మల్లెల దావీదు
స్వరూపం
మల్లెల దావీదు (ఆగస్టు 6, 1890 - మే 17, 1971) తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు.
జననం
[మార్చు]1890, ఆగస్టు 6 న నర్సారావుపేట తాలూకాలోని చిమ్మనబండ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు రెవ. ఇస్సాకు, రెబక్కమ్మలు. రామాయపట్నం లోని వేదాంత పాఠశాలలో వేదాంత విద్య ముగించి, వేదాంత ఉపాధ్యాయుడిగా రామాపట్నం, డోర్నకల్‌లో పనిచేశారు.ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు.తెలుగు క్రైస్తవ సాహిత్య సేవ కే అంకితమయ్యారు. కీర్తనల్ని వ్రాయడమే కాకుండా ప్రతి వేసవిలో సంగీత శిక్షణా సమ్మేళనాల్ని నిర్వహించి, ప్రతి సంకీర్తనను రాగతాళ భావయుక్తంగా ఎలా పాడాలో శిక్షణనిచ్చేవారు. మంచి వక్త. 1937 లో మల్లెల దావీదు, రెవ.ఎమ్.ఎల్.డోల్బీర్, రెవ. బి. హెబ్బి డేవిస్ ముగ్గురు సంపాదక త్రయంగా ఏర్పడి ఆంధ్రక్రైస్తవ కీర్తనల గ్రంథం రూపొందించారు.
ఖండకావ్యాలు,శతకాలు
[మార్చు]- జూబిలీ నవరత్నమాల
- జగజ్జయము
- అస్పృశ్యత
- అమ్మా కొక్కొరొకో
- ఆంధ్రమాత
- దురాత్మ
- బాల ప్రార్థనా పద్యాలు
- సమూయేలు చరిత్ర
- యోనా కథావళి
- అర్థ భాను నాటకం
- కావ్య చంద్రిక (లక్షణ గ్రంథం)
- జగద్రక్షణ (సత్కథా కాలక్షేపం)
- పంచతంత్రం (నవల)
- సాక్షి-భగవన్ముక్తి
- సాక్షి-భగవదుక్తి
- సాక్షి-భగవద్భక్తి (వేదాంత గ్రంథాలు)
- బాలవేదాంత కథలు
- లాజరు కథలు
- దేశభక్తి గీతాలు
మరణం
[మార్చు]1971, మే 17 న తుది శ్వాస విడిచారు.