మసాల ఈరన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మసాల ఈరన్న

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1983
1985 - 1990
1994 - 1999
నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1987 - 1992

వ్యక్తిగత వివరాలు

జననం 1936
కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 2014 ఏప్రిల్ 25
ఆలూరు
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ , ప్రజారాజ్యం పార్టీ

మసాల ఈరన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆలూరు నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మసాల ఈరన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి ఎర్రన్న పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి బసప్ప చేతిలో ఓడిపోయాడు. మసాల ఈరన్న1985 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మసాల ఈరన్న 1987లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జెడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి గెలిచి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు, అనంతరం 2007లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆలూరు మండలం జెడ్పీటీసీ సభ్యునిగా గెలిచాడు, కానీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశాడు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి,[1] అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.

మరణం

[మార్చు]

మసాల ఈరన్న 2014 ఏప్రిల్ 25న అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలుజిల్లా ఆలూరులోని తన స్వగృహంలో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (3 April 2009). "Masala Eranna's 'Gandhigiri' continues at PRP office" (in ఇంగ్లీష్). Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  2. Sakshi (25 April 2014). "మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న కన్నుమూత". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.