మరుపోలు జశ్వంత్ రెడ్డి
మరుపోలు జశ్వంత్ రెడ్డి | |
---|---|
జననం | 1998 |
మరణం | 8 జులై 2021 కశ్మీర్, రాజౌరి జిల్లా, సుందర్‌బని సెక్టార్ |
జాతీయత | భారతదేశం |
తల్లిదండ్రులు | శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ |
పురస్కారాలు | శౌర్యచక్ర |
మరుపోలు జశ్వంత్ రెడ్డి భారతదేశానికి చెందిన భారత జవాన్లు. ఆయన 2021లో జమ్మూకశ్మీర్, రాజౌరీ జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో కూంబింగ్ జరుపుతుండగా ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పులలో వీర మరణం చెందాడు. జశ్వంత్ రెడ్డి మరణాంతరం భారత ప్రభుత్వం ఆయనకు శౌర్య చక్ర అవార్డును ప్రకటించింది.[1][2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]జశ్వంత్ రెడ్డి 1998లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, దరివాడ కొత్తపాలెంలో శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు.
వృత్తి జీవితం
[మార్చు]జశ్వంత్‌రెడ్డి మద్రాస్ రెజిమెంట్‌లో 2016లో సైనికునిగా చేరాడు. ఆయన శిక్షణ తర్వాత నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించి అనంతరం బదిలీపై జమ్ముకశ్మీర్ వెళ్లాడు.
మరణం
[మార్చు]జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందెర్‌బని సెక్టార్‌లో 8 జులై 2021న ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భారత జవాన్లు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్ల పైకి కాల్పులు జరిపారు. భారత జవాన్లకు,ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో జవాన్లు మరుపోలు జశ్వంత్ రెడ్డి, శ్రీజిత్ అమరులయ్యారు.[3]ఆయన అంత్యక్రియలు 10 జులై 2021న తన స్వగ్రామంలో సైనిక లాంచనాలతో నిర్వహించారు.[4][5]ఆయన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (26 January 2022). "అమర జవాన్ జశ్వంతరెడ్డికి శౌర్యచక్ర". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Namasthe Telangana (25 January 2022). "తెలుగు బిడ్డ జశ్వంత్‌కు శౌర్యచక్ర". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ TNews Telugu (9 July 2021). "ఇద్దరు భారత జవాన్లు వీరమరణం.. గుంటూరు జిల్లాలో విషాదం". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ 10TV (10 July 2021). "వీరుడా వందనం, ముగిసిన వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు | Jawan Jaswanth Reddy Final Rites Guntur" (in telugu). Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ ETV Bharat News (29 January 2022). "స్వగ్రామానికి వీర జవాన్ భౌతికకాయం... నేడే అంత్యక్రియలు". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Andhrajyothy (9 July 2021). "అమర జవాన్ కుటుంబానికి రూ.50లక్షలు సాయం: సీఎం జగన్". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.