Jump to content

మహి విజ్

వికీపీడియా నుండి
మహి విజ్
2013లో మహి విజ్
జననం (1982-04-01) 1982 ఏప్రిల్ 1 (వయసు 42)[1]
న్యూ ఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2004–2020
జీవిత భాగస్వామి
జై భానుశాలి
(m. 2011)
[2][3]
పిల్లలు3

మహి విజ్ (జననం 1982 ఏప్రిల్ 1) హిందీ టెలివిజన్‌కు చెందిన భారతీయ మోడల్, నటి. ఆమె లగి తుజ్సే లగాన్‌లో నకుషాగా, బాలికా వధులో నందిని పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందింది. ఆమె, ఆమె భర్త జై భానుశాలి 2013లో డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 5ను గెలుచుకున్నారు. ఆమె ఝలక్ దిఖ్లా జా 4, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 7లలో కూడా పాల్గొన్నది.

ఆమె 2004లో విడుదలైన తెలుగు చలనచిత్రం తపనలో ఆమె ప్రభుదేవా, సిద్ధు, సీమా, వేద లతో పాటు ముఖ్యపాత్రలో నటించింది.[4][5]

కెరీర్

[మార్చు]

మహి విజ్ 17 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లి మోడలింగ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది.[6] ఆమె తు, తు హైi వహీ (డీజె అకీల్ మిక్స్) తో సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. 2006లో టీవీ సిరీస్ అకేలాలో ఆమె సపోర్టింగ్ ఫీమేల్ లీడ్ రోల్ చేసింది.

ఆమె మొదటి చిత్రం మలయాళంలో మలయాళ స్టార్ మమ్ముట్టితో కలిసి అపరిచితన్ (2004) అనే సినిమా చేసింది.

ఆమె సహారా వన్ షో శుభ్ కదమ్‌లో ప్రథా అనే ప్రధాన పాత్ర పోషించింది. కలర్స్ టీవిలోని లగీ తుజ్సే లగాన్ అనే టెలివిజన్ షోలో కథానాయిక నకుషా పాత్రలో ఆమె కీలక పాత్ర పోషించింది, దీని కోసం ఆమె 2011లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటిగా బంగారు అవార్డును గెలుచుకుంది. ఆమె ఝలక్ దిఖ్లా జా సీజన్ 4లో పోటీదారుగా కనిపించింది.

2012లో, ఆమె, ఆమె భర్త జై భానుశాలి డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 5లో పాల్గొని విజేతలుగా నిలిచారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మహి విజ్ 2011లో భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటుడు జై భానుశాలిని వివాహం చేసుకుంది. 2017లో వారు రాజ్‌వీర్ అనే అబ్బాయి, ఖుషీ అనే అమ్మాయిని దత్తతతీసుకున్నారు. అయితే, ఈ జంటకు తారా అనే కుమార్తె 2019లో జన్మించింది.[7]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర భాష
2004 తపన మీరా తెలుగు[8]
2004 అపరిచితన్ కల్యాణి మలయాళం
2008 గంగా కావేరి గంగ కన్నడ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్ మూలాలు
2006 అకెలా మేఘన
2008 ష్ ష్ ష్...కోయ్ హై మనీషా దేశాయ్
కైసీ లగీ లగన్ ప్రాత
2008–2009 శుభ్ కదమ్
2009–2012 లగీ తుజ్సే లగన్ నకుషా పాటిల్ [9]
2009 బైరి పియా అతిథి
నా ఆనా ఈజ్ దేస్ లాడో
2010 రిష్టన్ సే బడి ప్రాత
సరోజ్ ఖాన్‌తో నాచ్లే వె పోటీదారు [10]
2010–2011 ఝలక్ దిఖ్లా జా 4 4వ స్థానం [11]
2011 కామెడీ సర్కస్ కా నయా దౌర్
ససురల్ సిమర్ కా నకుషా పాటిల్ అతిథి
2012 వి సీరియల్ [12]
తేరీ మేరీ లవ్ స్టోరీస్ సలోని [13]
సావధాన్ ఇండియా రేహా [14]
డా. అంజు
ఝలక్ దిఖ్లా జా 5 అతిథి
మూవర్స్ & షేకర్స్ పోటీదారు
2012–2013 నాచ్ బలియే 5 విన్నర్ [15]
2013 దో దిల్ బంధే ఏక్ దోరీ సే అతిథి [16]
2014 కపిల్‌తో కామెడీ నైట్స్ [17]
ఎన్‌కౌంటర్ ఆష్నా [18]
2015 బిగ్ బాస్ 9 అతిథి
2016 [19]
కామెడీ నైట్స్ బచావో [20]
ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 7 పోటీదారు 10వ స్థానం [21]
బాలికా వధూ నందిని శివరాజ్ శేఖర్/నందిని షెకావత్/నందిని క్రిష్ మల్హోత్రా [22]
2018 లాల్ ఇష్క్ సెహెర్
2019 కిచెన్ ఛాంపియన్ 5 అతిథి
బిగ్ బాస్ 13
2020 ముజ్సే షాదీ కరోగే

మూలాలు

[మార్చు]
  1. "Birthday girl Mahhi Vij's savage reply to hubby Jay Bhanushali's question about her age will leave you amazed; Watch". The Times of India. April 2021.
  2. Jay Bhanushali and Mahi Vij's exotic white wedding
  3. "Jay Bhanushali and Mahi Vij re - wedding to put a full stop on split rumor". Dainik Bhaskar. 23 March 2014. Retrieved 28 April 2016. Jay and Maahi secretly got married in the year 2011 and later went public about it
  4. తెలుగు ఫిల్మీబీట్. "తపన". telugu.filmibeat.com. Retrieved 9 May 2018.
  5. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Tapana". www.idlebrain.com. Retrieved 9 May 2018.
  6. "There were times when I didn't have money to pay rent: Mahhi Vij". Hindustan Times. 11 June 2016.
  7. "Mahhi Vij says she never adopted her foster kids Rajveer and Khushi: 'They have parents, we were like a happy family'". Hindustan Times. 19 May 2021. Archived from the original on 2021-05-19. Retrieved 18 August 2022.
  8. తెలుగు ఫిల్మీబీట్. "తపన". telugu.filmibeat.com. Retrieved 9 May 2018.
  9. "Jay Bhanushali is a good husband: Mahhi Vij". The Times of India. 25 February 2012. Retrieved 29 April 2016.
  10. "Dated sets,Bollywood trap haunt Nachle Ve". The Indian Express. 8 November 2010.
  11. "Mahi Vij: Cannot do a show like 'Bigg Boss'". The Times of India. 25 April 2016. Retrieved 29 April 2016.
  12. "Arjit Taneja to expose the truth of 'The Serial'". The Times of India. 10 December 2012. Retrieved 29 April 2016.
  13. "Mahi Vij and Shaheer Sheikh in Star Plus' telefilm". The Times of India. 8 August 2012. Retrieved 29 April 2016.
  14. "Mahhi Vij roped in for Savdhan India". Times Of India Dot Com (in ఇంగ్లీష్). 4 September 2012. Retrieved 4 March 2020.
  15. "Jay, Mahi win Nach Baliye 5". India Today. 24 March 2013.
  16. "Jay-Mahi to shake a leg in 'Do Dil Bandhe Ek Dori Se!'". INDIA TV NEWS. 6 September 2013.
  17. "Mahhi Vij and Jay Bhanushali on Comedy Nights With Kapil". The Times of India. 26 April 2014. Retrieved 29 April 2016.
  18. "Mahi Vij to play gangster on TV show". The Indian Express. 3 June 2014. Retrieved 29 April 2016.
  19. "Bigg Boss 9 Finale: Arjun Kapoor's 'Khatron ke khiladi' team has a double trouble time!". DNA India. 23 January 2016.
  20. "Comedy Nights Bachao episode with Arjun Kapoor and Khatron Ke Khiladi 7 female contestants was super entertaining!". India.com. 1 February 2016.
  21. "'Khatron Ke Khiladi' participant Mahhi Vij's tryst with creepy-crawly creatures". The Indian Express. 7 February 2016. Retrieved 29 April 2016.
  22. "Balika Vadhu: Mahhi Vij joins TV show – Here's what she will essay". Zee News. 7 April 2016. Retrieved 29 April 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=మహి_విజ్&oldid=4168253" నుండి వెలికితీశారు