Jump to content

మలిందా వర్ణపుర

వికీపీడియా నుండి
మలిందా వర్ణపుర
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బస్నాయకే శాలిత్ మలిందా వర్ణపురా
పుట్టిన తేదీ (1979-05-29) 1979 మే 29 (వయసు 45)
కొలంబో, శ్రీలంక
మారుపేరుMali
ఎత్తు5 అ. 6 అం. (1.68 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్‌మెన్‌
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 106)2007 జూన్ 25 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2009 జూలై 20 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 132)2007 మే 20 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2008 ఆగస్టు 29 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
Basnahira South
Burgher Recreation Club
కొలంబో క్రికెట్ క్లబ్
కోల్ట్స్ క్రికెట్ క్లబ్
Khelaghar SKS
Sri Lanka A
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 14 3 149 111
చేసిన పరుగులు 821 35 7,183 2,316
బ్యాటింగు సగటు 35.69 11.66 35.55 28.59
100లు/50లు 2/7 0/0 16/36 3/8
అత్యుత్తమ స్కోరు 120 30 242 104*
వేసిన బంతులు 54 6,918 2,234
వికెట్లు 0 118 69
బౌలింగు సగటు 27.72 23.15
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 6/22 5/33
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 3/– 100/– 43/–
మూలం: Cricinfo, 2015 ఆగస్టు 4

బస్నాయకే శాలిత్ మలిందా వర్ణపురా, శ్రీలంక మాజీ క్రికెటర్. 14 టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌ మ్యాచ్‌లలో ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీకి ప్రస్తుత కోచ్ ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ బందుల వర్ణపురా మేనల్లుడు, క్రికెటర్ మాదవ వర్ణపురా బంధువు.

జననం

[మార్చు]

బస్నాయకే శాలిత్ మలిందా వర్ణపురా 1979, మే 26న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

1998/99లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన వర్ణపురా, 2007 వరకు శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. గతంలో 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2007లో బంగ్లాదేశ్ ఎ జట్టుతో జరిగిన ఫస్ట్ క్లాస్ లో శ్రీలంక ఎ తరపున అత్యధికంగా 242 స్కోరు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2007 మే 20న బంగ్లాదేశ్‌పై వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. 2007 జూన్ 25న అదే సిరీస్‌లో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 120 పరుగులు చేసిన మలిందా తన మూడవ టెస్టులో తన మొదటి టెస్ట్ సెంచరీని సాధించాడు. మైఖేల్ వాన్‌డోర్ట్‌తో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దూకుడుగా షాట్లు కొట్టినప్పటికీ, చివర్లో తరంగ పరణవితనతో కలిసి, 2009లో పాకిస్తాన్ సిరీస్ తర్వాత అతను జట్టు నుండి తొలగించబడ్డాడు.[1] ఆ తర్వాత టెస్టులు, వన్డేల్లో ఆడలేదు. అంతర్జాతీయ క్రికెట్ లో 2 సెంచరీలు, 3 వన్డేలతో 14 టెస్టులు ఆడాడు. ఇప్పుడు దేశీయ క్రికెట్‌తో పాటు క్రీడలకు టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "The hard-nosed Kiwi". ESPN Cricinfo. Retrieved 26 May 2017.

బాహ్య లింకులు

[మార్చు]