02. Retrieved 2020-08-07.
- ↑ "Mummy Mee Aayanochadu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-08. Retrieved 2020-08-07.
- ↑ "Mummy Mee Aayanochadu (Review)". Know Your Films.