Jump to content

మహిళా రిజర్వేషన్ బిల్లు (2010)

వికీపీడియా నుండి

మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది భారతదేశంలోని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించినది. 2010 మార్చి 9న ఆ బిల్లు అంటే భారత రాజ్యాంగం (నూట ఎనిమిదవ సవరణ) బిల్లు, 2008కి రాజ్యసభ ఆమోద ముద్రవేసింది.[1]కానీ, అప్పటినుంచి లోక్‌సభలో పెండింగులో ఉన్న ఈ బిల్లు ఆమోదం పొందితేనే చట్టరూపం దాలుస్తుంది.[2][3] అంటే లోక్‌సభలో మెజారిటీ ఉండే పాలక పార్టీ, కూటమి దీనిపై దృష్టిసారించాల్సిఉంటుంది.

దీనికి సమానమైన బిల్లు నారీ శక్తి వందన్ అధినియమ్, 2023 సెప్టెంబరు 20న లోక్‌సభలో అనుకూలంగా 454 ఓట్లతో, రెండు వ్యతిరేకంగా ఆమోదించబడింది.[4] ఆ తర్వాత రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2023 సెప్టెంబరు 21 నాటికి బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది.[5]

పుర్వాపరాలు

[మార్చు]

మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు దిగువ సభలోని మొత్తం సీట్లలో 1/3 వంతు రిజర్వేషన్‌కు భారత రాజ్యాంగాన్ని సవరించాలని చెబుతుంది. మహిళల కోసం లోక్‌సభ,అలాగే అన్ని రాష్ట్రాల శాసన సభలలో. సీట్లు రొటేషన్‌లో రిజర్వ్ చేయబడాలని ప్రతిపాదించబడ్డాయి. వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే సీటు రిజర్వ్ అయ్యే విధంగా లాట్ల డ్రా ద్వారా నిర్ణయించబడుతుంది.

లోక్‌సభ, శాసనసభల్లో 33శాతం సీట్లను మహిళలకు కేటాయించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో హెచ్.డి.దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే అప్పుడు కానీ ఆ తరవాత వచ్చిన అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాములో కానీ ఆ బిల్లు లోక్‌సభ ఆమోదానికి నోచుకోలేదు. అలాగే 2014లో ఏర్పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండానే లోక్‌సభ గడువు ముగిసింది. 2019లో, తిరిగి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ బిల్లుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.[6]

ఆమోదం

[మార్చు]

2023 సెప్టెంబరు 19న, నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవనంలో లోక్‌సభలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా 128వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2023గా బిల్లును ప్రవేశపెట్టింది.[7][8] నారీ శక్తి వందన్ అధినియం లోక్‌సభ నుండి ఆమోదించబడిన తర్వాత మళ్లీ రాజ్యసభకు వెళుతుంది.[9][10] నారీ శక్తి వందన్ అధినియం 2023 సెప్టెంబరు 20న లోక్‌సభలో అనుకూలంగా 454 ఓట్లు రాగా, రెండు వ్యతిరేకంగా నమోదయ్యాయి.[11] 2023 సెప్టెంబరు 21న ఈ బిల్లు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించబడింది.[12][13]

మహిళా రిజర్వేషన్

[మార్చు]

1993లో, భారతదేశంలో ఒక రాజ్యాంగ సవరణ ఆమోదించబడింది, దీని ప్రకారం గ్రామ పంచాయతీలలో మూడింట ఒక వంతు గ్రామ కౌన్సిల్ లీడర్, సర్పంచ్ పదవులను మహిళలకు కేటాయించడం జరుగుతుంది.[14]

ఇదే రిజర్వేషన్‌ విధానం పార్లమెంటు, శాసన సభలకు కూడా అమలుచేయాలని మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు.[15][16][17]

ఇవీ చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rajya Sabha passes Women's Reservation Bill". The Times of India. 9 March 2010. Archived from the original on 11 August 2011.
  2. "Lok Sabha Speaker Meira Kumar calls for women's empowerment". The Times of India. 9 March 2013. Archived from the original on 5 May 2013. Retrieved 3 December 2013.
  3. "Uproar in India Over Female Lawmaker Quota". The New York Times. 9 March 2010.
  4. "India's lower house votes to reserve a third of seats for women". Al Jazeera English (in ఇంగ్లీష్). 20 సెప్టెంబరు 2023. Wikidata Q122735230. Archived from the original on 20 September 2023.
  5. https://www.news18.com/amp/videos/breaking-news/nari-shakti-vandan-adhiniyam-women-s-reservation-bill-passed-in-rajya-sabha-pm-modi-news18-8586817.html
  6. "Womens Reservation Bill: కేబినెట్‌ కీలక నిర్ణయం.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం | womens reservation bill cleared in cabinet meeting". web.archive.org. 2023-09-18. Archived from the original on 2023-09-18. Retrieved 2023-09-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Govt brings in women's reservation Bill: One-third of seats to be reserved, also in SC/ST quota".
  8. "Mallikarjun Kharge vs Nirmala Sitharaman in Rajya Sabha over women's reservation bill remarks".
  9. "PM Modi urges Rajya Sabha MPs to unanimously approve women's reservation bill".
  10. "Rajya Sabha proceedings adjourned for day; House to meet on September 20".
  11. "India's lower house votes to reserve a third of seats for women". Al Jazeera English (in ఇంగ్లీష్). 20 సెప్టెంబరు 2023. Wikidata Q122735230. Archived from the original on 20 September 2023.
  12. "PM Modi urges Rajya Sabha MPs to unanimously approve women's reservation bill".
  13. "Rajya Sabha proceedings adjourned for day; House to meet on September 20".
  14. Chattopadhyay, Raghabendra, and Esther Duflo (2004). "Women as Policy Makers: Evidence from a Randomized Policy Experiment in India". Econometrica. 72 (5). The Abdul Latif Jameel Poverty Action Lab: 1409–43. doi:10.1111/j.1468-0262.2004.00539.x. hdl:1721.1/39126. Retrieved December 14, 2018.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  15. Women are seeking 33% reservation in jobs, promotions[permanent dead link]
  16. Women's Bill: What's the fuss about? Rediff 24 August 2005.
  17. The reservations business, Indian Express, 11 August 1998.