Jump to content

మహాసముద్రం

వికీపీడియా నుండి
(మహా సముద్రం నుండి దారిమార్పు చెందింది)


ప్రపంచపటం ఐదు మహా సముద్రముల ఉజ్జాయుంఫు సరిహాద్దులతో

మహా సముద్రం లేదా మహాసాగరం, భూగోళం యొక్క జలావరణంలో ప్రధాన భాగం. ఉప్పు నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఫైగా లోతైనవి. సరాసరి మహాసముద్రాల 'సెలైనిటీ' (ఉప్పదనం) దాదాపు మిలియనుకు 35 వంతులు (3.5%). దాదాపు అన్ని సముద్ర జలాల సెలైనిటీ మిలియనుకు 31 నుండి 38 వంతులు ఉంటుంది. మహాసాగరాలన్నీ కలిసి ఉన్నా గాని వ్యావహారికంగా ఐదు వేరు వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం[1] .

ప్రధానాంశాలు

[మార్చు]

ఐదు మహాసముద్రాలు అని చెప్పబడుతున్నా గాని ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయిన పెద్ద నీటి భాగాలు. కనుక దీనిని ప్రపంచ మహాసముద్రం అని చెప్పవచ్చును.[2][3]. ఈ విషయం జలావరణ శాస్త్రం అధ్యయనంలో ప్రధానమైన అంశం.[4]

మహా సముద్రాలలో కొన్ని చిన్న భాగాలను సముద్రాలు, సింధుశాఖలు అని అంటారు. అధికంగా అక్కడి భూభాగం లేదా దేశం లేదా ప్రాంతం బట్టి ఈ సముద్రాల, సింధుశాఖల పేర్లు ఉంటాయి. కొన్ని జలాశయాలు పూర్తిగా భూమిచే చుట్టబడి ఉంటాయి. (అంటే ఇతర సముద్రాలతో కలసి ఉండవు). కాస్పియన్ సముద్రం, అరల్ సముద్రం, గ్రేట్ సాల్ట్ లేక్ ఈ కోవలోకి వస్తాయి. నిజానికి ఇవి పెద్ద ఉప్పునీటి సరస్సులే గాని సముద్రాలు కాదు.

భౌగోళికంగా మహాసముద్రం అంటే భూగోళంపై నీటితో కప్పబడిన "సముద్రపు అడుగు". (ఓషియానిక్ క్రస్ట్). Oceanic crust is the thin layer of solidified volcanic basalt that covers the Earth's mantle where there are no continents.

భౌతిక లక్షణాలు

[మార్చు]
ప్రపంచంలో మహాసముద్రాల విస్తరణను చూపే మరొక చిత్రం. అన్ని సాగరాలు కలిసి ఉండడం గమనించవచ్చును.

.

మొత్తం ప్రపంచ సముద్ర ఉపరితల వైశాల్యం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు. (139 మిలియన్ చదరపు మైళ్ళు.).[5] మొత్తం ఘన పరిమాణం (volume) సుమారు 1,300 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు. (310 మిలియన్ క్యూబిక్ మైళ్ళు.),[6] సరాసరి లోతు 3,790 మీటర్లు (12,430 అడుగులు).[5] సముద్రాలలో సగం పైగా నీరు 3,000 మీటర్లు (9,800 అడుగులు) కంటే ఎక్కువ లోతుగా ఉంది.[3] భూమి ఉపరితలం పైని 71% సముద్రంతో కప్పబడి ఉంది.[7] (వేరుగా ఉన్న సముద్రాలు కాకుండా).

మొత్తం హైడ్రోస్ఫియర్ మాస్ 1.4 × 1021 కిలోగ్రాములు. అంటే భూమి మాస్‌లో 0.023%. ఇందులో 2% లోపే మంచినీరు, మిగిలినది (అధికంగా సముద్రాలలో ఉన్న) ఉప్పునీరు.

రంగు

సముద్రాలు నీలంగా ఉంటాయని అభిప్రాయం ఉంది. కాని ఇది నిజం కాదు. నీటికి కొద్దిపాటి నీలం రంగు ఉన్నప్పటికీ అది అతిపెద్ద పరిమాణాలలో మాత్రమే కనుపిస్తుంది. ఆకాశం ప్రతిబింబం కూడా సముద్రం నీలంగా కనుపించడానికి కొద్దిగా దోహదం చేస్తుంది. కాని అది ప్రధాన కారణం కాదు.[8] నీటి కణాల కేంద్రాలు తమపై బడిన కాంతిలో ఎరుపు రంగు ఫోటానులను గ్రహిస్తాయి. వైబ్రేషనల్ డైనమిక్స్ ద్వారా (ఎలక్ట్రానిక్ డైనమిక్స్ కాకుండా) ప్రకృతిలో రంగు మార్పిడి సంభవించడానికి ఇది ఒకే ఒక ఉదాహరణ.[9]

పరిశోధనలు

[మార్చు]
జలాంతర్గత విశేషాలను చూపే మాపు. (1995, en:NOAA)

పురాతన కాలంనుండి మానవుడు సముద్రాలపై ప్రయాణిస్తున్నప్పటికీ సముద్రాల నీటి అడుగుకు వెళ్ళడం ఇటీవల కాలంలోనే సాధ్యమయ్యింది.

ప్రపంచంలో అన్నింటికంటే లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్ (Marianas Trench . ఇది పసఫిక్ మహాసముద్రంలో ఉత్తర మెరియానా దీవులు ప్రాంతంలో ఉంది. దీని అత్యధిక లోతు 10,923 మీటర్లు (35,838 అడుగులు) [10] . 1951 బ్రిటిష్ నౌక "చాలంజర్ II" చే ఇది సర్వే చేయబడింది. అప్పుడు ఈ ట్రెంచ్‌లో అత్యంత లోతైన చోటుకు ఛాలెంజర్ డీప్ (Challenger Deep) అని పేరు పెట్టారు. 1960లో ట్రెయిస్టి అనే 'బాతీస్ఫియర్ ఇద్దరు మనుషులతో ఈ ఛాలెంజర్ డీప్ అడుగు భాగానికి చేరుకొంది.

ఇప్పటికీ సముద్రాంతరతలం చాలావరకు అన్వేషించబడలేదు.

విభాగాలు

[మార్చు]
సముద్రంలో ముఖ్యమైన ప్రాంతీయ విభాగాలు

సముద్ర భాగాలు అక్కడి భౌతిక, జీవ లక్షణాలను బట్టి, లోతును బట్టి కొన్ని ప్రాంతాలుగా విభజింపబడుతున్నాయి.

  • పెలాజిక్ జోన్ (pelagic zone) - భూమిపైని మొత్తం సముద్రాలను పెలాజిక్ జోన్ అని అంటారు. దీనిని ఆయా ప్రాంతాలలో ఉండే కాంతి, లోతును బట్టి మరికొన్ని ఉప విభాగాలుగా విభజించారు.
    • ఫోటిక్ జోన్ (photic zone) సముద్ర ఉపరితలం నుండి 200 మీటర్లకంటే తక్కువ లోతు ఉన్న భాగం. ఈ భాగంలో కాంతి ప్రసరంచడం వలన ఇక్కడ ఫొటో సింథసిస్ జరుగుతుంది. కనుక ఇక్కడ మొక్కలు పెరిగే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో ఎక్కువ జీవ వైవిధహయం ఫోటిక్ జోన్లోనే ఉంటుంది. ఫోటిక్ జోన్యొక్క పెలాజిక్ భాగాన్ని ఎపిపెలాజిక్ (epipelagic) అంటారు.
    • అఫోటిక్ జోన్ (aphotic zone) - 200మీటర్లకంటే ఎక్కువ లోతు గల ప్రాంతం. ఈ లోతులో ఫొటోసింథసిస్ జరుగదు గనుక ఇక్కడ వృక్ష జాతి ఉండే అవకాశం లేదు. అందువలన ఇక్కడ ఉండే జీవజాలం 'పైనుంచి' అనగా ఫోటిక్ జోన్నుండి మెల్లగా క్రిందికి దిగే ఆహారంపై (ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని) ఆధారపడవలసి వస్తుంది. అలా పైనుండి పడే ఆహారాన్ని మెరైన్ మంచు (marine snow) అని అంటారు. అది హైడ్రో థర్మల్ వెంట్స్ ద్వారా లభిస్తుంది.

పైన చెప్పిన విధంగా పెలాజిక్ జోన్ను ఫోటిక్ జోన్లో ఎపిపెలాజిక్ జోన్ అంటారు. అఫోటిక్ జోన్లో పెలాజిక్ జోన్ను లోతును బట్టి మరి నాలుగు విధాలుగా విభజించారు.

      • మీసోపెలాజిక్ జోన్ - అఫోటిక్ జోన్లో పైభాగం - ఈ జోన్ అట్టడుగు సరిహద్దు 10 °C థర్మోక్లైన్ వద్ద ఉంటుంది. సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాలలో ఈ మీసోపెలాజిక్ జోన్ 700మీ. - 1000 మీ. లోతుల మధ్య భాగంలో ఉంటుంది.
      • బేతిపెలాజిక్ జోన్ - 10 °C, 4 °C థర్మోక్లైన్ మధ్యలో ఉండేది. ఈ జోన్ ఎగువ హద్దులు 700 మీ-1000 మీ. మధ్యన, దిగువ హద్దులు 1000మీ-4000మీ. మధ్యన ఉంటాయి.
      • అబిస్సల్ పెలాజిక్ జోన్ - అబిస్సల్ మైదానాల పైని భాగం. దీని దిగువ హద్దులు సుమారు 6,000మీ. లోతులో ఉంటాయి.
      • హదల్పెలాజిక్ జోన్ - ఇది సముద్రాంతర అఘాతాలలోని ప్రాంతం (oceanic trenches). ఈ జోన్ 6,000మీ. - 10,000మీ. లోతుల్లో ఉండే అట్టడుగు ప్రాంతము.

పైన చెప్పిన పెలాజిక్ అఫోటిక్ జోన్తో బాటు బెంతిక్ అఫోటిక్ జోన్లు ఉన్నాయి. ఇవి మూడు లోతైన జోన్లు.

  • బేతియల్ జోన్ - కాంటినెంటల్ స్లోప్ ప్రాంతంలో ఉంది. 4,000 మీటర్ల వరకు లోతు గలిగినది.
  • అబిస్స్లల్ జోన్ - 4,000మీ - 6,000 మీ. మధ్య లోతు గల సముద్రాంతర మైదాన ప్రాంతాలు.
  • హదల్ జోన్ - సముద్రాంతర అఘాతాలలోని హదల్పెలాజిక్ జోన్.

మరో విధంగా పెలాజిక్ జోన్ను రెండు ఉప ప్రాంతాలుగా విభజింపవచ్చును.

పెలాజిక్ జోన్ అన్ని వేళలా నీటి అడుగు భాగంలో ఉంటుంది. కాని లిట్టొరల్ జోన్ ప్రాంతం ఆటు, పోటుల హద్దుల మధ్య ప్రాంతాన్ని సూచిస్తుంది. అంటే ఈ భాగం పోటు సమయంలో మాత్రమే నీటి అడుగున ఉంటుంది. ఈ ప్రాంతలోనే భౌగోళికంగాను, జీవ వైవిధ్యం పరంగాను భూతలం లక్షణాలనుండి సముద్రాంతర లక్షణాలు రూపాంతరం చెందడం గమనించవచ్చును. ఈ ప్రాంతాన్ని ఇంటర్ టైడల్ జోన్ అని కూడా అంటారు.

పర్యావరణం

[మార్చు]

భూమి వాతావరణాన్ని సముద్రాలు చాలా పెద్దయెత్తున ప్రభావితం చేస్తాయి. ఋతుపవనాలకు, తుఫానులకు, ఇతర గాలులలకు సముద్రాలే పుట్టినిళ్ళు. సముద్రాంతర్గతంగా ప్రవహించే ప్రవాహాలు (ఉష్ణ లేదా శీతల ప్రవాహాలు) సమీప ఖండాలలో ఉష్ణోగ్రతను బాగా ప్రభావితం చేస్తాయి. భూమిపైని వాతావరణం ఉష్ఞోగ్రత నియంత్రించడంలోను, కొన్ని వాయువులను పీల్చుకోవడంలోనూ సముద్ర జలాలు చాలా ముఖ్యమైన ప్రభావం కలిగి ఉంటాయి.

ఆర్ధికం

[మార్చు]
  • సముద్రంలో ఎంతో ఉపయోగకరమైన మత్స్య సంపద లభిస్తుంది. చేపలూ, పీతల వంటి మరికొన్ని జాతులూ మానవునకు ఒక ముఖ్యమైన ఆహార వనరులు.
  • సముద్ర గర్భంలో నూనె, సహజ వాయుడు, మరికొన్ని విలువైన ఖనిజాలు లభిస్తాయి.
  • అంతర్జాతీయంగా సరకుల రవాణా అధికభాగం సముద్రం మీదనే జరుగుతుంది.

ఆంగ్ల వికీలో సంబంధిత వ్యాసాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://oceanservice.noaa.gov/facts/howmanyoceans.html
  2. "Ocean Archived 2007-03-03 at the Wayback Machine". The Columbia Encyclopedia. 2006. New York: Columbia University Press
  3. 3.0 3.1 "Distribution of land and water on the planet Archived 2008-05-31 at the Wayback Machine". UN Atlas of the Oceans
  4. Spilhaus, Athelstan F. 1942 (Jul.). "Maps of the whole world ocean." Geographical Review (American Geographical Society). Vol. 32 (3): pp. 431-5.
  5. 5.0 5.1 "The World's Oceans and Seas". Encarta. Archived from the original on 2006-02-24. Retrieved 2007-12-16.
  6. Qadri, Syed (2003). "Volume of Earth's Oceans". The Physics Factbook. Retrieved 2007-06-07.
  7. Drazen, Jeffrey C. "Deep-Sea Fishes". School of Ocean Earth Science and Technology, University of University of Hawaiʻi at Mānoa. Archived from the original on 2012-05-24. Retrieved 2007-12-16.
  8. http://amasci.com/miscon/miscon4.html#watclr
  9. Braun, C. L. and Smirnov, S. N. (1993) Why is water blue? Archived 2019-05-25 at the Wayback Machine J. Chem. Edu. 70, 612.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-04-24. Retrieved 2007-12-16.

బయటి లింకులు

[మార్చు]