Jump to content

మహాలయ పౌర్ణమి

వికీపీడియా నుండి
మహాలయ పౌర్ణమి ముందురోజు పొలాల గట్ల వద్ద జంతువులను బలి యిస్తున్న దృశ్యం

మాలపున్నమి లేదా మహలయ పౌర్ణమి పండుగను పల్లె ప్రజలు 'మాల పున్నం' అంటారు. చదువుకొనె వారు మహలయ పౌర్ణమి అంటారు.ఇది రాయలసీమ, అనంతపురం జిల్లాలలో జరుపుకొనె ఒక పండుగ.ఇది తెలుగునెల ప్రకారం ఆశ్వయుజ మాసంలో పున్నమి నాడు హరిజనులు చేసుకొనే పండుగ.అంటే ఇంగ్లీషునెల ప్రకారం ఆగష్టు కడపటి వారంలో గాని, సెప్టెంబరు మొదటివారంలో కాని వస్తుంది. మాలపున్నం నగరాలలో అంతగా కనిపించదు. మాలపున్నం పండుగ వచ్చే నాటికి పొలంలో విత్తనాలు వేయబడి ఉంటాయి. ఇది ప్రత్యేకంగా హరిజనులు జరుపుకొనే పండుగ. మాల, మాదిగలు జరుపుకొనే పండుగ కావునే దీనిని మాల పున్నం అంటారు.

విశిష్టత

[మార్చు]

మాల పున్నమికి గాలి అంతా మడుగులో పడిపోతుందని ఒక సామెత కలదు. ఈ పండుగ అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల కలదు, కొన్ని చేట్లలేదు. అసలు రాయలసీమ ప్రాంతంలో ఇది ఇప్పుడు కనబడుటలేదు అని, అనంతపురం జిల్లాలో కొన్ని చోట్లమాత్రమే కలదని చెబుతారు. ఈ పండుగ గురించి ఎన్నో కట్టు కథలు చెబుతారు. ఇక్కడ హరిజనులు పండుగనాడు ఉపవాసంతో ఉండి, ఇల్లు-బయట, లోపల పరిశుభ్రంగా ఉంచి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ నాడు తీపి ప్రధాన వస్తువుగా భావిస్తారు. రేపు పండగ అనగానే ముందు రోజు రాత్రి పది గంటల నుంచి పొలాలు దగ్గర వేటలు (పొట్టెలు, మేక పోతులు, కోళ్ళు) కొట్టుట జరుగుతుంది. అలా పొలాల దగ్గర వేటలు కొట్టుటవలన పైరు తల్లికి పోషణబలం, ఏమైనా రోగాలు ఉంటే పోతాయని వీరి నమ్మకం.కొందరు ఉదయాన్నే వేటలు కొడతారు. వేటలు కొట్టలేని వాళ్ళు బొచ్చు లేదా ఉన్ని తీసుకొనిపోయి పొలాల దగ్గర కడతారు. పండుగ నాడు సాయత్రం పూట కోలాట వేషాలు, కోళ్ళ పందాలు కాలక్షేపం కోసం సరదాగా ఆడుతారు. దీని కోసం పిల్లలు పెద్దలు అత్యంత శ్రద్ధతో ఎదురు చూస్తారు. ఈ పండుగ కొత్తగా పెళ్ళనవారికి తప్పనిసరి వేడుక.

మూలాలు

[మార్చు]
  • 1983 భారతి మాస పత్రిక- వ్యాసం- మాల పున్నం పండుగ-వ్యాస కర్త- శ్రీ జౌనగాని కాటమయ్య.